శోభనం రాత్రి పాలు ఎందుకు తాగుతారో తెలుసా?

పెళ్లి.. ఇద్దరిని ఒకటి చేస్తుంది. ప్రత్యేక బంధాన్ని ఏర్పరుస్తుంది. కానీ, శోభనం.. ఇద్దరిని మరింత దగ్గర చేస్తుంది.

ఒకరినొకరు అర్థం చేసుకోడానికి.. ప్రేమను పంచుకోడానికి శోభనం చాలా అవసరం.

అంతేకాదు.. సృష్టి ధర్మాన్ని సక్సెస్ చేయాలంటే, శోభనం తప్పనిసరి.

అందుకే, శోభనం గదిని అంత అందంగా ముస్తాబు చేస్తారు.

శోభనం అనగానే మన కళ్ల ముందు ఒక సీన్ కనిపిస్తుంది.

అదేనండి, వధువు వయ్యారంగా పాల గ్లాసుతో గదిలోకి రావడం.

అయితే, అవి సాదాసీదా పాలు కాదండోయ్. ఎన్నో పోషకాలు కలిగిన ఎనర్జీ డ్రింక్.

ఔనండి, ఆ పాలలో పసుపు, మిరియాలు, కుంకుమ పువ్వు, బాదం పప్పు చూర్ణం కలుపుతారు.

ఆ పాలు తాగితే.. కాముడు మేల్కొంటాడు. ఆలుమగల మధ్య బిడియాన్ని దూరం చేస్తాడు.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే.