అన్వేషించండి

హీరోయిన్‌తో రిలేషన్‌షిప్‌లో ఉండకూడదు అనుకున్నా, కానీ: తమన్నాతో ప్రేమపై విజయ్ కామెంట్స్

తమన్నా, విజయ్ వర్మ రిలేషన్‌లో ఉన్న విషయాన్ని ఓపెన్‌గా ఒప్పేసుకున్నారు. అప్పటినుండి వీరు ఏ సినిమా, సిరీస్ ప్రమోషన్స్‌లో పాల్గొన్నా వారి రిలేషన్‌షిప్‌కు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే ఎదురవుతున్నాయి.

సినీ పరిశ్రమలో హీరో, హీరోయిన్ కాస్త చనువుగా కనిపిస్తే చాలు.. ఇక వారి మీద రూమర్స్ మొదలయిపోతాయి. వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఇలా చాలా రూమర్స్ వారి చుట్టూనే తిరుగుతుంటాయి. కొందరు ఈ రూమర్స్‌కు క్లారిటీ ఇవ్వడానికి ముందుకొస్తే.. కొందరు మాత్రం వీటిని పట్టించుకోకుండా ముందుకెళ్తుంటారు. తాజాగా తమన్నా, విజయ్ వర్మ మాత్రం మొదటి ఆప్షన్‌నే ఎంచుకున్నారు. వారిద్దరూ రిలేషన్‌లో ఉన్న విషయాన్ని ఓపెన్‌గా ఒప్పేసుకున్నారు. అప్పటి నుంచి వీరు ఏ సినిమా, సిరీస్ ప్రమోషన్స్‌లో పాల్గొన్నా వారి రిలేషన్‌షిప్‌కు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే ఎదురవుతున్నాయి. తాజాగా అసలు విజయ్ వర్మ.. ఎలాంటి అమ్మాయిని కావాలనుకున్నాడో రివీల్ చేశాడు.

నటితో రిలేషన్ వద్దనుకున్నా

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ వర్మ.. ‘‘నేను నా కెరీర్‌ను ప్రారంభించినప్పుడు హీరోయిన్‌ను మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో ఉన్న ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో ఉండకూడదని అనుకున్నాను. దీనికి కారణం.. నేను ఇండస్ట్రీ మీద చాలా కోపంగా ఉండడం కూడా అయ్యిండవచ్చు. కానీ మేము ఎప్పుడైతే.. ఒకరిని ఒకరం కలిశామో అప్పటినుంచి ఈ బిజినెస్ గురించి తెలిసినవారు, ఆర్ట్స్ గురించి తెలిసినవారు, క్రియేటివిటీ ఉన్నవారు, ఆర్థికంగా, అన్ని రకాలుగా మూవీ మేకింగ్ గురించి తెలిసినవారు మన జీవితంలో ఉంటే ఎంత విలువ ఉంటుందని నాకు అప్పుడే అర్థమయ్యింది’’ అంటూ తమన్నా తన ఆలోచనా విధానంలో తీసుకొచ్చిన మార్పు గురించి చెప్పుకొచ్చాడు.

‘‘తన అనుభవం, తన పనితీరు, మంచితనం.. ఇవన్నీ నాకు చాలా సాయంగా ఉంటాయి. తను చాలా కోణాల్లో ఆలోచిస్తుంది. ఒక్కొక్కసారి నేను ఏదో ఇంటర్వ్యూలో పాల్గొన్నందుకో, ఏదో చెప్పినందుకో.. ఇలా చాలా కారణాల వల్ల చాలా బాధపడుతుంటాను. కానీ తమన్నా వెంటనే నేను దాన్ని చూసే దృష్టి కోణాన్నే మార్చేస్తుంది’’ అంటూ తమన్నా మనస్థత్వాన్ని ఒక్క మాటలో చెప్పేశాడు.

