By: ABP Desam | Updated at : 28 Sep 2023 11:59 AM (IST)
Photo Credit: Sandeep Reddy Vanga/Twitter
బాలీవుడ్ ఆడియన్స్ తో పాటు టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్న 'యానిమల్'(Animal) టీజర్ వచ్చేసింది. 'అర్జున్ రెడ్డి' సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిన సందీప్ రెడ్డి వంగా మరోసారి 'యానిమల్' టీజర్ తో రచ్చ చేశాడు. అర్జున్ రెడ్డిని మించి 'యానిమల్' టీజర్ మరింత వైలెంట్ గా ఉందని చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి సినిమాని హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో సందీప్ రెడ్డి వంగ రీమేక్ చేయగా ఆ సినిమా చూసి బాలీవుడ్ విశ్లేషకులు ఇది మోస్ట్ వయొలెంట్ ఫిలిం అని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ గురించి సందీప్ రెడ్డి మాట్లాడుతూ.. 'అసలు వయొలెన్స్ అంటే ఎలా ఉంటుందో నా నెక్స్ట్ సినిమాలో చూపిస్తానని' చెప్పాడు. చెప్పినట్టుగానే 'యానిమల్' టీజర్ ని వైలెన్స్ తో నింపేశాడు.
ఈరోజు(సెప్టెంబర్ 28) రణబీర్ కపూర్ బర్త్ డే కావడంతో 'యానిమల్' టీజర్ ని విడుదల చేయగా, ఎవరూ ఊహించని విధంగా టీజర్ ఫస్ట్ ప్రైమ్ నుంచే యాక్షన్ మోడ్ లోకి వెళ్ళింది. రష్మిక, రణబీర్ మధ్య డిస్కషన్ తో మొదలైన టీజర్ సెకండ్ షాట్ నుంచి వైలెంట్ మోడ్ లోకి వెళ్ళింది. అనిల్ కపూర్, రణబీర్ కపూర్ మధ్య ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ని టీజర్ తో చూపించే ప్రయత్నం చేశారు. అలాగే రణబీర్ ని మూడు వేరియేషన్స్ లో ప్రజెంట్ చేశారు. ముఖ్యంగా లాంగ్ హెయిర్ లో రణబీర్ అర్జున్ రెడ్డిని మించి కనిపిస్తున్నాడు. సూటు బూటు వేసుకొని వెనక తన మనుషులతో ఉన్న లుక్ లో స్టైలిష్ గ్యాంగ్ స్టర్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత లుంగీ, సల్వార్ లుక్ లోకి మారి ఊర మాస్ గా కనిపించాడు.
టీజర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా చూపించకపోయినా దాని ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రణ్ బీర్ కపూర్ పడిపోయినప్పుడు వచ్చిన షాట్ టీజర్ ఎండ్ లీక్ బాబి డియోల్ ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా ఇచ్చిన ఎక్స్ప్రెషన్ టీజర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. దాదాపు రెండు నిమిషాల 26 సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్ సినిమా పై అంచనాలను పీక్స్ కి తీసుకెళ్ళింది. కొన్నిచోట్ల రణబీర్ కూల్ గా కనిపిస్తే, మరికొన్ని చోట్ల చాలా వైలెంట్ గా కనిపించాడు. టీజర్ లో రణబీర్ ను ఉద్దేశించి అనిల్ కపూర్ మాట్లాడుతూ.." జ్యోతి మనం క్రిమినల్ కొడుకుని కన్నామని" అంటాడు. ఆయన చెప్పిన డైలాగ్ తో రణ్ బీర్ కపూర్ పాత్రలో చాలా షేడ్స్ ఉన్నట్లు స్పష్టమవుతుంది.
"నన్ను ఏ విషయం గురించి అడిగినా నిజాయితీగా ఆన్సర్ చెబుతాను. కానీ మా నాన్న గురించి మాత్రం అడక్కు" అని రష్మికతో హీరో చెప్పే డైలాగ్, "నా ఫాదర్ ఈ ప్రపంచంలో కల్లా బెస్ట్ ఫాదర్" అని అనడం, "నేను చెడును వెంటాడుతూ వెళ్లాను. నాకు ఎక్కడా కనబడలేదు. నాలో నేను చూసుకున్నాను. నా కన్నా చెడ్డవాడు లేడు. నాన్న ఇది ఇప్పుడే మొదలైంది. నేను వాడిని కనిపెట్టాలి. కలవాలి. చంపాలి. మీరు నిరాశ పడకండి నాన్న" అంటూ రణ్ బీర్ చెప్పిన డైలాగ్ టీజర్ కే హైలెట్ గా నిలిచింది. ఓవరాల్ గా సందీప్ రెడ్డి వంగ 'యానిమల్' తో రణబీర్ కపూర్ లోని ఊర మాస్ యాంగిల్ ని బాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ డిసెంబర్ 1 న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది.
Also Read : జనసేనకు విరాళం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో స్టంట్ మ్యాన్ సాయం
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!
Yash19 : యశ్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్ - ఆసక్తి పెంచేసిన గ్లిమ్స్ వీడియో!
‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ, ‘యానిమల్ పార్క్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ
Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - సలార్, డంకీ తో పాటూ 'దేవర' కూడా?
Revanth Reddy Resigns: రేవంత్ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్ లెటర్ అందజేత
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?
/body>