అషురెడ్డి అంటే అందం, అందం అంటే అషురెడ్డి అన్నట్లు మిలమిల మెరిసిపోవడం లేదూ! 'బిగ్ బాస్' కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న అతికొద్ది మంది అందాల భామల్లో అషురెడ్డి ఒకరు. 'బిగ్ బాస్' కంటే ముందు నితిన్ 'చల్ మోహన్ రంగ' సినిమాలో అషురెడ్డి నటించారు. 'బిగ్ బాస్' తర్వాత అషురెడ్డికి బోలెడు సినిమా అవకాశాలు వస్తున్నాయి. కొన్ని సినిమాల్లో చేస్తున్నారు కూడా! సినిమాల కంటే రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూల వల్ల అషురెడ్డి ఫేమస్ అయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అషురెడ్డి డై హార్డ్ ఫ్యాన్. ఆమె ఒంటి మీద పవన్ పేరు టాటూ వేయించుకున్నారు. ఆ మధ్య డ్రగ్స్ కేసులో అషురెడ్డి పేరు వినిపించింది. దాని వల్ల వార్తల్లో నిలిచారు. తనకు, డ్రగ్స్ కేసుకు ఎటువంటి సంబంధం లేదని అషురెడ్డి తెలిపారు. ఓ జ్యువెలరీ షోరూమ్ లో అషురెడ్డి ఈ విధంగా సందడి చేశారు. అషురెడ్డి (All Images Courtesy : ashu_uuu / Instagram)