ఈ జంటపై నెగిటివ్ కామెంట్స్

తమన్నా, విజయ్ వర్మ కలిసి చనువుగా ఉంటున్నారని 2023 మొదట్లో రూమర్స్ మొదలయ్యాయి. వీరిద్దరూ కలిసి న్యూ ఇయర్ పార్టీలో ముద్దు పెట్టుకున్న ఫోటో వైరల్‌గా మారింది. కొన్నాళ్ల వరకు దీని గురించి వీరిద్దరూ ఏమీ మాట్లాడడానికి ఇష్టపడలేదు. కానీ విజయ్, తమన్నా కలిసి నటించిన ‘లస్ట్ స్టోరీస్ 2’ ప్రమోషన్స్ సమయంలో వారి రిలేషన్‌షిప్‌ను ముందుగా అధికారికంగా ప్రకటించింది తమన్నా. తాను విజయ్‌ను ప్రేమిస్తున్నానని, విజయ్ తన హ్యాపీ ప్లేస్ అని చెప్పుకొచ్చింది. దీంతో వారు ప్రేమలో చాలా లోతుగా మునిగిపోయారని బాలీవుడ్ ప్రేక్షకులంతా అనుకోవడం మొదలుపెట్టారు. విజయ్ లాంటి అప్‌కమింగ్ యాక్టర్‌తో సీనియర్ హీరోయిన్ తమన్నా ప్రేమలో ఉండడమేంటి అని ఇప్పటికీ ఈ జంటపై పలువురు నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయినా వీరు అవేమీ పట్టించుకోకుండా ఫ్యాన్స్‌కు కపుల్ గోల్స్‌ను అందిస్తున్నారు. 

ఓటీటీ కంటెంట్‌కే ప్రాధాన్యత

ప్రస్తుతం విజయ్ వర్మ, తమన్నా.. ఇద్దరూ ఎవరి ప్రాజెక్ట్స్‌తో వారు బిజీగా ఉన్నారు. ఇక సినిమాలకంటే ఎక్కువగా వెబ్ సిరీస్‌లతోనే విజయ్ వర్మ బిజీ అవుతున్నాడు. ముందుగా తమన్నాతో కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2’లో నటించిన తర్వాత ‘దాహద్’ అనే మరో వెబ్ సిరీస్ చేశాడు విజయ్. ఇప్పుడు ‘కాల్‌కూట్’ అనే మరో సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎక్కువగా ఓటీటీ కంటెంట్ అవకాశాలనే అందుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నాడు ఈ హీరో.

Also Read: హారర్ థ్రిల్లర్ సినిమాతో రాజమౌళి హీరోయిన్ రీ ఎంట్రీ - లుక్ చూశారా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Myanmar Earthquake : మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
Bangkok Earthquake : బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
Polavaram Project: పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
Nagababu Latest News: నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP DesamShardul Thakur Bowling Strategy vs SRH IPL 2025 | కాన్ఫిడెన్స్ తోనే సన్ రైజర్స్ కు పిచ్చెక్కించాడుShardul Thakur 4Wickets vs SRH | IPL 2025 లో పర్పుల్ క్యాప్ అందుకున్న శార్దూల్ విచిత్రమైన కథ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Myanmar Earthquake : మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
మయన్మార్ లో భయంకరమైన భూకంపం- 7.2 తీవ్రతతో కంపించిన భూమి
Bangkok Earthquake : బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
బ్యాంకాక్‌లో కుప్పకూలిన భవనాలు- పరుగులు పెట్టిన జనాలు- థాయ్‌లాండ్‌లో భూకంప విధ్వంసం
Polavaram Project: పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
పోలవరం నిర్వాసితుల్లో కొందరికి 6 లక్షలు, మరికొందరికి 10 లక్షలు.. తేడా ఎందుకో తెలుసా?
Nagababu Latest News: నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
నాగబాబుకు మంత్రి పదవి మరికొంత ఆలస్యం?
Nara Lokesh News: ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
ప్రాణం నిలిపిన లోకేష్ - సొంత డబ్బుతో ప్రత్యేక విమానంలో గుండె తరలింపు 
Tirumala News: తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
తిరుమల భక్తులకు ప్రత్యేక ఐడీ- గూగుల్‌ ఏఐతో టీటీడీ ఒప్పందం
Telangana Crime News: డిన్నర తర్వాత నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి- కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన తల్లి
డిన్నర తర్వాత నిద్రలోనే ముగ్గురు చిన్నారులు మృతి- కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన తల్లి
Pakistani Latest News: విమానాశ్రయాలు, విమానాల్లో ఫొటోలు, వీడియోలు నిషేధం- కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
విమానాశ్రయాలు, విమానాల్లో ఫొటోలు, వీడియోలు నిషేధం- కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
Embed widget