Murari Re Release: ‘మురారీ’ మళ్లీ వస్తున్నాడు, రీరిలీజ్‌కు కృష్ణవంశీ నిర్ణయం - 18 నిమిషాల సీన్స్ కట్?
Murari Re Release: 2001లో మహేశ్ బాబు, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మురారి’ క్లాసిక్ హిట్‌గా నిలిచింది. ఇన్నాళ్ల తర్వాత మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ మళ్లీ విడుదల కానుంది.
Murari Movie Re Release: ఈరోజుల్లో స్టార్ హీరోలు ఒక సినిమాకు, మరొక సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. అందుకే వారి నుంచి ఏడాదికి ఒక సినిమా కూడా రావడం కష్టమయిపోతుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఇప్పుడు అదే కేటగిరిలో యాడ్ అవ్వనున్నారు. మహేశ్ కచ్చితంగా ఏడాదికి ఒక సినిమా విడుదలయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అది కూడా కుదరకపోతే ఏడాదిన్నరకు ఒక మూవీతో వస్తారు. అలాంటిది రాజమౌళితో ప్రాజెక్ట్ సైన్ చేయడంతో మరో నాలుగేళ్ల వరకు స్క్రీన్‌పై ఈ హీరోను చూడడం కష్టమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ఇంతలోనే ‘మురారి’ రీ రిలీజ్ వారికి కాస్త రిలీఫ్ ఇస్తోంది.
23 ఏళ్ల తర్వాత..
సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్‌లో ఎన్నో గుర్తుండిపోయే సినిమాలు ఉన్నాయి. తన కెరీర్ మొదట్లోనే ఎన్నో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌లో నటించారు మహేశ్. అందులో ‘మురారి’ కూడా ఒకటి. 2001లో విడుదలయిన ఈ చిత్రాన్ని కృష్ణవంశీ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా.. మహేశ్‌ను ఫ్యామిలీ ఆడియన్స్‌కు మరింత దగ్గర చేసింది. ఆగస్ట్ 9న మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ రి రిలీజ్‌ను ప్లాన్ చేశారు మేకర్స్. దీంతో ఆరోజు మహేశ్, రాజమౌళి మూవీ అప్డేట్ వస్తుందని అనుకున్న ఫ్యాన్స్.. ‘మురారి’తో తృప్తిపడాలని ఫిక్స్ అయ్యారు. ఇంతలోనే ఈ సినిమా మునుపటిలాగా కాకుండా కొన్ని మార్పులతో విడుదల కానుందని తెలుస్తోంది.
స్పెషల్ స్క్రీనింగ్..
‘మురారి’ని ఇప్పటి ప్రేక్షకులకు దగ్గర చేయడం కోసం దర్శకుడు కృష్ణవంశీ ఒక కొత్త ప్లాన్‌తో ముందుకొచ్చారట. సినిమాను 18 నిమిషాలు ట్రిమ్ చేశారట. ఇది ఈ క్లాసిక్ సినిమాకు కొత్త టచ్‌ను ఇస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ రీ రిలీజ్ కోసం మహేశ్ బాబుతో పాటు తన భార్య నమ్రత, కూతురు సితార కూడా ఒక స్పెషల్ స్క్రీనింగ్‌కు హాజరు కానున్నారని సమాచారం. ‘మురారి’లో హీరోయిన్‌గా నటించిన సోనాలి బింద్రే కూడా ఈ స్పెషల్ స్క్రీనింగ్‌లో జాయిన్ అవ్వనుందనే న్యూస్.. ఫ్యాన్స్‌ను మరింత ఎగ్జైట్ చేస్తోంది. దీంతో పాటు ‘మురారి’ రీ రిలీజ్ సందర్భంగా ఒక పెళ్లి కార్డ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Ghattamaneni vari wedding invitation #MurariMarosari #Murari #Murari4K pic.twitter.com/HpzOTfhYWC
— MASSMB™ (@MASSMB_FC) July 17, 2024
చివరిగా ‘గుంటూరు కారం’..
మహేశ్ బాబు చివరిగా ‘గుంటూరు కారం’ మూవీతో ప్రేక్షకులను అలరించారు. 2024 సంక్రాంతికి విడుదలయిన ఈ సినిమా.. యావరేజ్ టాక్ అందుకున్నా కూడా కలెక్షన్స్ విషయంలో మాత్రం దూసుకుపోయింది. పైగా మునుపెన్నడూ లేని విధంగా ‘గుంటూరు కారం’లో డ్యాన్స్‌తో ఫ్యాన్స్‌ను అలరించారు మహేశ్. ఆ మూవీ విడుదలయిన వెంటనే రాజమౌళి సినిమా కోసం వర్కవుట్స్ మొదలుపెట్టారు. ఇప్పుడు కొత్త హెయిర్ స్టైల్‌తో కూడా కనిపిస్తున్నారు. దీంతో రాజమౌళి సినిమాపై మహేశ్ ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.
Also Read: ప్రభాస్‌కు అది జుజుబీ, కానీ నాకు అలా కాదు - అమితాబ్ బచ్చన్