KGF 2 Wins Over Beast: తమిళనాడులో 'బీస్ట్' సినిమాపై రాకీ భాయ్ ఎఫెక్ట్, థియేటర్లు ఖాళీ!
విజయ్ 'బీస్ట్' సినిమాపై 'కె.జి.యఫ్ 2' ఎఫెక్ట్ పడింది. తమిళనాడులో విజయ్ సినిమా థియేటర్లు ఖాళీ అవుతున్నాయి.
'బీస్ట్' బుధవారం విడుదలైంది. 'కె.జి.యఫ్ 2' గురువారం విడుదలైంది. రెండూ పాన్ ఇండియా సినిమాలే. విజయ్ సినిమా కంటే యశ్ సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. విమర్శలు మాత్రమే కాదు, ప్రేక్షకులూ 'కె.జి.యఫ్ 2' వైపు మొగ్గు చూపారు. ఈ ప్రభావం థియేటర్ల దగ్గర స్పష్టంగా కనిపించింది. విజయ్ హోమ్ పిచ్ తమిళనాడులో కూడా 'బీస్ట్' కంటే 'కె.జి.యఫ్ 2'కు అడ్వాన్స్ బుకింగ్స్ బావున్నాయి. కలెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తమిళనాడులో రోహిణి సిల్వర్ స్క్రీన్ (మల్టీప్లెక్స్)లో ఈ రోజు విజయ్ 'బీస్ట్'కు 16 షోలు వేస్తున్నారు. యశ్ 'కె.జి.యఫ్ 2'కు 27 షోలు వేస్తున్నారు. గురువారం రాత్రి చూస్తే... 'కె.జి.యఫ్ 2' షోలు ఎనిమిది హౌస్ ఫుల్ అయ్యాయి. మిగతా షోస్ బుకింగ్స్ కూడా బావున్నాయి. చాలా షోలకు హౌస్ ఫుల్ బోర్డ్స్ పెట్టేశారు. మరోవైపు 'బీస్ట్' టికెట్స్ మెల్లగా సేల్ అవుతున్నాయి. ఒక్క రోహిణి సిల్వర్ స్క్రీన్‌లో మాత్రమే కాదు, మిగతా థియేటర్లలో కూడా అదే పరిస్థితి. 'కె.జి.యఫ్ 2'కు థియేటర్లు పెరుగుతున్నాయి.
తమిళనాడులో పరిస్థితి అలా ఉంటే... తెలుగునాట 'బీస్ట్' పరిస్థితి మరింత అద్వానంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 'బీస్ట్' రెండో రోజు వసూళ్లు దారుణంగా ఉన్నాయి. తెలంగాణలో 'బీస్ట్'కు గురువారం రూ. 35 లక్షలు మాత్రమే వచ్చాయి. అదే 'ఆర్ఆర్ఆర్'కు రూ. 41 లక్షలు వచ్చాయి. 'ఆర్ఆర్ఆర్' విడుదలై 20 రోజులు దాటింది. 'బీస్ట్' రెండో రోజు వసూళ్ల కంటే 'ఆర్ఆర్ఆర్'కు ఎక్కువ ఉండటం గమనార్హం.
Also Read: 'గాలివాన' రివ్యూ: 'జీ 5'లో విడుదలైన సిరీస్ ఎలా ఉందంటే?
రెండు భారీ సినిమాలు ఒకే వారంలో వస్తే... యావరేజ్ టాక్ ఉన్న సినిమాపై ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. కంటెంట్ ఉన్న సినిమాకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. కంటెంట్ లేని సినిమాకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతుంది. అదీ సంగతి! వసూళ్ల పరంగానూ 'కెజియఫ్ 2' మంచి నంబర్స్ నమోదు చేస్తోంది. తొలి రోజు ఈ సినిమాకు ఇండియాలో రూ. 134.5 కోట్ల గ్రాస్ లభించింది. ఓవర్సీస్ కలెక్షన్స్ ఇంకా రిపోర్ట్ చేయాల్సి ఉంది. తొలి రోజు కంటే రెండో రోజు వసూళ్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.