Jawan vs Baahubali 2 : 'జవాన్' హిట్టే కానీ 'బాహుబలి 2'ని బీట్ చేయలేదు - ప్రభాస్ రికార్డ్స్ సేఫ్!
షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమా మొదటి రోజు రికార్డు కలెక్షన్లు సాధించింది. అయితే... 'బాహుబలి 2' రికార్డులను బీట్ చేయలేదు. ఇప్పటికీ ఓపెనింగ్స్ రికార్డుల్లో ప్రభాస్ సినిమాయే ఫస్ట్ ప్లేసులో ఉంది.
షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ హిట్స్ కొట్టారు. దాంతో ఆయన ఫ్యాన్స్, బాలీవుడ్ ఇండస్ట్రీ ఫుల్ హ్యాపీ! అయితే... హిందీ మార్కెట్ వరకు షారుఖ్ ఖాన్ తన పట్టు నిలబెట్టుకున్నారు. హిందీ వెర్షన్స్ ఓపెనింగ్స్ విషయంలో ఫస్ట్ రెండు ప్లేసులు ఆయన సినిమాలవే. అయితే... వరల్డ్ వైడ్ ఓపెనింగ్స్ చూస్తే ఇప్పటికీ 'బాహుబలి 2' మొదటి స్థానంలో ఉంది.
'జవాన్' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత?
Jawan Box Office Collection Worldwide Day 1 : 'జవాన్'కు ఎర్లీ మార్నింగ్ షోస్ నుంచి మంచి టాక్ లభించింది. అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకులు ఊర మాస్ కమర్షియల్ హిట్ అని తీర్పులు ఇచ్చారు. సౌత్ జనాలకు ఇటువంటి మాస్ కథలు కొత్త కాదు. కానీ, ఆ కథలో షారుఖ్ ఖాన్ నటించడంతో కొత్తగా ఫీలయ్యారు.
ఉత్తరాదిలో ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా షారుఖ్ ఖాన్ అభిమానులకు అయితే చాలా కొత్తగా అనిపించింది 'జవాన్'. హిందీ ప్రేక్షకులు, విమర్శకుల నుంచి బ్లాక్ బస్టర్ రివ్యూలు వచ్చాయి. మొదటి రోజు వసూళ్లలో కూడా ఆ ప్రభంజనం చాలా స్పష్టంగా కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 125 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
వంద కోట్ల క్లబ్బులో చేరిన ఏడో సినిమా!
భారతీయ సినిమాల్లో ఇప్పటి వరకు ఆరు సినిమాలు మొదటి రోజు వంద కోట్లకు పైగా వసూళ్ళు సాధించాయి. ఇప్పుడు ఆ 100 కోట్ల ఓపెనింగ్ క్లబ్బులో 'జవాన్' కూడా చేరింది. ఆ క్లబ్బులో చేరిన ఏడో సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
షారుఖ్ 'జవాన్' హిట్టే కానీ...
'బాహుబలి'ని రికార్డ్స్ సేఫ్!
ఓపెనింగ్స్ విషయంలో గానీ, మొదటి రోజు వంద కోట్ల సాధించిన చిత్రాల లిస్టులో గానీ టాప్ ప్లేసులో ఉన్న సినిమా ఏది? అని చూస్తే... భారతీయ బాక్సాఫీస్ కుంభ స్థలాన్ని బద్దలు కొట్టిన 'బాహుబలి 2' కనపడుతుంది.
'బాహుబలి 2'కి మొదటి రోజు రూ. 201 కోట్ల రూపాయలు వచ్చాయి. ప్రీమియర్స్ కలెక్షన్స్ 26 కోట్లు కలిపితే రూ. 227 కోట్లు! ఈ లెక్క నిజమని బాలీవుడ్ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి.
Also Read : షారుఖ్ ఒక్కడికీ 100 కోట్లు - నయనతార, విజయ్ సేతుపతికి ఎంత ఇచ్చారో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ సాధించిన సినిమాల లిస్టులో 'బాహుబలి 2' తర్వాత స్థానంలో 'ఆర్ఆర్ఆర్' ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం'కి రూ. 220 కోట్లు వచ్చాయి. మూడో స్థానంలో కన్నడ స్టార్ యశ్ 'కెజియఫ్ 2' ఉంది. ఆ సినిమా మొదటి రోజు రూ. 170 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత స్థానంలో 'జవాన్' ఉంది. రూ. 128 కోట్లతో 'సాహో' ఐదో స్థానంలో, రూ. 108 కోట్లతో 'పఠాన్' ఆరో స్థానంలో, రూ. 105 కోట్లతో 'ఆదిపురుష్' ఏడో స్థానంలో ఉన్నాయి.
ఇప్పుడు బాలీవుడ్ సినిమాలకు ఉత్తరాదిలో మంచి వసూళ్ళు వస్తున్నాయి. కానీ, తెలుగు తమిళ భాషల్లో ఆశించిన ఆదరణ లభించడం లేదు. 'జవాన్' కొంత వరకు ఆ అడ్డుగోడను ఛేదించి దక్షిణాది ప్రేక్షకుల ఆదరణ అందుకుంది.
Also Read : ఒక్క ఏడాదిలో లెక్కలు మార్చిన షారుఖ్ - టాప్ 10 ఓపెనింగ్స్‌లో ఫస్ట్ రెండూ ఆయనవే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial