Kantara Chapter 1 Collection Day 3: 'కాంతార' దెబ్బకు సల్మాన్, చరణ్ రికార్డులు గల్లంతు... 'సికిందర్', 'గేమ్ చేంజర్' అవుట్ - మూడు రోజుల్లో ఇండియా నెట్ ఎంతంటే?
Kantara Chapter 1 Box Office Collection Day 3: 'కాంతార' సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా సాధించిన కలెక్షన్లకు సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ రికార్డులు గల్లంతు అయ్యాయి.

Kantara Chapter 1 Three Days Collection: 'కాంతార చాప్టర్ 1' దెబ్బకు బాక్స్ ఆఫీస్ బరిలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రికార్డులు గల్లంతు అయ్యాయి. మూడు రోజుల్లో ఈ సినిమా ఇండియాలో సాధించిన నెట్ కలెక్షన్స్ ముందు వాళ్ళిద్దరి లేటెస్ట్ సినిమాల కలెక్షన్స్ చిన్నబోయాయి. మూడు రోజుల్లో 'కాంతార' ప్రీక్వెల్ ఎన్ని కోట్లు సాధించింది? ఇండియాలో ఈ సినిమా నెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే...
మూడు రోజుల్లో 150 కోట్లు...
ఇండియన్ బాక్స్ ఆఫీస్‌లో రికార్డ్!
'కాంతార చాప్టర్ 1' సినిమాకు ఇండియాలో మొదటి రోజు 61.85 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ వచ్చింది. మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లలో 25% డ్రాప్ అయ్యాయి. శుక్రవారం 46 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది. అయితే శనివారం మళ్లీ కలెక్షన్స్ పెరిగాయి.
ఇండియాలో శనివారం నాడు 'కాంతార చాప్టర్ 1'కు 55 కోట్ల రూపాయలకు పైగా నెట్ కలెక్షన్స్ వచ్చాయి. కన్నడ వెర్షన్ రూ. 14.5 కోట్లు, తెలుగులో రూ. 11.7.5 కోట్లు, హిందీలో రూ. 19 కోట్లు, తమిళంలో రూ. 5.75 కోట్లు, మలయాళంలో రూ. 4.25 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. దాంతో మూడో రోజు 55.25 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ సాధించింది.
అక్టోబర్ రెండున అంటే గురువారం 'కాంతార' విడుదల అయ్యింది. గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజుల్లో ఇండియాలో ఈ సినిమా సాధించిన నెట్ కలెక్షన్స్ 163.10 కోట్ల రూపాయలు. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్ 200 కోట్ల రూపాయలు రీచ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి
Also Read: నయా 'లేడీ సూపర్ స్టార్'... నయనతార కాదు, ఈవిడ ఎవరో తెలుసా?
సల్మాన్ ఖాన్ లాస్ట్ సినిమా 'సికిందర్'. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఆ సినిమా ఇండియాలో లైఫ్ టైంలో 110 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ సాధించింది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన 'గేమ్ చేంజర్'. ఇండియాలో టోటల్ నెట్ కలెక్షన్ 131 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఆ రెండు సినిమాలను 'కాంతార 2' క్రాస్ చేసింది. దాంతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. కన్నడలో 150 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ సాధించిన నాలుగో సినిమాగా 'కాంతార ఛాప్టర్ 1' నిలిచింది. ఓవర్సీస్ మార్కెట్టులో కూడా 'కాంతార' మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అక్కడ రెండు రోజుల్లో 2.5 మిలియన్ డాలర్స్ క్రాస్ చేసింది. అంటే 22 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. వీకెండ్ అయ్యే సరికి నాలుగు మిలియన్ డాలర్స్ మార్పు చేరుకునే అవకాశం కనబడుతుంది.
Also Read: 'కాంతార'ను బీట్ చేసిన 'ఇడ్లీ కొట్టు'... అక్కడ ధనుష్ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు!





















