అన్వేషించండి

Kiran Abbavaram: సినిమా మధ్య నుండే వచ్చేశాను, అది మంచి సినిమా అని అసత్యం చెప్పలేను - కిరణ్ అబ్బవరం

Kiran Abbavaram: ఒకప్పుడు పక్కింటబ్బాయిగా గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు తన స్టోరీ సెలక్షన్ వల్ల ట్రోల్ ఎదుర్కుంటున్నాడు. తాజాగా తన సినిమాల్లో ఒకటి తనకే నచ్చలేదని బయటపెట్టాడు.

Kiran Abbavaram: ‘రాజావారు రాణీగారు’ లాంటి యూత్‌ఫుల్ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. ఆ సినిమా సూపర్ సక్సెస్‌ను అందుకోవడంతో స్టార్ మేకర్స్ సైతం తనతో మూవీ చేయడానికి ముందుకొచ్చారు. అలా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు బాగానే వచ్చినా కూడా ‘రాజావారు రాణీగారు’లాంటి సక్సెస్‌ను మాత్రం తను మళ్లీ చూడలేకపోయాడు. దీంతో రాకెట్‌లాగా సినిమాలు చేసినా హిట్లు రావడం లేదని కిరణ్‌పై ట్రోల్స్ పెరిగాయి. తాజాగా తన సినిమాల్లో ఒకటి తనకే నచ్చలేదని, అందుకే స్క్రీనింగ్ మధ్యలో నుండే వెళ్లిపోయానని ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు.

అసత్యం ఎందుకు చెప్పాలి?

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ అబ్బవరం.. తన సినిమాల రిజల్ట్‌పై స్పందించాడు. ‘‘సినిమా ఇంటర్వెల్‌ అయ్యే సమయానికి మేము సరిగా తీయలేదని అర్థమయ్యింది. అది చాలా దారుణమైన సినిమా అని, అస్సలు చూడలేం అని నాకే అనిపించింది. అందుకే నేను స్క్రీనింగ్ నుండి బయటికి వచ్చేశాను. నేను ఆ సినిమా హీరోను కాబట్టి అలా మధ్యలో నుండి వచ్చేయడం కరెక్ట్ కాదని నా టీమ్ చెప్పారు. నేను హీరో అయితే ఏంటి? ఒక చెత్త సినిమాను మంచి సినిమా అని అబద్ధం చెప్పలేం కదా’’ అని చెప్పుకొచ్చాడు. అయితే అసలు అది ఏం సినిమా అని టైటిల్ మాత్రం రివీల్ చేయలేదు. దీంతో ప్రేక్షకులు అది ఏం సినిమా అయ్యింటుందా అని గెస్ చేయడం మొదలుపెట్టారు.

రహస్యతో ఎంగేజ్‌మెంట్..

ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం కోసం కిరణ్ అబ్బవరం.. అసలు మంచి కథలను ఎంచుకోవడం లేదని అప్పట్లో తెగ ట్రోల్స్ వచ్చాయి. దీంతో సినిమాలు చేసే విషయంలో కాస్త స్పీడ్ తగ్గించాడు. చివరిగా రత్నం కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రూల్స్ రంజన్’లో కనిపించాడు. ఇది కూడా తన కెరీర్‌లో మరో ఫ్లాప్‌ను యాడ్ చేసింది. ఇక ఈ మూవీ విడుదలయ్యి ఎన్నో నెలలు అవుతున్నా కూడా తన తరువాతి మూవీ నుండి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు కిరణ్ అబ్బవరం. పైగా తాజాగా తన కో స్టార్ రహస్యను ఎంగేజ్‌మెంట్ చేసుకొని పర్సనల్ లైఫ్‌లో ఒక ముందడుగు వేశాడు. కిరణ్ అబ్బవరం, రహస్య కలిసి ‘రాజావారు రాణీగారు’తో తమ సినీ ప్రయాణాన్ని కలిసి మొదలుపెట్టారు.

రుక్సార్ జంటగా..

2019లో రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘రాజావారు రాణీగారు’. ఇందులో హీరోహీరోయిన్లుగా నటించిన కిరణ్ అబ్బవరం, రహస్య ఎవరు అని అప్పటివరకు ప్రేక్షకులకు తెలియదు. అప్పటివరకు కిరణ్.. పలు షార్ట్ ఫిల్మ్స్‌లో హీరోగా నటించాడు. రహస్య మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయ్యింది. కానీ కథ రిఫ్రెషింగ్‌గా ఉండి, యూత్‌ను ఆకట్టుకోవడంతో ‘రాజావారు రాణీగారు’ సూపర్ హిట్‌ను అందుకుంది. ఆ తర్వాత హీరోగా కిరణ్ బిజీ అయిపోయినా రహస్య మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ తాజాగా ఈ హీరోనే ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం.. ‘దిల్ రుబా’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో రుక్సార్ ధిల్లోన్ హీరోయిన్‌గా కనిపించనుంది.

Also Read: 'ఫ్యామిలీ స్టార్' విడుదలకు ముందు నెగెటివ్ రివ్యూలు - పోలీసులకు దేవరకొండ ఫ్యాన్స్ కంప్లైంట్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మపుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు - తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
RGV News: ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
ఆర్టీవీ అభ్యర్థన తిరస్కరించిన హైకోర్టు- మంగళవారం విచారణకు వస్తారా?
KUDA: ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు గుడ్ న్యూస్ - 'కుడా' బృహత్ ప్రణాళికకు ఆమోదం, మామునూరు విమానాశ్రయంపై ముందడుగు
Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం
Lagacherla Case: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామాలు-సురేష్‌పై లుక్‌ అవుట్ నోటీసు- ఢిల్లీకి చేరిన రైతుల పంచాయితీ
Golbal Star Ram Charan : అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
అయ్యప్ప మాలలో కడప దర్గాకు వెళ్తోన్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. కారణం ఇదేనా?
Posani Krishna Murali: సీఎం చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు - నటుడు పోసాని, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడలపై కేసులు నమోదు
సీఎం చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు - నటుడు పోసాని, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడలపై కేసులు నమోదు
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Embed widget