అన్వేషించండి

Jawan mania: షారుఖ్ ఇంటి ముందు 'జవాన్' వాల్ ఆర్ట్ క్రియేట్ చేసిన కింగ్ ఖాన్ ఫ్యాన్!

'జవాన్' విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో షారుక్ ఖాన్ నివాసమైన మన్నత్ ముందు అద్భుతమైన వాల్ ఆర్ట్ ను క్రియేట్ చేసారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ స్టార్, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు. 2023 సెప్టెంబర్ 7న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్ లో షారుక్ అభిమానులు కూడా భాగం అవుతున్నారు.

ఇప్పటికే విడుదలైన 'జవాన్' ప్రీవ్యూ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలానే రాక్ స్టార్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యాజికల్ కంపోజిషన్ లో వచ్చిన రెండు పాటలు కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకొని, సినిమాకు కావాల్సినంత బజ్ తీసుకొచ్చాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో కింగ్ ఖాన్ ఫ్యాన్స్ లో ఉత్సాహం రెట్టింపు అవుతోంది. జవాన్ మ్యానియాని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లేలా ఇప్పుడు ఓ అభిమాని షారూఖ్ నివాసమైన మన్నత్ ముందు అధ్బుతమైన వాల్ ఆర్ట్ ను రూపొందించాడు. 

షారుక్ ఖాన్ వీరాభిమాని అయిన ఆర్టిస్ట్ కనక్ నంద, మన్నత్ చుట్టూ 'జవాన్' ఆర్ట్ వర్క్ సృష్టించారు. దీని ఫోటోలు, వీడియోలను కింగ్ ఖాన్ ఫ్యాన్ పేజీలు సోషల్ మీడియాలో షేర్ చేశాయి. ఇవి ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. ప్రేక్షకులకు మాస్‌ ఫీస్ట్‌ అందించేందుకు జవాన్‌ రెడీ అవుతుండడంతో, ఎప్పుడెప్పుడు తమ హీరోని బిగ్ స్క్రీన్ మీద చూద్దామా అని అభిమానులు ఆత్రుతగా వేచి చూస్తున్నారు. 

Also Read: 'లవ్ గురు' ఫస్ట్ లుక్ - రోమియోగా మారిన బిచ్చగాడిని చూశారా?

'జవాన్' సినిమాలో షారుక్ ఖాన్ భిన్నమైన లుక్స్ లో కనిపించబోతున్నారు. ఇందులో నయన్, విజయ్ సేతుపతిలతో పాటుగా దీపికా పదుకొణె ప్రధాన పాత్ర పోషిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో తపపతి విజయ్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. పాన్ ఇండియా దృష్టిని ఆకర్షించడానికి ఇతర ఇండస్ట్రీలకు చెందిన పలువురు పాపులర్ నటీనటులు ఈ చిత్రంలో భాగమవుతున్నారు. సన్యా మల్హోత్రా, ప్రియమణి, గిరిజా ఓక్, సంజీతా భట్టాచార్య, లెహర్ ఖాన్, ఆలియా ఖురేషి, రిధి డోగ్రా, సునీల్ గ్రోవర్, ముఖేష్ ఛబ్రా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ లో దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో 'జవాన్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గౌరీ ఖాన్ నిర్మిస్తున్న ఈ మూవీకి గౌరవ్ వర్మ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వచ్చే నెల 7వ తారీఖున హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. 'పఠాన్' మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న షారూక్ ఖాన్.. ఈసారి ఎలాంటి బాక్సాఫీస్ విజయాన్ని సాధిస్తారో వేచి చూడాలి.

Also Read: ‘తని ఒరువన్ 2’ ప్రకటనకు వేళాయే - రామ్ చరణ్ ‘ధృవ 2’ సంగతేంటి రాజా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Embed widget