డయాబెటిస్ ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక్కసారి మనిషికి వచ్చిందంటే మనిషి చనిపోయే వరకు ఈ సమస్య వీడదు. దీనివల్ల ఒకటి కాదు, అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎప్పటికప్పుడు షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసుకోవడం తప్ప, వేరే ఆప్షన్ లేదు. దీనికి మన ఆహార నియమాలు కీలక పాత్ర పోషిస్తాయి. మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులతో షుగర్ ను నియంత్రించవచ్చు. అవేంటో చూద్దాం.. డయాబెటిస్‌తో బాధపడేవారు కలబందను తీసుకుంటే ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు ఇన్సులిన్ స్థాయిలను పెంచాలనుకుంటే వేప ఆకు తీసుకోండి. డయాబెటిస్‌తో ఇబ్బంది పడే సీతాఫలం ఆకులను నములుతూ ఉండండి. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.