Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?
Karthikeya 2 Box Office Collection Day 2 : 'కార్తికేయ 2' సినిమాకు రెండో రోజు కలెక్షన్లు బావున్నాయి. మొదటి రోజు కంటే రెండో రోజు సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది. మూడో రోజు లాభాల్లోకి వెళ్లవచ్చని టాక్.
Karthikeya 2 Running Successfully In Theatres : థియేటర్ల దగ్గర సందడి కనబడుతోంది. యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) మరో విజయం సాధించినట్లే. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా 'కార్తికేయ 2' (Karthikeya 2 Movie) వసూళ్లు బావున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ కలెక్ట్ చేసింది.
Karthikeya 2 Second Day Collection Worldwide: 'కార్తికేయ 2'కు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 8.50 కోట్ల గ్రాస్ లభించింది. ఖర్చులు గట్రా తీసేయగా... రూ. 5.05 కోట్ల షేర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.30 కోట్ల గ్రాస్ (రూ. 3.50 కోట్ల షేర్) వసూలు చేసింది. రెండో రోజు తెలుగునాట మంచి వసూళ్లు సాధించింది.
తెలుగు రాష్ట్రాల్లో 'కార్తికేయ 2' రెండో రోజు వసూళ్లు చూస్తే...
నైజాం : రూ. 1.36 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ. 50 లక్షలు
సీడెడ్ : రూ. 69 లక్షలు
నెల్లూరు : రూ. 11 లక్షలు
గుంటూరు : రూ. 31 లక్షలు
కృష్ణా జిల్లా : రూ. 30 లక్షలు
తూర్పు గోదావరి : రూ. 25 లక్షలు
పశ్చిమ గోదావరి : రూ. 29 లక్షలు
తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు రూ. 5. 85 కోట్ల గ్రాస్ (రూ. 3.81 కోట్ల షేర్) వచ్చింది. తొలి రోజు కంటే రెండో రోజు 31 లక్షల రూపాయలు ఎక్కువ వసూలు చేసింది. ఈ మధ్య కాలంలో ఇలా వసూలు చేయడం, కలెక్షన్లు స్టడీగా ఉండటం మంచి విషయం.
సాధారణంగా రెండో రోజు కలెక్షన్లు డ్రాప్ అవుతుంటాయి. 'కార్తికేయ 2' సినిమా విషయంలో అలా జరగలేదు. ఈ రోజు స్వాతంత్య్ర దినోత్సవం సెలవు ఉండటంతో వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. రెస్టాఫ్ ఇండియా, కర్ణాటకతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లో వసూళ్లు యాడ్ చేస్తే... రెండు రోజుల్లో టోటల్ గ్రాస్ 10.07 కోట్ల రూపాయలు అని ట్రేడ్ టాక్.
మూడో రోజు నుంచి లాభాల్లోకి?
మొదటి రోజు కంటే రెండో రోజుకు థియేటర్లు పెరిగాయి. మరోవైపు ఉత్తరాదిలోనూ స్క్రీన్లు బాగా పెరిగాయి. మూడో రోజు నుంచి సినిమా లాభాల్లోకి ఎంటర్ కావచ్చని టాక్. మూడో రోజు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పెట్టిన పెట్టుబడి రావచ్చని ట్రేడ్ వర్గాల ఖబర్. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 12.80 కోట్లు జరిగింది. సో... మూడో రోజుకు ఆ అమౌంట్ మొత్తం రావచ్చు.
చందూ మొండేటి (Chandoo Mondeti) 'కార్తికేయ 2'లో నిఖిల్ సరసన అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయికగా నటించారు. శ్రీనివాస రెడ్డి (Srinivasa Reddy) 'వైవా' హర్ష చెముడు హీరో హీరోయిన్లతో పాటు ట్రావెల్ చేసే పాత్రలలో కనిపించారు. ఆదిత్యా మీనన్ (Aditya Menon), తులసి, ప్రవీణ్ (Comedian Praveen), సత్య తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
Also Read : స్క్రీన్లు తక్కువ, కలెక్షన్లు ఎక్కువ - తొలి రోజే 25 శాతం రికవరీ చేసిన 'కార్తికేయ 2'.
ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) సంయుక్తంగా నిర్మించారు. తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేశారు.
Also Read : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