అన్వేషించండి

విజయ్ ఫ్యాన్స్‌కి భారీ షాక్ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం - 'లియో' షోస్ రద్దు?

'లియో' చిత్ర యూనిట్ తమిళనాడు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. తమిళనాడులో లియో ఎర్లీ మార్నింగ్ షోస్ వేయడాన్ని అక్కడి ప్రభుత్వం నిషేధించింది.

కోలీవుడ్లో మరికొద్ది గంటల్లో తలపతి విజయ్ నటించిన 'లియో'(Leo) మూవీ థియేటర్స్ లో సందడి చేయబోతోంది. సౌత్ లోనే మోస్ట్ అవైటెడ్ మూవీ గా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ తో అక్టోబర్ 19 న రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి తాజాగా తమిళనాడు ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. 'లియో' మూవీకి సంబంధించి తమిళనాడులో ఎర్లీ మార్నింగ్ షోస్ వేయడాన్ని అక్కడి ప్రభుత్వం నిషేధించింది. ఉదయం 7 గంటల షో క్యాన్సిల్ చేసి 9 గంటల ఆట నుంచి లియో చిత్రాన్ని థియేటర్స్ లో ప్రదర్శించుకోవచ్చు అని ఉత్తర్వులు జారీ చేసింది. లియో నిర్మాతలు ఎర్లీ మార్నింగ్ షోస్ తో సినిమాని ప్రదర్శింపజేసేలా తమిళనాడు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

కానీ ప్రభుత్వం అందుకు నిరాకరణ తెలుపుతూ 7 గంటల షో కాకుండా 9 గంటలకు షో ప్రారంభమయ్యేలా అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం అనుమతి లేకుండా ఎవరైనా మార్నింగ్ షోస్ వేస్తే థియేటర్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. అలాగే రిలీజ్ రోజు థియేటర్స్ బయట ట్రాఫిక్ కి అంతరాయం కలిగించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఓపెనింగ్ రోజు రికార్డ్ కలెక్షన్స్ తో సరికొత్త రికార్డ్ సెట్ చేయాలనుకున్న ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశ ఎదురైంది. తమిళనాడు ప్రభుత్వం సడన్ గా ఇలా ఎర్లీ మార్నింగ్ షో క్యాన్సిల్ చేయడం సినిమా యూనిట్ కి ఇది పెద్ద దెబ్బేనని విశ్లేషకులు చెబుతున్నారు.

నిజానికి మొదటి నుంచి ఈ చిత్రానికి పలు ఇబ్బందులు తలెత్తుతూ వచ్చాయి. మొదట లియో మూవీ ఆడియో లాంచ్ ని చెన్నైలో నిర్వహించాలని అనుకోగా అందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఆ తర్వాత దుబాయ్ లో ఈవెంట్ ప్లాన్ చేసినా అక్కడ వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ షో ని క్యాన్సిల్ చేసి షాక్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇటీవల లియో నిర్మాతలు తమిళనాడు ప్రభుత్వానికి బెనిఫిట్ షోలకు అనుమతి కోరగా.. అందుకు సానుకూలంగా స్పందించి 5 ఆటలు ప్రదర్శించేందుకు అనుమతిచ్చింది. అక్టోబ‌ర్ 19 నుంచి 24 వ‌ర‌కు ‘లియో’ సినిమా 5 షోల‌కు అనుమతిస్తూ త‌మిళనాడు ప్రభుత్వం జీవో జారీ చేసింది.

కానీ ఇప్పుడేమో ఉదయం 7 గంటల షోని క్యాన్సిల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సంస్థ రెడ్ జాయింట్ మూవీస్ కి లియో సినిమా హక్కులు ఇవ్వకపోవడం వల్లే ప్రభుత్వం మార్నింగ్ షోస్ క్యాన్సిల్ చేశారని కోలీవుడ్లో టాక్ నడుస్తోంది. కాగా లియో మూవీని పాన్ ఇండియా స్థాయిలో తమిళం తో పాటు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. తమిళం తో పాటు తెలుగులోనూ లియో మూవీకి ఎక్కువ థియేటర్స్ దొరికాయి. దీంతో బుకింగ్స్ కూడా పర్వాలేదు అనే స్థాయిలో జరుగుతున్నాయి. ఓవర్సీస్ లో మాత్రం లియో క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇప్పటికే లియో అడ్వాన్స్ బుకింగ్స్ వన్ మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకొని సరికొత్త రికార్డు క్రియేట్ విశేషం. 

