By: ABP Desam | Updated at : 27 Aug 2023 10:33 AM (IST)
Image Credit: Karthikeya and Varun Tej/Instagram
ఈ వారం రెండు తెలుగు చిత్రాలు విడుదల కాగా.. అందులో కేవలం ఒక్క సినిమాకే కాస్త గుర్తింపు లభించింది. అది కూడా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక హీరో సినిమాను మరో యంగ్ హీరో మూవీ బీట్ చేసింది. ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. యంగ్ హీరో కార్తికేయ మూవీపై చూపించినంత ఆసక్తిని మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన సినిమాపై చూపించలేకపోయారు ఆడియన్స్.
‘బెదురులంక 2012’ ముందు నిలబడలేకపోయిన ‘గాండీవధారి అర్జున’..
ఈ వారం తెలుగులో రెండు సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి వచ్చేశాయి. అందులో ఒకటి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన, వరుణ్ తేజ్ నటించిన ‘గాండీవధారి అర్జున’, మరొకటి దాంతో పోలిస్తే.. కాస్త తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘బెదురులంక 2012’. ఈ రెండు సినిమాలు దాదాపుగా థ్రిల్లర్ జోనర్‌కు చెందినవే. పైగా రెండు చిత్రాలు ఒకేవిధంగా ప్రమోషన్స్ చేశాయి. కానీ ‘గాండీవధారి అర్జున’తో పోలిస్తే ‘బెదురులంక 2012’కే ఓపెనింగ్స్ బాగున్నాయని తెలుస్తోంది. ‘గాండీవధారి అర్జున’ భారీ బడ్జెట్‌తో తెరకెక్కి, యాక్షన్ సీన్స్ అన్నీ ఫారిన్‌లో షూట్ చేసుకున్నా కూడా ఈ మూవీ గురించి చాలామంది ప్రేక్షకులకు తెలియదు. అసలు ఈ శుక్రవారం.. ఒక మెగా హీరో సినిమా థియేటర్లలో సందడి చేస్తుందని కూడా చాలామంది గుర్తించలేదు.
కార్తికేయ నటించిన ‘బెదురులంక 2012’ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రం. 2012లో యుగాంతం అని అనుకుంటున్న సమయంలో బెదురులంక అనే ఊరిలో జరిగిన పరిణామాలపై ఈ మూవీ తెరకెక్కింది. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌లో కాస్త కామెడీ కూడా యాడ్ అవ్వడంతో ప్రేక్షకులు ఈ మూవీకే ఎక్కువగా ఓటు వేశారు. అందుకే రిలీజ్ అయిన రెండోరోజే రెస్పాన్స్ చూసి మూవీ టీమ్ సక్సెస్ మీట్‌ను కూడా ఏర్పాటు చేసుకుంది. మామూలుగా ఒక సినిమా ఎంత బాగా ప్రేక్షకులను మెప్పించిందో తెలుసుకోవాలన్నా, కమర్షియల్‌గా హిట్ అనే ట్యాగ్‌ను అందుకోవాలన్నా.. మొదటి వీకెండ్ కలెక్షన్స్ అనేవి చాలా కీలక పాత్రను పోషిస్తాయి. దీన్ని బట్టి చూస్తే విడుదలయిన రెండురోజుల్లో ‘బెదురులంక 2012’తో పోలిస్తే.. ‘గాండీవధారి అర్జున’ కలెక్షన్స్ కాస్త వెనకబడి ఉన్నాయి.
కలెక్షన్స్ విషయంలో క్లియర్..
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద పరిస్థితినే తీసుకుంటే.. సంధ్య 35 ఎమ్ఎమ్‌లో విడుదలయిన ‘గాండీవధారి అర్జున’ రూ.25,040 కలెక్షన్స్‌ను అందుకుంది. సంధ్య 70 ఎమ్ఎమ్‌లో విడుదలయిన ‘బెదురులంక 2012’ రూ.69,250 కలెక్షన్స్‌ను సాధించింది. దీన్ని బట్టి చూస్తే బ్యాక్‌గ్రౌండ్ చూసి ప్రేక్షకులు.. సినిమాలకు వెళ్లే రోజులు పోయాయని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ బడ్జెట్ దాదాపు రూ.9 కోట్లని టాక్ వినిపిస్తోంది. ఒక కార్తికేయ బడ్జెట్.. అందులో కనీసం సగం కూడా ఉండకపోవచ్చు. అయినా కార్తికేయ సినిమాలు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి.
Also Read: హీరోయిన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉండకూడదు అనుకున్నా, కానీ: తమన్నాతో ప్రేమపై విజయ్ కామెంట్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Pawan Kalyan: జనసేనకు విరాళం, పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో స్టంట్ మ్యాన్ సాయం
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
WhatsApp Channels: వాట్సాప్ చానెల్స్‌లో మన దేవరకొండే టాప్ - మెటా యజమానికే షాకిచ్చిన కత్రినా కైఫ్!
Vidhi Movie: కంటి చూపులేనివాళ్లు సైతం థియేటర్‌కు వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: ‘విధి’ హీరో రోహిత్ నందా
అప్పట్లో చిరంజీవి, కమల్ హాసన్, శ్రీదేవిల రెమ్యునరేషన్ ఇంతేనా? ఆసక్తికర విషయాలు చెప్పిన యండమూరి
AP News : కాగ్ అభ్యంతరాలు - కోర్టుల్లో పిటిషన్లు ! గ్రామ, వార్డు సచివాలయాలు రాజ్యాంగ వ్యతిరేకమా ?
TS Cabinet Agenda : ఎన్నికల షెడ్యూల్ రాక ముందే కొత్త పథకాలు - కేబినెట్ భేటీలో కేసీఆర్ సంచలనాలు ఖాయమా ?
Breaking News Live Telugu Updates: బాలాపూర్ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్ విల్లా లడ్డూ
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
/body>