MM Keeravani : మహేష్ బాబు సినిమా అప్డేట్ - రాజమౌళి ఫోన్ స్విచ్చాఫ్, కీరవాణి షాకింగ్ కామెంట్స్!
MM Keeravani : సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్ కీరవాణి తాజా ఇంటర్వ్యూలో మహేష్ - రాజమౌళి ప్రాజెక్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
MM Keeravani About SSMB29 : గత ఏడాది 'RRR' సినిమాతో తో పాన్ ఇండియా హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే. మొదటిసారి వీరి కలయికతో ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాల నెలకొన్నాయి. 'బాహుబలి', 'RRR' సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి మహేష్ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ పై కన్నెశాడు. ఈ క్రమంలోనే సినిమా కోసం ఏది ప్లాన్ చేసినా అది ఇంటర్నేషనల్ రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నాడు. ఈ ఏడాది సినిమా సెట్స్ పైకి వెళ్ళిబోతుంది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ ఎం.ఏం కీరవాణి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఆయన సంగీతం అందించిన ‘నా సామిరంగ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ - రాజమౌళి ప్రాజెక్టుపై మాట్లాడారు."SSMB29 సినిమా కోసం అడుగుదామని ఫోన్ చేస్తే రాజమౌళి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటుంది. నాకు ఇప్పటివరకు ఫోన్ రాలేదు. అంటే నా దాకా ఇంకా రాలేదని అర్థం. ఇంకా సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే విషయం నాకు తెలియదు. ఈ విషయాన్ని రాజమౌళిని అడిగి తెలుసుకోవాలి" అని అన్నారు.
రాజమౌళి ఆస్థాన సంగీత దర్శకుడిగా ఎం.ఎం కీరవాణి కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. జక్కన్న మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు ప్రతీ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తూ వచ్చారు. వాటిల్లో గత ఏడాది విడుదలైన 'RRR' సినిమాలోని 'నాటు నాటు' పాటకి ఏకంగా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకున్నారు. ఇక 'SSMB29' ప్రాజెక్టు కోసం దాదాపు రూ.1000 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ నిర్మాత కె.ఎల్ నారాయణతో కలిసి ఓ హాలీవుడ్ స్టూడియో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఈ సినిమా కోసం చెల్సియా ఇస్లాన్ అనే ఇండోనేషియా హీరోయిన్ ని ఎంపిక చేశారని అంటున్నారు. ఇప్పటికే రాజమౌళి ఆ హీరోయిన్ కి స్క్రీన్ టెస్ట్ కూడా చేశారని, ఈ సినిమాలో ఆమె వర్క్ చేయడం దాదాపు కన్ఫర్మ్ అయిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమాకు సంబంధించి లొకేషన్స్ వేటలో ఉన్నారట. ఈ ఏడాది ఏప్రిల్ లో రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. అయితే షూటింగ్ కు ముందు రాజమౌళి ప్రత్యేక వర్క్ షాప్ ని ప్లాన్ చేయగా మహేష్ బాబు తో పాటు టీ మొత్తం కూడా ఈ వర్క్ షాప్ కోసం హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఆఫ్రికన్ అడ్వెంచర్స్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుందని, సుమారు మూడు భాగాలుగా రాజమౌళి ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.
Also Read : 'గుంటూరు కారం' సినిమాకి జీరో కట్స్ - ఆ డైలాగ్స్‌ను మ్యూట్ చేసిన సెన్సార్ బోర్డ్