అన్వేషించండి

Director Shiva Nirvana: ‘ఖుషి’లో విజయ్, సామ్ ముద్దులు - ఆ ఫీలింగ్ కలగాలనే అలా: దర్శకుడు శివ నిర్వాణ

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ ఇవాళ (సెప్టెంబర్1న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దర్శకుడు, లిప్‌లాక్‌ సీన్స్‌ పై క్లారిటీ ఇచ్చారు.

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సౌత్ క్వీన్ సమంత రూత్ ప్రభు జంటగా నటించిన తాజా చిత్రం 'ఖుషి'. డైరెక్టర్ శివ నిర్వాణ ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ని తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ ప్రేమకథా చిత్రం ఇవాళ (సెప్టెంబర్‌ 1న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రంలో విజయ్, సామ్ నటన అద్భుతంగా ఉందనే టాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ సినిమాకు సంబంధించిన పలు విషయాలు వెల్లడించారు.

లిప్ లాక్ సీన్ల గురించి వివరణ ఇచ్చిన దర్శకుడు  

ఈ సినిమాలో రెండు లిప్ లాక్ సీన్లు పెట్టడంపై దర్శకుడు వివరణ ఇచ్చారు. ఆరాధ్య అనే పాత్రకు ఈ లిప్ లాక్ సీన్లు చాలా అవసరం అని చెప్పారు. అందుకే వీటిని పెట్టాల్సి వచ్చిందన్నారు. ప్రేమ పెళ్లి, పిల్లలు లాంటి ఎమోషన్స్ పెట్టినప్పుడు ఈ చిన్నపాటి ముద్దూ ముచ్చటా లేకుంటే అస్సలు బాగోదని చెప్పారు. వాళ్లు నిజమైన భార్య భర్తలనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలగాలని, అందుకే ఆ సీన్లు పెట్టినట్లు చెప్పారు. ఇక ఈ సీన్ల గురించి హీరో హీరోయిన్లు ఎలాంటి ఇబ్బంది పడలేదన్నారు. యాక్షన్‌ అన్నప్పుడు చేసి, కట్‌ అనగానే సీన్‌ కంప్లీట్ అయిపోయేదన్నారు. వారు జస్ట్ సినిమా కోసం చేస్తున్న వర్క్ లాగే ఫీలయ్యారని చెప్పారు.

ఆయన కచ్చితంగా ఓ వర్గానికి చెందిన ప్రతినిధి!

ఇక ఈ చిత్రంలో మురళీ శర్మను కచ్చితంగా ఒక వర్గానికి ప్రతినిధిగానే చూపించినట్లు చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి వివాదం అవసరం లేదన్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించే వారి కోసమే చదరంగం శ్రీనివాసరావు క్యారెక్టర్ ను రూపొందించినట్లు వివరించారు. దేవుడికి నిజాయితీగా సేవల చేయాలనుకునే వర్గం వారి కోసమే ఈ పాత్రను పెట్టామన్నారు. ఇతర వర్గాలకు ఈ క్యారెక్టర్ తో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. 

నేనూ దాన్ని బలంగా నమ్ముతా!

ఇక సినిమా గురించి వివరించిన దర్శకుడు శివ ప్రతి మధ్యతరగతి కుటుంబలో ఓ హీరో ఉంటాడని చెప్పారు. నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడటంలోనే హీరోయిజం ఉంటుందన్నారు. అదే తానూ నమ్ముతానని చెప్పారు. ఆ నమ్మకం ఆధారంగానే ఈ సినిమా కథ, పాత్రలను రూపొందించినట్లు చెప్పారు. సిద్ధాంతాలు, నమ్మకాల కంటే మనిషిగా విజయం సాధించిడం ముఖ్యం అనే సందేశం ఇవ్వడం కోసమే ఈ సినిమాను తెరకెక్కించినట్లు వివరించారు. అనుకున్నది సాధించినట్లు శివ సంతోషం వ్యక్తం చేశారు.  ఇక నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ నిర్మించిన ‘ఖుషి’ సినిమాకి 'హృదయం' ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు.   ఈ చిత్రంలో జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  

Read Also: నాపై రెండుసార్లు అత్యాచారం చేశాడు, సహ నటుడిపై నటి పోలీస్ కంప్లైంట్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Embed widget