Sarvam Shakthi Mayam Trailer: 'సర్వం శక్తిమయం' ట్రైలర్ రిలీజ్ చేసిన రవితేజ - అష్టాదశ శక్తిపీఠాల అద్భుత కథ ఇది!
ప్రియమణి ప్రధానపాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'సర్వం శక్తిమయం'. త్వరలో ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ట్రైలర్ ను హీరో రవితేజ ఆవిష్కరించారు. ఇందులో అష్టాదశ శక్తిపీఠాలను చూపించబోతున్నారు.
![Sarvam Shakthi Mayam Trailer: 'సర్వం శక్తిమయం' ట్రైలర్ రిలీజ్ చేసిన రవితేజ - అష్టాదశ శక్తిపీఠాల అద్భుత కథ ఇది! Hero Ravi Teja unveils the trailer of Sarvam Shakti Mayam Sarvam Shakthi Mayam Trailer: 'సర్వం శక్తిమయం' ట్రైలర్ రిలీజ్ చేసిన రవితేజ - అష్టాదశ శక్తిపీఠాల అద్భుత కథ ఇది!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/18/74a7c160d1d0e8f411725a79b5b9ae9f1697617863954544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణి ప్రియమణి. గడిచిన రెండు దశాబ్దాలుగా టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ‘ఎవరే అతగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ‘పెళ్లైన కొత్తలో’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో ప్రేక్షకుల మదిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆ తర్వాత ‘హరే రామ్’, ‘ద్రోణ’, ‘గోలీమార్’, ‘శంభో శివ శంభో’, ‘యమదొంగ’ ‘రగడ’, ‘విరాటపర్వం’, ‘నారప్ప’, ‘జవాన్’ లాంటి చిత్రాలతో అలరించింది.
‘భామాకలాపం’ చిత్రంతో ఓటీటీలోకి ప్రియమణి ఎంట్రీ
రీసెంట్ గా ‘భామాకలాపం’ చిత్రంతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ‘సర్వం శక్తిమయం’ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను భక్తిరసంలో ముంచబోతోంది. ఈ వెబ్ సిరీస్ లో ప్రియమణితో కలిసి సంజయ్ సూరి మరో ప్రధానపాత్రలో నటించబోతున్నారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ కు బీవీఎస్ రవి కథ అందించారు. అంకిత్, విజయ్ చాడ, కౌముది కే నేమాని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
'సర్వం శక్తిమయం' ట్రైలర్ ఆవిష్కరించిన రవితేజ
ఈ భక్తిరస ప్రధానమైన వెబ్ సిరీస్ 'ఆహా' ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దసరా పర్వదిన కానుకగా, ఈ నెల 20వ తేదీ నుంచి 'సర్వం శక్తిమయం' అనే వెబ్ సిరీస్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను మాస్ మహారాజా రవితేజ విడుదల చేశారు.
View this post on Instagram
18 శక్తి పీఠాల కథ 'సర్వం శక్తిమయం'
ఈ వెబ్ సిరీస్ కథ 18 శక్తి పీఠాల చుట్టూ తిరుగుతోంది. 10 ఎపిసోడ్స్ గా రూపొందించిన ఈ సిరీస్, అష్టాదశ శక్తి పీఠాలను పరిచయం చేస్తూ ముందుకుసాగుతోంది. ఒక కుటుంబం శక్తి పీఠాలను చూడటానికి విహారయాత్రకు బయల్దేరడం, ఆ శక్తి పీఠాలపై పరిశోధన చేసే ఓ పరిశోధకుడికి వాళ్లు పరిచయం కావడంతో సిరీస్ మొదలవుతుంది. అష్టాదశ శక్తిపీఠాలు ఏర్పడటానికి కారణం, శక్తి పీఠాల వైభవం, ఆదిశంకరాచార్యుల ప్రస్తావన, శక్తిపీఠాలతో ముడిపడిన విశేషాలను ఈ వెబ్ సిరీస్ లో మేకర్స్ ఆవిష్కరించనున్నారు. ఈ సిరీస్ లో ప్రియమణి, సంజయ్ సూరిలతో పాటు సమీర్ సోని, సుబ్బరాజు, అభయ్ సింహా, అశ్లేష ఠాకూర్, కుషితా కల్లాపు సహా పలువురు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ మూవీలో కీలపాత్ర పోషించింది ప్రియమణి. అట్లీ దర్శకత్వం వహించిన ‘జవాన్’ చిత్రంలో, షారుఖ్ కు సాయం చేసే ఆరుగురు స్త్రీలలో ఒకరైన లక్ష్మి పాత్రలో కనిపించింది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది.
Read Also: సెకెండ్ మ్యారేజ్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నానంటే?- అసలు విషయం చెప్పిన రేణు దేశాయ్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)