అన్వేషించండి

Guntur Kaaram : 'గుంటూరు కారం' సినిమాకి జీరో కట్స్ - ఆ డైలాగ్స్‌ను మ్యూట్ చేసిన సెన్సార్ బోర్డ్

Guntur Kaaram 'గుంటూరు కారం' సినిమాకి సెన్సార్ బోర్ట్ జీరో కట్స్ చెప్పినట్లు సమాచారం. అయితే కొన్ని డైలాగ్స్‌‌లోని పదాలను మాత్రం మ్యూట్ చేశారట.

Zero cuts for Guntur Kaaram Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గుంటూరు కారం' మూవీ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. రిలీజ్ టైమ్ దగ్గర పడుతుండడంతో మూవీ టీం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ అయితే ‘గుంటూరు కారం’లో వింటేజ్ మహేష్ ని చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందనను అందుకున్నాయి.

కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో మహేష్ ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందనను అందుకుంది. జనవరి 12న వరల్డ్ వైడ్ గా ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ‘గుంటూరు కారం’ సినిమాకి సెన్సార్ యూనిట్ U/A సర్టిఫికెట్ జారీ చేయగా తాజాగా సినిమాకి సెన్సార్ యూనిట్ ఎలాంటి కట్స్ చెప్పలేదట. దాదాపు 159 నిమిషాల రన్ టైంతో ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

కాకపోతే సినిమాలో ఓ రెండు సన్నివేశాల్లో వచ్చే డైలాగ్స్‌లోని పదాలను మ్యూట్ చేసినట్లు తెలుస్తోంది. 'గుంటూరు కారం' టోటల్ రన్ టైం 2 గంటల 39 నిమిషాలు. అందులో ఫస్టాఫ్ 85 నిమిషాల సెకండ్ హాఫ్ 74 నిమిషాల నిడివితో ఉంటుందని చెబుతున్నారు. అంటే సెకండ్ హాఫ్ కంటే ఫస్టాఫ్ పెద్దదిగా ఉంటుందని తెలుస్తోంది. మరోవైపు 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ రోజు గుంటూరులో జరగనుంది. సాయంత్రం ఐదు గంటల నుంచి భారత్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న నంబూరు ఎక్స్ రోడ్స్ గ్రౌండ్ అందుకు ముస్తాబు అవుతోంది.

మొదట ఈ ఫంక్షన్ హైదరాబాద్ సిటీలో చేయాలని ప్లాన్ చేశారు. కానీ లా అండ్ ఆర్డర్ సమస్య కారణంగా చిత్ర బృందం ఎంపిక చేసుకున్న చోట పోలీసులు అనుమతి నిరాకరించారు.  దాంతో గుంటూరుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని షిఫ్ట్ చేశారు. అతడు, ఖలేజా వంటి కమర్షియల్ సినిమాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ సినిమా ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ కి జోడిగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రావు రమేష్, జగపతిబాబు, ఈశ్వరి రావు, రఘుబాబు, వెన్నెల కిషోర్ కీలకపాత్రలో పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Also Read :  మహేష్ బాబు ‘గుంటూరు కారం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఓవర్సీస్ రిపోర్ట్, ఈ సంక్రాంతి పోటీ గట్టిగానే ఉంటుంది కాబోలు!

టాప్ హెడ్ లైన్స్

Mary Rivera: 'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Mrunal Thakur: లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్
లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్
Priyanka Chopra: సర్వ మంగళ మాంగళ్యే... అమ్మాయితో ప్రియాంక పూజలు... మంగళ శ్లోక పఠనంలో Varanasi హీరోయిన్
సర్వ మంగళ మాంగళ్యే... అమ్మాయితో ప్రియాంక పూజలు... మంగళ శ్లోక పఠనంలో Varanasi హీరోయిన్

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget