(Source: ECI/ABP News/ABP Majha)
Parking OTT : ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Parking OTT : కోలీవుడ్ హీరో హరీష్ కళ్యాణ్ నటించిన 'పార్కింగ్' మూవీ ఇప్పుడు తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.
Kollywood Recent Super Hit Parking OTT Release : ప్రతివారం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదలవుతూ ఆడియన్స్ ను అలరిస్తూ ఉంటాయి. ఇతర భాషల్లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలను సైతం ఓటీటీలో అన్ని భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటారు. అలాంటి ఓ సూపర్ హిట్ మూవీ ఒకటి ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సినిమా పేరే 'పార్కింగ్'. కోలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ సీనియర్ నటుడు ఎం.ఎస్ భాస్కర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా రీసెంట్ గా తమిళనాట చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. రామ్ కుమార్ బాలకృష్ణన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
రెండు జనరేషన్ల మధ్య ఇగో నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు తమిళం తో పాటు మిగతా లాంగ్వేజెస్ లో ఓటీటీ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కొనుగోలు చేయగా డిసెంబర్ 30 నుంచి తమిళ్ తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. మన నిజ జీవితంలో చాలామందికి తెలియని ఓ సమస్యను ఈ సినిమాలో చూపించారు. చాలా తక్కువ బడ్జెట్ తో సింపుల్ కథాంశంతో తీసిన పార్కింగ్ మూవీ కోలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుత కాలంలో జనాభా పెరిగిపోవడంతో అవసరాలకు అనుగుణంగా టూ వీలర్స్ లేదా ఫోర్ వీలర్స్ వాడుతున్నారు.
అయితే వాహనాలు పెరిగిపోవడంతో ట్రాఫిక్ ఇబ్బంది కావడమే కాకుండా పార్కింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యపైనే పార్కింగ్ మూవీని తెరకెక్కించారు. డిసెంబర్ 1న తమిళనాట థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి భారీ ఆదరణ లభించింది. ఇక ప్రస్తుతం హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ‘పార్కింగ్’ కథ విషయానికొస్తే.. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే హీరో ఓ ఇంట్లో అద్దెకు ఉంటాడు. పెళ్లయిన తర్వాత కొత్త కారు కొంటాడు. అయితే హీరో ఉంటున్న ఇంట్లో పార్కింగ్ సమస్య తలెత్తడంతో ఇంటి ఓనర్ కి హీరోకి మధ్య పెద్ద వాగ్వాదం జరిగి అది కొట్టుకునేదాకా వెళ్తుంది. చివరికి అది పోలీసు కేసు వరకు వెళ్లడంతో చివరికి పార్కింగ్ సమస్యను ఎలా పరిష్కరించారు? అనేది ఈ సినిమా కథ.
సుధన్ సుందరం నిర్మించిన ఈ సినిమాకి సామ్ సీ ఎస్ సంగీతం అందించారు. ఇక హరీష్ కళ్యాణ్ విషయానికొస్తే.. కోలీవుడ్లో పలు సూపర్ హిట్ సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా 'LGM' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ఈ సినిమాతో నిర్మాతగా మారారు. లవ్ టుడే మూవీ ఫేమ్ ఇవానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కాగా హరీశ్ కళ్యాణ్ తెలుగు ఆడియన్స్ కి కూడా సుపరిచితమే. తెలుగులో ‘జెర్సీ’ మూవీలో నాని కొడుకుగా నటించింది ఇతనే.
Also Read : బాలీవుడ్ సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేసింది, ‘యానిమల్’ నిర్మాత షాకింగ్ కామెంట్స్!