![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
KGF Chapter 3 Movie: 'కేజీఎఫ్ 3' ఉందండోయ్, అమెరికాలో రాకీ భాయ్ రఫ్ఫాడిస్తే?
రాకీ భాయ్ అభిమానులకు గుడ్ న్యూస్. 'కేజీయఫ్' ప్రయాణం ఆగలేదు. మూడో పార్ట్ కూడా రానుంది. 'కేజీయఫ్ 2'లో ఎండింగ్లో పార్ట్ 3 గురించి హింట్ ఇచ్చారు.
![KGF Chapter 3 Movie: 'కేజీఎఫ్ 3' ఉందండోయ్, అమెరికాలో రాకీ భాయ్ రఫ్ఫాడిస్తే? KGF 3 Movie Update KGF3 Hashtag Trending in Twitter As Yash Prashanth Neel announced KGF 3 In KGF 2 Movie End KGF Chapter 3 Movie: 'కేజీఎఫ్ 3' ఉందండోయ్, అమెరికాలో రాకీ భాయ్ రఫ్ఫాడిస్తే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/14/c5da6388e2e5d100671b598a69ed587f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
KGF 3 Movie Update: యశ్ అభిమానులకు, 'కేజీయఫ్' సినిమా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రాకీ భాయ్ ప్రయాణం ఆగలేదు. రెండు సినిమాలకు 'కేజీఎఫ్'కు ఫుల్ స్టాప్ పెట్టడం లేదు. సినిమా మూడో పార్ట్ కూడా ఉంది. ఈ రోజు విడుదలైన 'కేజీఎఫ్ 2' ఎండింగ్లో పార్ట్ 3 గురించి హింట్ ఇచ్చారు. కథ ఎక్కడ ఉండబోతుందనేది కూడా చెప్పేశారు. ఈసారి ఇంటర్నేషనల్ లెవల్ లో రాకీ భాయ్ రఫ్ఫాడించబోతున్నాడు.
'కేజీఎఫ్ 2' ఎర్లీ మార్నింగ్ షోస్, ఫస్ట్ షోస్ చూసిన చాలా మంది ఎండ్ టైటిల్ కార్డ్స్ పడిన తర్వాత బయటకు వచ్చేశారు. దాంతో వాళ్ళు మూడో పార్ట్ అప్డేట్ మిస్ అయ్యారు. ఎండ్ కార్డ్స్ తర్వాత వచ్చే సన్నివేశంలో 'కేజీఎఫ్ 3' గురించి హింట్ ఇచ్చారు. 'కేజీఎఫ్ 2' పతాక సన్నివేశాల్లో సముద్రంలో రాకీ భాయ్ వస్తుంటే... అతడి షిప్‌ను అమెరికా, ఇండోనేషియా దేశాలకు చెందిన అధికారులు వెంటాడటం చూపించారు. ఎందుకు? అనేది చాలా మందికి అర్థం కాలేదు. ఎండ్ కార్డ్స్ తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
Also Read: 'కేజీయఫ్ 2' సినిమా రివ్యూ: నో డౌట్ - బొమ్మ బ్లాక్‌బస్టర్, యశ్ అదుర్స్ అంతే!
రాకీ భాయ్ సామ్రాజ్యం అమెరికాలోనూ విస్తరించినట్టు 'కేజీయఫ్ 2' చివర్లో చూపించారు. రాకీ భాయ్ మీద భారత ప్రధానికి అమెరికా ఫిర్యాదు చేసినట్టూ చూపించారు. ఆ తర్వాత 'కేజీయఫ్ చాఫ్టర్' అంటూ ముగించారు. అది మూడో పార్ట్ గురించి ఇచ్చిన హింట్ అన్నమాట. సినిమాలో ఎక్కడా రాకీ భాయ్ అమెరికా ప్రస్థానాన్ని చూపించలేదు. సో... మూడో పార్ట్ అమెరికాలో సాగుతుందన్నమాట. అక్కడ రాకీ భాయ్ ఏం చేశాడన్నది ఆసక్తికరం.
Also Read: తప్పు చేశా, రెండు సార్లు జైల్లో పెట్టారు - అజయ్ దేవగన్ వ్యాఖ్యలు
Δείτε αυτή τη δημοσίευση στο Instagram.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)