(Source: ECI/ABP News/ABP Majha)
Lavanya Tripathi Marriage: నా పెళ్లికి చిరంజీవి వస్తారు - 11 ఏళ్ల కిందటే చెప్పిన లావణ్య, వీడియో వైరల్
తన పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి వస్తారని హీరోయిన్ లావణ్య త్రిపాఠి 11 ఏండ్ల క్రితమే చెప్పింది. తాజాగా ఆమె మాట నిజం అయ్యింది. నమ్మట్లేరా? అయితే ఈ వీడియో చూడండి!
మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్ 1న ఇటలీలో వీరిద్దరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. టస్కానిలోని బార్గో సాన్ ఫెలిసే రిసార్ట్ లో బుధవారం మధ్యాహ్నం 2.48 గంటలకు లావణ్య మెడలో వరుణ్ తాళి కట్టారు. సంసార జీవితంలోకి అఫీషియల్ గా అడుగు పెట్టారు. ఈ పెళ్లి వేడుకలో కొణిదెల, అల్లు కుటుంబ సభ్యులతో పాటు కామినేని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అటు వరుణ్, లావణ్య దగ్గరి మిత్రులు కూడా పెళ్లికి హాజరయ్యారు. హీరో నితిన్ దంపతులు సైతం ఈ పెళ్లిలో పాల్గొన్నారు. ఇక ఈ వివాహ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
దశాబ్దం తర్వాత నిజమైన లావణ్య మాటలు
నిజానికి తన పెళ్లికి మెగా స్టార్ చిరంజీవి తన పెళ్లికి వస్తారని లావణ్య 11 సంవత్సరాల క్రితమే చెప్పింది. అప్పుడు తను చెప్పిన మాటలు ఇప్పుడు నిజం అయ్యాయి. ఇంతకీ తను అప్పుడు ఏ సందర్భంలో ఈ మాటలు చెప్పిందంటే? లావణ్య ‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందానికి, అభినయంతో అద్భుతంగా అలరించింది. ఈ చిత్రంలో మిథున పాత్రలో ఒదిగిపోయి నటించింది. సినిమాలో భాగంగా ఒక సన్నివేశంలో లావణ్య త్రిపాఠి పెళ్లికి చిరంజీవి వస్తున్నారని డైలాగ్ పెట్టారు దర్శకుడు హను రాఘవపూడి. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి ఇష్టం లేని మిథున ఇంట్లో ఓ చోట నిల్చుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు పిల్లలు ఆమె దగ్గరకు వెళ్తారు. మిథునక్కా.. మీ పెళ్లికి సినిమా యాక్టర్లు వస్తున్నారంట కదా. చిరంజీవి కూడా వస్తున్నాడా? అని అడుగుతారు. దీనికి ఆమె అవునని చెప్తుంది. ఈ సినిమా విడుదలైన 11 ఏళ్లకు వరుణ్ తేజ్‌ను పెళ్లి చేసుకుని కొణిదెల వారి కోడలు అయ్యింది లావణ్య. ఆమె చెప్పిన మాట దశాబ్దం తర్వాత నిజం అయ్యింది.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న‘అందాల రాక్షసి’ డైలాగ్
‘అందాల రాక్షసి’ సినిమాలో దర్శకుడు హను రాఘవపూడి పెట్టిన ఈ డైలాగ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి తొలి సినిమాలోని డైలాగ్ నిజం అయ్యిందని పెడుతున్నారు. గతంలో అల్లు అరవింద్ కూడా లావణ్య పెళ్లి గురించి చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. ‘చావు కబురు చల్లగా’ ప్రమోషనల్ “ఎక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి తెలుగు నేర్చుకుని చక్కగా మాట్లాడుతుంది ఈ అమ్మాయి. ఇక్కడే ఒక తెలుగు కుర్రాడిని చూసి పెళ్లిచేసుకుని సెటిల్ అయిపోవచ్చు కదా” అంటారు. ఆయన అన్నట్లుగానే తన బంధువుల అబ్బాయినే చేసుకోవడం విశేషం.
Read Also: సెన్సార్ అనేది అవుట్ డేటెడ్ సిస్టమ్, చట్టప్రకారం ‘వ్యూహం’ విడుదల అవుతుంది: ఆర్జీవీ
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial