అన్వేషించండి

Ajith Kumar : సోషల్ మీడియా అంతా ఏకే కంట్రోల్‌లో.. ఓటు వేసిన అజిత్.. స్పెషల్ ఏంటో తెలుసా?

Ajith Kumar Vote : కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినిమాల పరంగా విజయ్‌కి పోటీనిచ్చే హీరో అజిత్ ఓటు ఎవరికి వేస్తారనేది కూడా చాలా ఎగ్జైట్ చేస్తోంది.

Ajith Kumar Casts Vote: తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి, సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. అయితే ఎప్పుడూ లేని విధంగా, ఈసారి తమిళనాడు ఎన్నికల రిజల్ట్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పోటీ చేయడమే. ఆయన కొత్త పార్టీ పెట్టి, ఈ ఎన్నికల బరిలో దిగడంతో, ఈసారి తమిళనాడులో ఎవరు గెలుస్తారనేది చాలా ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, సెలబ్రిటీలు ఎవరెవరు విజయ్‌కి సపోర్ట్‌గా నిలుస్తారనేది కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో సినిమాల పరంగా విజయ్‌కి పోటీనిచ్చే హీరో అజిత్ ఓటు ఎవరికి వేస్తారనేది కూడా చాలా ఎగ్జైట్ చేస్తోంది.

మొదటి నుంచి అజిత్ కుమార్ ఇలాంటి వ్యవహారాలలో చాలా జాగ్రత్తగా ఉంటూ వస్తున్నారు. ఓటు వేసే విషయంలో ఎప్పుడూ తన రెస్పాన్సిబిలిటీని ప్రదర్శించే అజిత్ కుమార్ ఈసారి కూడా.. పోలింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. ఈ క్రమంలో తమిళనాడు ఎన్నికలలో ఓటు వేసిన మొదటి సెలబ్రిటీగా కూడా ఆయన సోషల్ మీడియాలో గుర్తింపు పొందుతున్నారు. అవును, గురువారం చెన్నైలోని తిరువాన్మియూర్ పోలింగ్ కేంద్రానికి నటుడు అజిత్ కుమార్ చాలా సాధారణంగా, నిరాడంబరంగా వచ్చారు. ఎటువంటి హంగామా లేకుండా, భద్రతా సిబ్బంది హడావిడి లేకుండా.. ఒక సాధారణ పౌరుడిలా క్యూలో నిలబడి ఓటు వేసి వెళ్లారు. ఆయన రాకతో అక్కడి ఓటర్లు, అభిమానులు ఆశ్చర్యపోయినా, ఆయన ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావడాన్ని అందరూ అభినందించారు. 

దీంతో సోషల్ మీడియా అంతా ఏకే కంట్రోల్‌లోకి వచ్చేసింది. ఎన్నికల బరిలో విజయ్ ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం అజిత్ పేరు టాప్‌లో ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం ఆయన ఓటు వేసిన విధానమే. అంత సింప్లిసిటీ ఉన్న వ్యక్తి కాబట్టే.. అభిమానులు ఆయనని దేవుడిలా భావిస్తుంటారు. మరో వైపు మైలాపూర్‌లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత ఆమె ఎంతో ఉద్వేగంగా మాట్లాడారు. ‘‘నా ముఖంలో ఉన్న చిరునవ్వు చూస్తేనే అర్థమవుతోంది. ఓటు వేయడం నా అతిపెద్ద ప్రజాస్వామ్య హక్కు, ఒక పౌరురాలిగా ఇది నాకు చాలా ముఖ్యమైన రోజు. ప్రజలు తమ నిర్ణయాన్ని తీసుకోవడానికి ఇదే సరైన సమయం, అంతా వారి చేతుల్లోనే ఉంది’’ అంటూ, రాష్ట్రంలోని ఓటర్లందరూ తమ బాధ్యతను గుర్తించాలని ఆమె పిలుపునిచ్చారు. 

తమిళనాడులో ప్రధాన ఎన్నికల పోరు డీఎంకే నేతృత్వంలోని కూటమి (కాంగ్రెస్, డీఎండీకే, వీసీకే భాగస్వామ్యంతో), ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ (బీజేపీ, పీఎంకే భాగస్వామ్యంతో) మధ్య సాగుతోంది. ఈ ఎన్నికల్లో నటుడు విజయ్ తన పార్టీ ‘టీవీకే’ (TVK)తో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం ఈసారి ఎన్నికల్లో కొత్త మలుపుగా మారింది. కాగా, ఈ ఎన్నికలకు సంబంధించి మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Also Read : డింపుల్ హయతికి మెగా ఛాన్స్... చిరు - బాబీ సినిమాలో అలాంటి పాత్రనా?

టాప్ హెడ్ లైన్స్

Nandamuri Mokshagna: ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
ప్రశాంత్ వర్మ కాదు... మరో దర్శకుడితో నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
Balakrishna: డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
డిసెంబర్‌లో NBK 111... సర్జరీ జరిగినా షూటింగ్‌కు బాలయ్య?
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget