Kiara Advani: సివంగిలా మారా... డెలివరీ తర్వాత జీవితంలో వచ్చిన మార్పులపై కియారా అద్వానీ
కియారా అద్వానీ ఇంటర్వ్యూలో తల్లి అయ్యాక జీవితంలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడింది. ఆమె కొత్త సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

మహేష్ బాబు 'భరత్ అనే నేను', రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' & 'గేమ్ ఛేంజర్' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani). ప్రస్తుతం మదర్ హుడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న ఆవిడ... ఆ మధ్య ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కియారా తన మదర్ హుడ్ గురించి చెప్పారు. ఇప్పుడు తన ఆలోచనలు, జీవితాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోయిందని తెలిపారు. పెళ్లి, డెలివరీ తర్వాత జీవితంలో చాలా మార్పులు వచ్చాయని, అయితే కొన్ని విషయాలు ఇప్పటికీ మునుపటిలాగే ఉన్నాయని కియారా పేర్కొన్నారు.
ఇంతకు ముందు కంటే బలంగా...
ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కియారా అద్వానీ మాట్లాడుతూ... తల్లి అయిన తర్వాత మునుపటి కంటే బలంగా మారినట్టు కియారా అద్వానీ చెప్పారు. ఇప్పుడు తనను తాను 'టైగ్రేస్' అంటే సింహంగా భావిస్తున్నట్టు తెలిపారు. జీవితాన్ని చూసే విధానం పూర్తిగా మారిపోయిందన్నారు. కొన్నిసార్లు కొన్ని విషయాలకు ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదని అనిపిస్తే... మరికొన్ని సార్లు చిన్న విషయాలు సైతం పెద్దగా అనిపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
పెళ్లికి ముందు, ఇప్పటికీ సిద్ధార్థ్ మల్హోత్రా బంధం అలాగే ఉందన్నారు. ఇద్దరూ కలిసి తిరగడం, సినిమాలు చూడటం, మాట్లాడుకోవడం వంటి విషయాల్లో ఎటువంటి మార్పు లేదన్నారు.
Also Read: IPL 2026: విరాట్ ముద్దు... అనుష్క సిగ్గు... ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ వైరల్ వీడియో చూశారా?
View this post on Instagram
Photo Gallery: Nidhhi Agerwal: హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేదు... అందాల 'నిధి'కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండోయ్ - లేటెస్ట్ బ్లూ శారీ ఫోటోలు చూశారా?
కియారా అద్వానీ సినిమాల విషయానికి వస్తే... రాకింగ్ స్టార్ 'టాక్సిక్'తో వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సినిమాలో ఆమె 'నాడియా' పాత్రలో సందడి చేయనున్నారు. 'టాక్సిక్'లో కియారాతో పాటు నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. మొదట మార్చిలో విడుదల కావాల్సిన ఈ సినిమా.... ఇప్పుడు జూన్ 4న థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది.
Photo Gallery: Venkatesh: ఐపీఎల్ మ్యాచ్‌లో వెంకటేష్ సందడి... RCB vs SRH 2026 ఫోటోలు చూశారా?
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
ట్రెండింగ్ వార్తలు






















