(Source: ECI/ABP News/ABP Majha)
SRK Box Office Collection : ఒక్క ఏడాదిలో లెక్కలు మార్చిన షారుఖ్ - టాప్ 10 ఓపెనింగ్స్‌లో ఫస్ట్ రెండూ ఆయనవే!
షారుఖ్ ఖాన్ మేనియా థియేటర్లలో విజిల్స్ వేయిస్తోంది. 'జవాన్' భారీ ఓపెనింగ్స్ సాధించింది. దీనికి ముందు 'పఠాన్' సైతం భారీ విజయం సాధించింది. ఈ రెండు సినిమాలతో ఒక్కసారిగా ఆయన లెక్కలు మార్చేశారు.
షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)ను హిందీ చిత్రసీమలో కింగ్ ఖాన్, బాలీవుడ్ బాద్షా అంటుంటారు. బాక్సాఫీస్ బరిలో ఆయన జైత్రయాత్ర ఆ విధంగా సాగింది. అయితే, 'పఠాన్' విడుదలకు ముందు ఆయన సినిమాల పరిస్థితి ఏమంత బాలేదు. 'చెన్నై ఎక్స్‌ప్రెస్' విజయం తర్వాత షారుఖ్ సినిమాలు బాక్సాఫీస్ బరిలో వెనుక పడ్డాయి. అదే సమయంలో కొన్ని బోల్తా కొట్టాయి. కొన్నిటికి మంచి పేరు వచ్చినప్పటికీ... ఆశించిన విజయాలు సాధించలేదు. ఇక, షారుఖ్ పని అయిపోయిందని కామెంట్స్ కూడా వినిపించాయి.
'జీరో' విడుదల తర్వాత షారుఖ్ ఖాన్ కూడా గ్యాప్ తీసుకున్నారు. ఎక్కడ తప్పు జరుగుతోంది? తనకు విజయాలు ఎందుకు దూరం అవుతున్నాయి? అని కెరీర్ మీద విశ్లేషణ చేసుకున్నారు. షారుఖ్ ఖాన్ 2018 నుంచి 2022 మధ్య మూడు సినిమాల్లో కనిపించారు. అవన్నీ అతిథి పాత్రలే.
'పఠాన్'తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కినా షారుఖ్
ఈ ఏడాది 'పఠాన్'తో షారుఖ్ ఖాన్ మళ్ళీ హీరోగా తెర మీదకు వచ్చాయి. బాలీవుడ్ బాద్షా ఈజ్ బ్యాక్ విత్ బ్యాంగ్ అని చెప్పాలి. ఆ రేంజ్ సక్సెస్ సాధించింది 'పఠాన్'. ఒక్కసారిగా వెయ్యి కోట్ల క్లబ్బులో షారుఖ్ అడుగు పెట్టారు. ఇక, ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'జవాన్' కూడా రూ. 1000 కోట్ల క్లబ్బులో అడుగు పెడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అది పక్కన పెడితే... 'పఠాన్', 'జవాన్' - ఈ రెండు సినిమాలతో షారుఖ్ ఖాన్ ఒక్కసారిగా ఓపెనింగ్ డే రికార్డ్స్ లెక్కలు మార్చేశారు.
భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రాలు...
టాప్ 10లో రెండు షారుఖ్ ఖాన్ సినిమాలే!
Jawan Collection Day 1 : హిందీ మార్కెట్ వరకు షారుఖ్ ఖాన్ మళ్ళీ టాప్ అని చెప్పాలి. ఫస్ట్ డే కలెక్షన్స్ వరకు చూస్తే... 'జవాన్' రికార్డ్ సాధించింది. తొలిరోజు వంద కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. రూ. 100 నుంచి రూ. 125 కోట్ల మధ్య ఫస్ట్ డే 'జవాన్' కలెక్షన్స్ గ్రాస్ ఉంటుందని టాక్. నెట్ కలెక్షన్స్ విషయానికి వస్తే... 70 కోట్లు ఉండొచ్చని అంచనా.
Also Read : షారుఖ్ ఒక్కడికీ 100 కోట్లు - నయనతార, విజయ్ సేతుపతికి ఎంత ఇచ్చారో తెలుసా?
హిందీ లాంగ్వేజ్ వరకు... భారీ ఓపెనింగ్స్ సాధించిన టాప్ 10 సినిమాల లిస్టు తీస్తే... అందులో మొదటి రెండు స్థానాల్లో షారుఖ్ ఖాన్ సినిమాలు ఉన్నాయి. 'జవాన్' ఫస్ట్ ప్లేసులో ఉంటే... ఆ తర్వాత స్థానంలో రూ. 60 కోట్లతో 'పఠాన్' ఉంది.
'కెజియఫ్ 2'కి రూ. 52.40 కోట్లు, 'వార్' చిత్రానికి రూ. 50.65 కోట్లు, ఆమిర్ ఖాన్ ఫ్లాప్ సినిమా 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'కి రూ. 48.25 కోట్లు, సల్మాన్ ఖాన్ 'భారత్' చిత్రానికి రూ. 41.65 కోట్లు, మన ప్రభాస్ 'బాహుబలి 2'కి రూ. 40.75 కోట్లు, 'ప్రేమ్ రతన్ ధన్ పాయో'కి రూ. 39.30 కోట్లు, బాబీ డియోల్ 'గదర్ 2'కి రూ. 39 కోట్లు ఓపెనింగ్స్ వచ్చాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో షారుఖ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial