By: ABP Desam | Updated at : 05 Jun 2023 02:30 PM (IST)
Image Credit: Kiara Advani/Instagram
బాలీవుడ్ స్టార్స్ కార్తీక్ ఆర్యన్, కియారా అడ్వాణీ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''సత్యప్రేమ్ కీ కథ''. ‘భూల్ భులయ్య 2’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సమీర్ విద్వాంస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సాజిద్ నడియాద్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైనమెంట్స్, నమః పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం, షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయింది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్, టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేసారు.
''హృదయ పూర్వకంగా నవ్వుకోండి... నవ్వేదాకా ఏడవండి... నిజమైన ప్రేమ యొక్క శక్తిని నమ్మండి'' అంటూ దర్శకుడు సమీర్ 'సత్య ప్రేమ్ కి కథ' ట్రైలర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసారు. 'నువ్వు సింగిల్ గా ఉన్నావా?' అని కియారా రిలేషన్ షిప్ గురించి కార్తీక్ అడగ్గా.. 'నేను నీకు నిజంగా సింగిల్ గా అమ్మాయిలా కనిపిస్తున్నానా?' అని కియారా అనడంతో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఇందులో సత్యప్రేమ్ పాత్రలో కార్తీక్ ఆర్యన్ నటించగా, కథ కిషన్ కపాడియా పాత్రలో కియారా కనిపించింది. వీరిద్దరి ట్రూ లవ్ స్టోరీని ఈ ట్రైలర్ ఆవిష్కరిస్తోంది.
సత్యప్రేమ్, కథల మధ్య అందమైన మ్యూజికల్ జర్నీని ఈ ట్రైలర్ లో చూపించారు. వారిద్దరి పరిచయం, ప్రేమ, పెళ్లి, మనస్పర్థలు, భావోద్వేగాల సమ్మేళనంగా ఉన్న ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. కియారా తనకు తపన్ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లు చెప్పడంతో.. సీరియస్ బాయ్ ఫ్రెండ్ కాకపోతే ఆమె కోసం వేచి చూస్తానని కార్తీక్ చెప్తాడు. చివరికి ఇద్దరూ ప్రేమలో పడి, తమ రిలేషన్ ను పెళ్లి వరకూ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాతే వారి లైఫ్ లో కొన్ని అనుకోని సంఘటనలతో మనస్పర్థలు తలెత్తినట్లు అర్థమవుతోంది. సత్యప్రేమ్ కథ మధ్య ఏం జరిగింది? వీరి ప్రేమకథ ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి వరకూ 'సత్యప్రేమ్ కి కథ' ట్రైలర్ గ్రాండ్ గా కనిపించింది. ప్రధాన జంట మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ‘భూల్ భులయ్య 2’ తర్వాత కార్తీక్ - కియారా జంట మరోసారి మ్యాజిక్ చేసారు. ఇన్నోసెంట్ బాయ్ గా కార్తీక్ ఆర్యన్ అద్భుతమైన నటన కనబరిచాడు. మరోవైపు కియారా అద్వానీ అందంతో పాటుగా తన అభినయంతో ఆకర్షించింది. ఇందులో గజరాజ్ రావు, సుప్రియా పాఠక్, సిద్ధార్థ్ రాందేరి, రాజ్ పాల్ యాదవ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
ట్రైలర్ లో 'నేను ఒక సీక్రెట్ చెప్తాను. నేను వర్జిన్ ని, నా వైఫ్ కోసం శీలాన్ని దాచుకున్నాను' అని కార్తీక్ అమాయకంగా చెప్పే డైలాగ్.. నేను ఈ భూమి మీదకు నిన్ను ప్రేమించడానికి మాత్రమే వచ్చాను' వంటి సంభాషణలు ఆకట్టుకున్నాయి. ఇందులో విజువల్స్ మరియు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా పాటలు ఈ చిత్రానికి మెయిన్ అసెట్ కాబోతున్నాయని చెప్పాలి. హితేష్ సోనిక్ ఈ చిత్రాన్ని బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేయగా.. తనిష్క్ బాగ్చి, మనన్ భరద్వాజ్, పాయల్ దేవ్, రోచక్ కోహ్లీ పాటలు అందించారు. జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
King of Kotha: ఎట్టకేలకు ‘కింగ్ ఆఫ్ కోత’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ అంటే?
Sundeep Kishan New Movie : పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సందీప్ కిషన్ కొత్త సినిమా - డైరెక్టర్ ఎవరంటే?
The Great Indian Suicide : ఆహాలో 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' - హెబ్బా పటేల్ సినిమా ఎక్స్క్లూజివ్ రిలీజ్!
Chandramukhi 2: ‘చంద్రముఖి 2‘ విడుదలకు ముందు రజనీకాంత్ ఆశీర్వాదం తీసుకున్న రాఘవా లారెన్స్
Sreeleela Rashmika : మళ్ళీ విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా - ఆ సినిమా నుంచి శ్రీ లీల అవుట్?
Chandrababu News: చంద్రబాబు పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి
Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!
Paritala Sunitha: మాజీ మంత్రి పరిటాల సునీత దీక్ష భగ్నం, ఆస్పత్రికి తరలింపు
Kumbham Anil: BRSకు బై, కాంగ్రెస్కు హాయ్ చెప్పిన కుంభం అనిల్, 2 నెలల్లోనే సొంతగూటికి చేరడానికి కారణం ఏంటంటే?
/body>