Klin Kaara visits RC16 sets: రామ్ చరణ్ కొత్త సినిమా సెట్స్‌లో కూతురు క్లీంకారా కొణిదెల
Ram Charan with Daughter Klin Kaara: రామ్ చరణ్ ముద్దుల కూతురు, మెగా ప్రిన్సెస్ క్లింకారా కొణిదెల సినిమా చిత్రీకరణకు వచ్చింది. ఆ ఫోటోలను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

క్లీంకార కొణిదెల (Klin Kaara Konidela)... మెగాస్టార్ చిరంజీవి ముద్దుల మనవరాలు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ ఎంట్రప్రెన్యూర్ ఉపాసన దంపతుల గారాల కూతురు. ఆ చిన్నారి ఎలా ఉంటుందో చూడాలని అభిమానులతో పాటు ప్రేక్షకులు అందరిలోనూ ఆసక్తి ఉంది. చిన్నారిని మనకు చూపించలేదు కానీ... ఆ చిన్నారికి షూటింగ్ ఎలా జరుగుతుందో చూపించారు రామ్ చరణ్.
RC16 చిత్రీకరణకు వచ్చిన క్లీంకారా కొణిదెల
రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా దర్శకుడిగా పరిచయమైన 'ఉప్పెన' సినిమాతో 100 కోట్ల క్లబ్బులో చేరిన సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక సెట్ నందు చిత్రీకరణ జరుగుతోంది. షూటింగుకు కుమార్తెను తీసుకు వెళ్లారు రామ్ చరణ్.
''సెట్‌లో నా చిన్నారి అతిథి. #RC16'' అని కుమార్తెను ఎత్తుకుని ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు రామ్ చరణ్. అయితే ఆ చిన్నారి ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. హీరోగా రామ్ చరణ్ 16వ చిత్రమిది. అందుకని ఆర్‌సి 16 వర్కింగ్ టైటిట్‌తో అప్డేట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జూబ్లీహిల్స్ బూత్ బంగ్లాలో జరుగుతోంది. మెగా ఫ్యామిలీ ఇంటికి ఆ లొకేషన్ చాలా దగ్గర. అందుకే చిత్రీకరణ దగ్గరకు తీసుకు వెళ్లినట్లు ఉన్నారు.
View this post on Instagram
ఇటీవల 'మీ అమ్మాయిని మాకు ఎప్పుడు చూపిస్తున్నావ్?' అని 'అన్‌స్టాపబుల్ 4' షోలో నట సింహం నందమూరి బాలకృష్ణ అడిగితే... 'నన్ను నాన్న అని పిలిచినప్పుడు చూపిస్తాను' అని రామ్ చరణ్ సమాధానం ఇచ్చారు.
జ్వరంతో చిత్రీకరణ చేస్తున్న రామ్ చరణ్!
రామ్ చరణ్ గత నాలుగు ఐదు రోజులుగా జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. ఆయన హెల్త్ బాలేదు. అయితే... తన వల్ల షూటింగ్ ఆలస్యం కాకూడదని, మిగతా నటీనటులతో పాటు దర్శక నిర్మాతలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చరణ్ షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఆయనకు తీవ్రమైన జ్వరం ఉన్నప్పటికీ మిగతా అందరినీ దృష్టిలో పెట్టుకుని షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారని సినిమా యూనిట్స్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. దాంతో ముందుగా అనుకున్న ప్లానింగ్ ప్రకారమే షెడ్యూల్ జరుగుతోంది.
Also Read: ఎస్వీఆర్ మనవడితో ఎంట్రీ... సీఎం కొడుకుతో సినిమా... ప్రియాంకా చోప్రా మరదలు టాలీవుడ్ హీరోయినే
రామ్ చరణ్ సరసన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి 'పెద్ది' టైటిల్ ఖరారు చేశారని కొన్ని రోజులుగా వినబడుతోంది. అయితే చిత్ర బృందం ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఈ సినిమాకు ఆస్కార్ పురస్కార గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆ మధ్య సినిమా నుంచి ఆయన తప్పుకొన్నారని పుకార్లు వినిపించగా చిత్ర బృందం వాటిని ఖండించింది. ఇందులో జగపతిబాబు మరొక కీలకపాత్ర పోషిస్తుండగా... మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ మరొక క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయనది విలన్ రోల్ అని టాక్.





















