(Source: ECI/ABP News/ABP Majha)
Leo: 'లియో' తెలుగు టైటిల్ కోసం నిర్మాత అన్ని లక్షలు ఖర్చు పెట్టారా?
'లియో' తెలుగు టైటిల్ విషయంలో హైదరాబాద్ సివిల్ కోర్ట్ స్టే ఇస్తూ రిలీజ్ వాయిదా వేయగా.. తాజాగా నిర్మాత నాగ వంశీ టైటిల్ పై కేసు పెట్టిన వ్యక్తికి రూ.26 లక్షలు చెల్లించి టైటిల్ సొంతం చేసుకున్నారు.
'ఖైదీ మూవీతో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గత ఏడాది 'విక్రమ్' మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు దళపతి విజయ్ తో 'లియో'(Leo) అనే సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. 'మాస్టర్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ - విజయ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై సౌత్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళం తో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల అవుతుండగా లియో తెలుగు వెర్షన్ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'ఖైదీ', 'విక్రమ్' వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు లోకేష్ కనగరాజ్.
అలాగే కోలీవుడ్ హీరో విజయ్ కి తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో తెలుగులోనూ 'లియో' కి భారీగా బిజినెస్ జరిగింది. ఈ చిత్ర తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నారు. అయితే ఈ మూవీ తెలుగు వర్షన్ రిలీజ్ విషయంలో డిస్ట్రిబ్యూటర్ కి చివరి నిమిషంలో భారీ షాక్ తగిలింది. 'లియో' సినిమాని అదే టైటిల్ తో తెలుగులో విడుదల చేయడానికి వీలులేదని, ఆల్రెడీ తెలుగులో ఈ టైటిల్ రిజిస్టర్ చేసుకున్నట్టుగా కోర్టులో కేసు వేయడంతో హైదరాబాద్ సివిల్ కోర్టు లియో తెలుగు వెర్షన్ రిలీజ్ పై స్టే విధించింది.
దీంతో రంగంలోకి దిగిన నిర్మాత నాగ వంశీ టైటిల్ విషయంలో కేసు వేసిన వ్యక్తికి భారీ మొత్తం చెల్లించి టైటిల్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు 'లియో' తెలుగు టైటిల్ సెటిల్మెంట్ కోసం ఏకంగా రూ.26 లక్షలు చెల్లించి టైటిల్ ని తీసుకున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. దీంతో ఫైనల్ గా టైటిల్ ఇష్యు సెటిల్ అవ్వడంతో తెలుగులో లియో రిలీజ్ కి ఎలాంటి ఇబ్బంది లేదని అంటున్నారు. ఇందులో భాగంగానే ముందు అనుకున్న రిలీజ్ డేట్ అక్టోబర్ 19నే లియో తెలుగులో రిలీజ్ కానున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 'లియో' మూవీకి రూ.454 కోట్ల బిజినెస్ జరిగింది. ఇందులో డిజిటల్ రైట్స్ రూ.140 కోట్ల కు అమ్ముడవడం విశేషం.
తెలుగులో లియో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని సితార నిర్మాత నాగ వంశీ ఏకంగా రూ.22 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఓ డబ్బింగ్ మూవీకి ఈ రేంజ్ లో ఖర్చు చేయడం అంటే మాములు విషయం కాదు. ఇక 'లియో' విషయానికి వస్తే.. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.ఎస్ లలిత్ కుమార్ దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్1 ఇండియా స్థాయిలో నిర్మించగా కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. విజయ్ సరసన త్రిష కథానాయికగా నటించగా.. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీ ఖాన్, గౌతమ్ మీనన్, మిస్కిన్, మ్యాథ్యు ఇతర కీలకపాత్రలు పోషించారు.
Also Read : విజయ్ ఫ్యాన్స్‌కి భారీ షాక్ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం - 'లియో' షోస్ రద్దు?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial