అన్వేషించండి

Drohi Telugu Movie : 'ద్రోహి' ఫస్ట్ లుక్ విడుదల చేసిన క్రిష్ - క్రిమినల్ ఎవరు?

ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి చేతుల మీదుగా 'ద్రోహి' ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.

ఇప్పటి వరకు 'ద్రోహి' పేరుతో ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా? సుమారు అరడజను! అందులో లోక నాయకుడు కమల్ హాసన్, యాక్షన్ కింగ్ 'అర్జున్' హీరోలుగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ దర్శకత్వం వహించిన 'ద్రోహి' ఒకటి. సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ హిందీలో 'ద్రోహి' పేరుతో ఓ సినిమా తీశారు. తెలుగు దర్శకులు ఎల్వీ ప్రసాద్, కె. బాపయ్య కూడా ఆ టైటిల్ పెట్టి సినిమాలు తీశారు. 'ఆకాశమే హద్దురా' దర్శకురాలు సుధా కొంగర తమిళంలో ఓ సినిమా చేశారు. ఇప్పుడీ టైటిల్ (Drohi Telugu Movie 2023)తో తెలుగులో ఓ సినిమా వస్తోంది.    

క్రిష్ విడుదల చేసిన 'ద్రోహి' ఫస్ట్ లుక్!
సందీప్‌ కుమార్ బొడ్డపాటి (Sandeep Kumar Boddapati) హీరోగా రూపొందుతోన్న సినిమా 'ద్రోహి'. ది క్రిమినల్‌... అనేది ఉప శీర్షిక. ఇదొక క్రైమ్‌ థ్రిల్లర్‌. ఇందులో దీప్తి వర్మ కథానాయిక. గుడ్‌ ఫెల్లోస్‌ మీడియా ప్రొడక్షన్స్‌, సఫైరస్‌ మీడియా, వెడ్‌నెస్‌డే ఎంటర్టైన్మెంట్‌ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి విజయ్‌ పెందుర్తి దర్శకుడు. శ్రీకాంత్‌ రెడ్డి, విజయ్‌ పెందుర్తి, ఆర్. రాజశేఖర్ నిర్మాతలు. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) చేతుల మీదుగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 

సెప్టెంబర్ నెలలోనే 'ద్రోహి' విడుదల
ఈ సెప్టెంబరులోనే 'ద్రోహి' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, గ్లింప్స్ విడుదల చేసిన క్రిష్‌ మాట్లాడుతూ ''నేను ఈ ఫస్ట్ లుక్‌, గ్లింప్స్‌ చూశా. చాలా ప్రామిసింగ్‌గా అనిపించాయి. నటీనటులు అందరూ చక్కగా చేశారు. ఈ 'ద్రోహి' మంచి విజయం సాధించి సినిమాకు పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నాను. వారందరూ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలని ఆశిస్తున్నారు. చిత్ర బృందం అందరికీ ఆల్ ది బెస్ట్'' అని అన్నారు.

Also Read : 'సలార్' టికెట్ డబ్బులు రిఫండ్ - ప్రభాస్ ఫ్యాన్స్ అప్‌సెట్!

'ద్రోహి' దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ''థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. హీరో హీరోయిన్లు చాలా చక్కగా చేశారు. థ్రిల్స్ మధ్యలో 'షకలక' శంకర్ మంచి వినోదం అందిస్తారు. ప్రేక్షకులు మెచ్చే అంశాలు చిత్రంలో ఉంటాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు వచ్చాయి. ఈ నెలలో సినిమాను విడుదల చేస్తాం. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం'' అని తెలిపారు.

Also Read 'జవాన్' హిట్టే కానీ 'బాహుబలి 2'ని బీట్ చేయలేదు - ప్రభాస్ రికార్డ్స్ సేఫ్!

