Veera Chandrahasa Telugu Release Date: కన్నడలో 100 రోజులు ఆడిన సినిమా... ఈ వారమే తెలుగు రిలీజ్ - కేజీఎఫ్, సలార్ కనెక్షన్ ఏమిటంటే?
Ravi Basrur Directed Movies: సంగీత దర్శకుడిగా రవి బస్రూర్ తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఆయనలో దర్శకుడు కూడా ఉన్నాడు. కన్నడ సినిమాలు చేశారు. ఇప్పుడు 'వీర చంద్రహాస'తో తెలుగులోకి వస్తున్నారు.

రవి బస్రూర్ (Ravi Basrur)... ఈ పేరు వింటే తెలుగు ప్రేక్షకులకు యష్ 'కేజీఎఫ్', ప్రభాస్ 'సలార్' సినిమాలు గుర్తుకు వస్తాయి. ఆ రెండు సినిమాలకు ఆయన సంగీత దర్శకుడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న 'డ్రాగన్'కు ఇప్పుడు మ్యూజిక్ చేస్తున్నారు. ఆయనలో సంగీత దర్శకుడు మాత్రమే కాదు... దర్శకుడు కూడా ఉన్నారు. కన్నడలో ఆరు సినిమాలకు డైరెక్షన్ చేశారు. ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ సినిమా 'వీర చంద్రహాస'. ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతోంది.
తెలుగులో సెప్టెంబర్ 19న విడుదల!
Veera Chandrahasa Telugu Release On September 19th: కన్నడలో 'వీర చంద్రహాస' ఏప్రిల్ 19న విడుదలైంది. అక్కడ వంద రోజులు ఆడింది. ఇప్పుడు ఆ సినిమాను తెలుగులో సెప్టెంబర్ 19న విడుదల చేస్తున్నారు. కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్, ఎస్జేకే సంస్థలపై ఎమ్‌వీ రాధాకృష్ణ, జేమ్స్ డబ్యూ కొమ్ము తెలుగు ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకు వస్తున్నారు. శివరాజ్ కుమార్ 'వేద', ప్రజ్వల్ దేవరాజ్ 'రాక్షస' తర్వాత తెలుగులో రాధాకృష్ణ విడుదల చేస్తున్న చిత్రమిది.
Also Read: రెమ్యూనరేషన్ పెంచిన తేజా సజ్జా... జాంబీరెడ్డి 2 చేతులు మారడం వెనుక కారణం అదేనా?
'వీర చంద్రహాస' తెలుగులో విడుదల అవుతున్న సందర్భంగా రవి బస్రూర్ హైదరాబాద్ వచ్చారు. ఆయన మాట్లాడుతూ... ''యక్షగానం సంస్కృతిని చూపించే చిత్రమిది. నా పన్నెండేళ్ల కలకు ప్రతిరూపం. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఉంటుందీ సినిమా. సంగీత దర్శకుడిగా వచ్చే డబ్బుతో ప్రతి ఏడాది దర్శక నిర్మాతగా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నా'' అని అన్నారు. ''కన్నడలో అఖండ విజయం సాధించిన 'వీర చంద్రహాస' తెలుగులోనూ హిట్ అవుతుంది. భారతీయ నాగరికత, సంస్కృతికి సంబంధించిన చిత్రమిది. యక్ష గానం మీద తీశారు'' అని నిర్మాత రాధాకృష్ణ చెప్పారు.
Also Read: అనుపమ 'పరదా' టోటల్ కలెక్షన్స్... మూడు వారాలకు ఓటీటీలోకి, థియేటర్లలో ఎంత వచ్చిందో తెల్సా?
Veera Chandrahasa Cast And Crew: శివరాజ్ కుమార్, శిథిల్ శెట్టి, నాగశ్రీ జీఎస్, ప్రసన్న శెట్టిగార్ మందార్తి, ఉదయ్ కడబాల్, రవీంద్ర దేవాడిగ, నాగరాజ్ సర్వెగర్, గుణశ్రీ ఎం నాయక్, శ్రీధర్ కాసర్కోడు, శ్వేత అరెహోల్, ప్రజ్వల్ కిన్నాల్ తదితరులు నటించిన 'వీర చంద్రహాస' చిత్రానికి సమర్పణ: హోంబలే ఫిల్మ్స్, నిర్మాణ సంస్థ: ఓంకార్ మూవీస్, ఛాయాగ్రహణం: కిరణ్ కుమార్ ఆర్, కథ - కథనం - దర్శకత్వం - సంగీతం: రవి బస్రూర్, నిర్మాతలు: ఎన్ఎస్ రాజ్‌కుమార్ - ఎమ్‌వీ రాధాకృష్ణ - జేమ్స్ డబ్యూ కొమ్ము, తెలుగు రైట్స్: కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ - ఎస్జేకే బ్యానర్ (ఎమ్‌వీ రాధాకృష్ణ, జేమ్స్ డబ్యూ కొమ్ము).





















