Leo Ticket Price : బెంగళూరులో విజయ్ సినిమా టికెట్ రేటు యమ ఘాటు - 'లియో'కి 2500 ఏంటి స్వామి?
Leo Movie Advance Booking Trends : బెంగళూరులో 'లియో' సినిమా చూడాలంటే ఒక్క టిక్కెట్టుకు 2500 రూపాయలు ఖర్చు చేయాలి. అక్షరాలా ఇది నిజం!
సినిమా టికెట్ రేటు ఎంత? సింగిల్ స్క్రీన్ థియేటర్లలో, కొన్ని ఏరియాల్లో మినిమమ్ 20 నుంచి 50 రూపాయల వరకు ఉంటుంది. బాల్కనీ రేటు 100 నుంచి మొదలు అవుతుంది. రూ. 250 వరకు ఉంటుంది. మల్టీప్లెక్స్ స్క్రీన్లకు వస్తే... నేల టికెట్, బెంచ్ & బాల్కనీ అంటూ సపరేటుగా ఉండవు. కింద నుంచి పై వరకు ఒకటే రేటు... రూ. 150 నుంచి రూ. 250 లేదా రూ. 300 ఉంటుంది. రిక్లైనర్ సీట్ టికెట్ రేట్స్ అయితే రూ. 300 నుంచి రూ. 500 వరకు ఉంటాయి.
బట్, ఫర్ ఏ ఛేంజ్... ఒక్క టికెట్టుకు రూ. 2300 నుంచి రూ. 2500 ఖర్చు పెట్టాలి అని చెబితే! నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ... ఇది అక్షరాలా నిజం! అది విజయ్ సినిమా కోసం! అసలు వివరాల్లోకి వెళితే...
బెంగళూరులో 'లియో' టికెట్ రూ. 2500!
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ (Vijay) కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఫిల్మ్ 'లియో' (Leo Movie). విజయ దశమి సందర్భంగా ఈ నెల 19న సినిమా విడుదల అవుతోంది. ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ చేశారు. బెంగళూరులోని పీవీఆర్ నెక్సస్ మాల్ (PVR Nexus Bengaluru)లో ఐమ్యాక్స్ స్క్రీన్ మీద 'లియో' సినిమా గనుక చూడాలంటే... రూ. 2300 లేదా రూ. 2500 రేటు పెట్టి టికెట్ కొనాలి.
బెంగళూరులోని కొన్ని మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 'లియో' మార్నింగ్ షో టికెట్ రేట్లు రూ. 1000 ఉన్నాయి. అది మినిమమ్ రేటు! ఢిల్లీతో పాటు కొన్ని ఏరియాలలో 'లియో' టికెట్ రేట్లు రూ. 700 నుంచి రూ. 1000 వరకు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని మల్టీప్లెక్స్ స్క్రీన్లలో 'లియో' టికెట్ రేట్లు రూ. 295 ఉన్నాయి.
Also Read : పెద్ద మావయ్య శంకర్ దాదా... చిన్న మావయ్య గుడుంబా శంకర్... ఇప్పుడు మేనల్లుడు 'గాంజా శంకర్'
'లియో' సినిమాపై పూజా కార్యక్రమాల నుంచి మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో విజయ్ హీరో కావడం, ఆ తర్వాత 'విక్రమ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో అంచనాలు అంతకు అంతకు పెరిగాయి. అయితే... ట్రైలర్ విడుదల తర్వాత ఆ అంచనాలు కొంచెం తగ్గాయని చెప్పాలి. విజయ్ నటన మీద కూడా విమర్శలు వచ్చాయి. పాటల్లో తెలుగు సాహిత్యం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి.
Also Read : లేడీ సింగం శక్తి శెట్టిని చూశారా? - 'సింగం ఎగైన్'లో దీపికా పదుకోన్ ఫస్ట్ లుక్
'లియో' చిత్రాన్ని సెవెన్ స్కీన్స్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళానిసామి నిర్మించారు. ఇందులో విజయ్ జోడీగా త్రిష నటించారు. ప్రియా ఆనంద్ కీలక పాత్ర చేశారు. సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, తమిళ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, నటుడు మన్సూర్ అలీ ఖాన్, మలయాళ నటుడు మాథ్యూ తదితరులు ఉన్నారు. తెలుగులో ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత దర్శకుడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial