Look Back 2024: భామలు... కొత్త భామలు... టాలీవుడ్‌లో 2024లో స్పార్క్ చూపించిన నలుగురు బ్యూటీలు
2024 Most Promising Debutantes: 2024 సంవత్సరంలో దాదాపు 30 మందికి పైగా హీరోయిన్లు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కానీ వారిలో నలుగురు మాత్రమే చాలా ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు. వారెవరంటే..
2024 Most Promising Debutantes: ఎప్పటిలానే ఈ 2024 సంవత్సరంలో కూడా టాలీవుడ్‌కి కొత్త అందం పరిచయమైంది. ఇయర్ ఎండ్‌కి చేరుకున్నాం.. ఇంకొన్ని గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం.. మరి వెళ్లిపోతున్న సంవత్సరంలోని కొన్ని మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టాలీవుడ్ పరంగా ఈ 2024 సంవత్సరంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. వాటిలో కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మల టాపిక్‌ని తీసుకుంటే.. ఈ సంవత్సరం టాలీవుడ్‌కి అనుభవ అందాలతో పాటు లేలేత అందాలు కూడా పరిచయమయ్యాయి. దాదాపు 30 మంది నూతన హీరోయిన్లు 2024 సంవత్సరంలో టాలీవుడ్‌కి పరిచయం కాగా, అందులో నలుగురు మాత్రమే బాగా ఇంపాక్ట్ చూపించిన భామల్లో ఉన్నారు. ఆ నలుగురు ఎవరంటే..
మిస్టర్ బచ్చన్... బ్యూటిఫుల్ భాగ్యశ్రీ బోర్సే
టాలీవుడ్‌కి 2024లో పరిచయమైన బ్యూటీ భామల్లో భాగ్యశ్రీ బోర్సే మొదటి స్థానంలో నిలుస్తుంది. ఆమె నటించిన సినిమా హిట్ అయితే కాలేదు కానీ.. ఆమె సౌందర్యం మాత్రం అందరినీ మైమరపించింది. మాస్ మహారాజా రవితేజతో బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ రూపొందించిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే టాలీవుడ్ అరంగేట్రం చేసింది. సినిమా సక్సెస్ అయితే కాలేదు కానీ, ఆమె నటనకు, ముఖ్యంగా ఆమె గ్లామర్‌కు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఆ సౌందర్యంతోనే ఇప్పుడు దుల్కర్ సల్మాన్, రామ్ పోతినేని నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది.
దేవర... నయా అతిలోక సుందరి జాన్వీరా!
2024 టాలీవుడ్‌కి పరిచయమైన భామల్లో జాన్వీ కపూర్ ఒకరు. ఎప్పటి నుండో జాన్వీ టాలీవుడ్ అరంగేట్రానికి సంబంధించి వార్తలు వినిపిస్తున్నా.. చివరికి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవర’ సినిమాతో ఆమె టాలీవుడ్‌కి పరిచయమైంది. శ్రీదేవి కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఈ సినిమాతో సక్సెస్ సాధించడమే కాకుండా.. వెంటనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాలోనూ ఛాన్స్ దక్కించుకుంది. ఇక ‘దేవర’లో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. తన గ్లామర్, తెరపై దానిని ప్రదర్శించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచాయి. దీంతో 2024లో టాలీవుడ్ హాట్ ఫిగర్‌గా ఆమె నిలిచింది.
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చేసినా... రుక్మిణి!
రుక్మిణి వసంత్.. 2024లో డైరెక్ట్ టాలీవుడ్ చిత్రంతో అరంగేట్రం చేసినా.. అంతకు ముందే ఈ భామ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ‘సప్త సాగరాలు దాటి’ సిరీస్ చిత్రాలతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. డైరెక్ట్ టాలీవుడ్ ఎంట్రీ చిత్రం కోసం 2021లోనే సైన్ చేసింది. నిఖిల్ హీరోగా 2024లో వచ్చిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా 2021లో రెడీ అయినా.. 2024లో ఆ సినిమా విడుదలైంది. అయితే అంతకు ముందు ఆమె నటించిన ‘సప్త సాగరాలు దాటి’ సినిమా మంచి గుర్తింపును తెచ్చుకోవడంతో పాటు, అందులో ఆమె నటన.. ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగేలా చేసింది. కానీ, ప్రేక్షకులను ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మెప్పించలేకపోయింది. మరో డబ్బింగ్ చిత్రం ‘భఘీరా’ కూడా ఆమెకు హిట్‌ని ఇవ్వలేకపోయింది. అయితేనేం, ఇప్పుడీ భామకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశం వస్తున్నట్లుగా టాక్ నడుస్తుంది.
Also Read: బాలీవుడ్‌లో ఈ ఐదుగురు హీరోలు డిజప్పాయింట్ చేశారబ్బా... ఒక్కటంటే ఒక్కటి కూడా రాలే
ఆయ్... క... బెంచ్ లైఫ్... నయన్ సారిక!
చిన్న హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. అత్యధిక సక్సెస్ రేట్ పొందిన హీరోయిన్‌గా నయన్ సారిక ఈ సంవత్సరంలో ముందు వరసలో ఉంది. ఆమె నుండి 2024లో మూడు సినిమాలు రాగా, అందులో రెండు సినిమాలు పెద్ద హిట్‌గా నిలిచాయి. ఒకటి మాత్రం యావరేజ్‌కి పరిమితమైంది. ‘గం గం గణేశా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఆ సినిమాతో సక్సెస్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఆమె నుండి వచ్చిన ‘ఆయ్’, ‘క’ సినిమాలు బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను సొంతం చేసుకున్నాయి. విశేషం ఏమిటంటే.. ఈ రెండు సినిమాల్లోనూ ఆమె పల్లెటూరి అమ్మాయిగా కనిపించడం. ఈ రెండు సక్సెస్‌లతో ఆమె పేరు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో మంచి మంచి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది.
ఇంకా ఈ సంవత్సరం ‘కల్కి 2898 AD’తో దీపికా పదుకొణె- అన్నా బెన్, ‘ఆపరేషన్ వాలంటైన్’తో మానుషి చిల్లర్, ‘ఓం భీమ్ బుష్’తో ప్రీతి ముకుందన్, ‘ప్రతినిధి 2’తో శిరిషా లెల్లా, ‘కృష్ణమ్మ’ సినిమాతో అతిర రాజి వంటి వారంతా ఈ సంవత్సరం టాలీవుడ్‌లో అడుగుపెట్టిన వారి లిస్ట్‌లో ఉన్నారు.
Read Also: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే