KGF Chapter 2 Box Office Collection: 'ఆర్ఆర్ఆర్' కంటే తక్కువే కానీ, యశ్ 'కేజీయఫ్ 2' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?
'కె.జి.యఫ్ 2' సినిమాకు బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ లభించాయి. ఈ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
బాక్సాఫీస్ దగ్గర రాకీ భాయ్ జోరు కనపడింది. యశ్ కథానాయకుడిగా నటించిన 'కె.జి.యఫ్ 2'కు తొలి రోజు భారీ వసూళ్లు లభించాయి. కేవలం ఇండియాలో ఈ సినిమా రూ. 134.5 కోట్లు కలెక్ట్ చేసిందని చిత్ర బృందం వెల్లడించింది. పాన్ ఇండియా సినిమాకు ఇది మంచి ఓపెనింగ్ అని చెప్పవచ్చు. అయితే... 2022లో విడుదలైన పాన్ ఇండియా మూవీస్ కలెక్షన్స్ చూస్తే టాప్ ఓపెనింగ్ కాదు.
ఇండియాలో 'కె.జి.యఫ్ 2' ఫస్ట్ డే కలెక్షన్స్ రూ. 134.5 కోట్లు అయితే... ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కలయికలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' కలెక్షన్స్ రూ. 156 కోట్లు. అయితే... హిందీ మార్కెట్ లో 'ఆర్ఆర్ఆర్' కంటే 'కె.జి.యఫ్ 2'కు ఫస్ట్ డే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్' తొలి రోజు 223 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 'కె.జి.యఫ్ 2'కు అంత ఉండకపోవచ్చు. కాకపోతే... లాంగ్ రన్‌లో ఎలా ఉంటుందో చూడాలి.
Also Read: 'గాలివాన' రివ్యూ: 'జీ 5'లో విడుదలైన సిరీస్ ఎలా ఉందంటే?
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన 'కె.జి.యఫ్ 2'లో శ్రీనిధి శెట్టి హీరోయిన్. ఇందులో రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్, ఈశ్వరీ రావు కీలక పాత్రల్లో నటించారు. రవి బస్రూర్ సంగీతం, భువన గౌడ ఛాయాగ్రహణం సినిమాను మరో మెట్టు ఎక్కించాయి.
Also Read: 'బ్లడీ మేరీ' రివ్యూ: ఓటీటీలో విడుదలైన నివేదా పేతురాజ్ సినిమా ఎలా ఉందంటే?