Also Read : 'సర్వం శక్తిమయం' ట్రైలర్ రిలీజ్ చేసిన రవితేజ - అష్టాదశ శక్తిపీఠాల అద్భుత కథ ఇది!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Union Cabinet: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
Allu Arjun: మహిళా అభిమాని మృతిపై అల్లు అర్జున్ ఎమోషనల్ - 25 లక్షల సాయం, ఆ ఫ్యామిలీకి భరోసా
మహిళా అభిమాని మృతిపై అల్లు అర్జున్ ఎమోషనల్ - 25 లక్షల సాయం, ఆ ఫ్యామిలీకి భరోసా
Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Range Rover Vs Rolls Royce: రేంజ్ రోవర్ వర్సెస్ రోల్స్ రాయిస్ - ఈఎంఐతో కొనడం ఎలా? - లక్షల్లో కట్టాల్సిందేనా!
రేంజ్ రోవర్ వర్సెస్ రోల్స్ రాయిస్ - ఈఎంఐతో కొనడం ఎలా? - లక్షల్లో కట్టాల్సిందేనా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Siraj Throw ball to Marnus Labuschagne | లబుషేన్ పై బాల్ గిరాటేసిన సిరాజ్ | ABP DesamAus vs Ind 2nd Test Day 1 Highlights | రెండో టెస్టులో టీమిండియాను ఆడేసుకుంటున్న ఆస్ట్రేలియా | ABPతిరుమలలో పంచమితీర్థం, అస్సలు మిస్ అవ్వొద్దువిజయవాడలో రెచ్చిపోయిన  గంజాయి, బ్లేడ్ బ్యాచ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Union Cabinet: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ - ఏపీలో 8 కేంద్రీయ, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు, కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
Allu Arjun: మహిళా అభిమాని మృతిపై అల్లు అర్జున్ ఎమోషనల్ - 25 లక్షల సాయం, ఆ ఫ్యామిలీకి భరోసా
మహిళా అభిమాని మృతిపై అల్లు అర్జున్ ఎమోషనల్ - 25 లక్షల సాయం, ఆ ఫ్యామిలీకి భరోసా
Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Range Rover Vs Rolls Royce: రేంజ్ రోవర్ వర్సెస్ రోల్స్ రాయిస్ - ఈఎంఐతో కొనడం ఎలా? - లక్షల్లో కట్టాల్సిందేనా!
రేంజ్ రోవర్ వర్సెస్ రోల్స్ రాయిస్ - ఈఎంఐతో కొనడం ఎలా? - లక్షల్లో కట్టాల్సిందేనా!
Telangana Mother Statue : తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ -  రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
తెలంగాణ తల్లి విగ్రహం ఫస్ట్ లుక్ - రేవంత్ తెలంగాణ ప్రజల్ని మెప్పించినట్లేనా ?
Airtel Vs Jio: ఈ ఎయిర్‌టెల్, జియో ప్లాన్లు రూ.100 లోపే - మరి ఏ లాభాలు లభిస్తాయి?
ఈ ఎయిర్‌టెల్, జియో ప్లాన్లు రూ.100 లోపే - మరి ఏ లాభాలు లభిస్తాయి?
Pushpa 2: ఫేక్ డైలాగ్స్ షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం - 'పుష్ప 2' ప్రొడక్షన్ హౌస్ వార్నింగ్
ఫేక్ డైలాగ్స్ షేర్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం - 'పుష్ప 2' ప్రొడక్షన్ హౌస్ వార్నింగ్
YSRCP MP: పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
పవన్ క్రేజ్ దేశం మొత్తం వ్యాపించింది - సీఎం కావాల్సిందే - వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Embed widget