KGF Harish Rai : ఇండస్ట్రీలో విషాదం - కేజీఎఫ్ చాచా ఫేమ్ హరీష్ రాయ్ కన్నుమూత
Harish Rai : కేజీఎఫ్ ఫేం, ప్రముఖ నటుడు హరీష్ రాయ్ గురువారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు.

KGF Actor Harish Rai Passed Away : కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కేజీఎఫ్ చాచాగా ఫుల్ ఫేం సంపాదించుకున్న నటుడు హరీష్ రాయ్ కన్నుమూశారు. కొంతకాలంగా థైరాయిడ్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. కన్నడలో ఎన్నో సినిమాల్లో నటించిన హరీష్... 'కేజీఎఫ్' ఖాసిం చాచాగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కేజీఎఫ్ రెండో పార్ట్ రిలీజ్ అయ్యే సమయానికే ఆయనకు థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో హరీష్ రాయ్ తన ఆరోగ్యం గురించి వెల్లడించారు. పరిస్థితులు కొన్నిసార్లు మాత్రమే మనకు అనుకూలంగా ఉంటాయని... తాను క్యాన్సర్‌తో బాధ పడుతున్నట్లు చెప్పారు. తన గొంతు వాచిపోయిన కారణంగా అది కనిపించకుండా ఉండేందుకు గెడ్డం పెంచానని... కేజీఎఫ్ సినిమాలో గెడ్డంతోనే కనిపించినట్లు చెప్పారు. సాయం కోసం అభ్యర్థించగా హీరో యష్, ధ్రువ్ సర్జా సైతం సాయం చేశారు. అనారోగ్యంతో హరీష్ సన్నగా మారిపోయారు. చివరకు పరిస్థితి విషమించి కన్నుమూశారు.
Also Read : అట్లీ మూవీతో పాన్ వరల్డ్ రేంజ్ - అల్లు అర్జున్ ప్లానింగ్ మామూలుగా లేదు... రాజమౌళితో కూడా!
1995లో వచ్చిన 'ఓం' సినిమాలో డాన్ రాయ్‌గా నటించారు. ఆ తర్వాత రాజ్ బహదూర్, దండుపాల్య, సంజు వెడ్స్ గీత వంటి మూవీస్‌లో నటించి మెప్పించారు.






