సందీప్‌ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ, డెబి, 'షకలక' శంకర్‌, నిరోజ్‌, శివ, మహేష్‌ విట్ట, మెహబూబ్, చాందినీ గొల్లపూడి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు డిఐ : రక్షిత్‌ కుమార్‌ గజ్జల, ఛాయాగ్రహణం : అశోక్‌ దబేరు, కూర్పు : జానీ బాషా, సాహిత్యం : నరేంద్ర కుమార్‌, రచయిత: గణేష్, సంగీతం : అనంత్‌ నారాయణ.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Weather Latest Update: మరో 5 రోజులు భారీ వర్షాలు, 40 - 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు కూడా
మరో 5 రోజులు భారీ వర్షాలు, 40 - 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు కూడా
Revanth Reddy: తెలంగాణ ఆదాయం పెంచడంపై రేవంత్ రెడ్డి రివ్యూ, అధికారులకు కీలక ఆదేశాలు
తెలంగాణ ఆదాయం పెంచడంపై రేవంత్ రెడ్డి రివ్యూ, అధికారులకు కీలక ఆదేశాలు
IPL 2024:  ఎస్ఆర్‌హెచ్, గుజరాత్ మ్యాచ్ రద్దు - ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్!
ఎస్ఆర్‌హెచ్, గుజరాత్ మ్యాచ్ రద్దు - ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్!
Vidya Vasula Aham Review - విద్య వాసుల అహం రివ్యూ: AHA OTTలో కొత్త సినిమా... ఎలా ఉందంటే?
విద్య వాసుల అహం రివ్యూ: AHA OTTలో కొత్త సినిమా... ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

SRH vs GT Match Highlights | IPL 2024 ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయిన సన్ రైజర్స్ | ABP DesamChandragiri TDP MLA Candidate Pulivarthi Nani | చంద్రగిరి ఇది..పులివెందుల కానివ్వను | ABP DesamNattikumar About IPAC | జగన్ లేని వైసీపీ లాంటిదే ప్రశాంత్ కిషోర్ లేని ఐప్యాక్ | ABP DesamPalnadu Police Recover Petrol bombs | మారణాయుధాలు పట్టుకున్న పల్నాడు పోలీసులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Weather Latest Update: మరో 5 రోజులు భారీ వర్షాలు, 40 - 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు కూడా
మరో 5 రోజులు భారీ వర్షాలు, 40 - 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు కూడా
Revanth Reddy: తెలంగాణ ఆదాయం పెంచడంపై రేవంత్ రెడ్డి రివ్యూ, అధికారులకు కీలక ఆదేశాలు
తెలంగాణ ఆదాయం పెంచడంపై రేవంత్ రెడ్డి రివ్యూ, అధికారులకు కీలక ఆదేశాలు
IPL 2024:  ఎస్ఆర్‌హెచ్, గుజరాత్ మ్యాచ్ రద్దు - ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్!
ఎస్ఆర్‌హెచ్, గుజరాత్ మ్యాచ్ రద్దు - ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్!
Vidya Vasula Aham Review - విద్య వాసుల అహం రివ్యూ: AHA OTTలో కొత్త సినిమా... ఎలా ఉందంటే?
విద్య వాసుల అహం రివ్యూ: AHA OTTలో కొత్త సినిమా... ఎలా ఉందంటే?
చనిపోయిన ఆత్మీయుల వస్త్రాలు, ఇతర వస్తువులు వాడుకోవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది?
చనిపోయిన ఆత్మీయుల వస్త్రాలు, ఇతర వస్తువులు వాడుకోవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది?
T Safe App: టీ సేఫ్‌తో మీ ప్రయాణం సేఫ్, తెలంగాణ పోలీసుల బాసట - ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు
టీ సేఫ్‌తో మీ ప్రయాణం సేఫ్, తెలంగాణ పోలీసుల బాసట - ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు
Krishnamma OTT Streaming: కృష్ణమ్మ ఓటీటీ రిలీజ్... షాక్ ఇచ్చిన సత్యదేవ్, థియేటర్లలో విడుదలైన ఏడు రోజులకే!
కృష్ణమ్మ ఓటీటీ రిలీజ్... షాక్ ఇచ్చిన సత్యదేవ్, థియేటర్లలో విడుదలైన ఏడు రోజులకే!
ITR 2024: ఫామ్‌-16లో ఏం ఉంటుంది, ఐటీఆర్‌ ఫైలింగ్‌లో ఈ డాక్యుమెంట్‌ ఎందుకు కీలకం?
ఫామ్‌-16లో ఏం ఉంటుంది, ఐటీఆర్‌ ఫైలింగ్‌లో ఈ డాక్యుమెంట్‌ ఎందుకు కీలకం?
Embed widget