Love Guru First Look : 'లవ్ గురు' ఫస్ట్ లుక్ - రోమియోగా మారిన బిచ్చగాడిని చూశారా?
Vijay Antony's Love Guru Update : 'బిచ్చగాడు 2'తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన విజయ్ ఆంటోనీ... 'లవ్ గురు'గా మారిపోయాడు. తన తాజా చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసాడు.
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ (Vijay Antony) గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. డబ్బింగ్ చిత్రాలతో తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న తమిళ హీరోలలో అతను ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా సత్తా చాటుతున్నాడు. 'బిచ్చగాడు' సినిమాతో తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందనుకున్న విజయ్... ఇటీవల 'బిచ్చగాడు 2' చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఇప్పటివరకు యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్స్ తో మెప్పిస్తూ వస్తున్న నటుడు, ఇప్పుడు ఉన్నట్టుండి రొమాంటిక్ హీరో అనిపించుకోవాలని ఆశపడుతున్నాడు. ఇందులో భాగంగా 'లవ్ గురు' (Love Guru Movie) అనే సినిమాతో రాబోతున్నాడు.
విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రోమియో' (Romeo Tamil Movie). ఇందులో 'గడ్డలకొండ గణేష్' ఫేమ్ మృణాళిని రవి (Mirnalini Ravi) హీరోయిన్ గా నటిస్తోంది. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వంలో ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. విజయ్ ఆంటోనీ సమర్పణలో గుడ్ డెవిల్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 'లవ్ గురు' అనే పేరుతో తెలుగులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని బుధవారం మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ, టైటిల్ తో కూడిన రొమాంటిక్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Also Read: ధోనీ తెరంగేట్రానికి రంగం సిద్ధమైందా?
ఈ సందర్భంగా విజయ్ ఆంటోనీ ట్వీట్ చేస్తూ... “నన్ను రొమాంటిక్ హీరోగా చూడాలని కోరుకున్న ప్రజలకు, పత్రికలకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. మీ కోరిక తీర్చబోతున్నాను. నా తదుపరి చిత్రం 'లవ్ గురు' ని ఎనౌన్స్ చేస్తునందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. 2024 సమ్మర్ లో బ్లాక్ బస్టర్ తో రాబోతున్నాం'' అని పేర్కొన్నాడు. ఫస్ట్ లుక్ విషయానికొస్తే, ఇందులో విజయ్ హీరోయిన్ మృణాళిని పట్టుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు. ఈ పోస్టర్ ద్వారా తనలోని రొమాంటిక్ యాంగిల్ ను చూపించే ప్రయత్నం చేసాడు. టైటిల్ ను బట్టే ఈ సినిమాలో అతను లవ్ గురుగా కనిపిస్తారని అర్థమవుతోంది.
నా తదుపరి చిత్రం #LOVEGURU ని ఎనౌన్స్ చేస్తునందుకు నాకు చాలా సంతోషంగా ఉంది🙏😊
— vijayantony (@vijayantony) August 16, 2023
Summer 2024#Blockbuster @GoodDevilOffl @mirnaliniravi pic.twitter.com/uNgRh9lvZs
'నకిలీ' సినిమాతో తొలిసారి టాలీవుడ్ జనాలను ఆకట్టుకున్న విజయ్ ఆంటోనీ.. అప్పటి నుంచీ తాను నటించే ప్రతీ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో 'డా. సలీమ్' 'భేతాళుడు' 'బిచ్చగాడు' 'విజయ్ రాఘవన్' వంటి విజయాలు అందుకున్నాడు. వాటిల్లో 'బిచ్చగాడు' సినిమా ఇక్కడ ఏకంగా 100 రోజులు ప్రదర్శించబడి, తెలుగు డబ్బింగ్ సినిమాల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇటీవల వచ్చిన 'బిచ్చగాడు 2' సినిమా కూడా విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. కానీ ఆ తర్వాత రిలీజైన 'హత్య' చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. మరి ఇప్పుడు 'లవ్ గురు' సినిమా విజయ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి.
Read Also: కింగ్ బర్త్ డే స్పెషల్ గా 'మన్మథుడు' మళ్ళీ వస్తున్నాడు!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial