Beauty Movie: 'బ్యూటీ'లో కొత్త పాట... 'కన్నమ్మ' బాగుందమ్మా - విన్నారా?
Ankith Koyya New Movie: 'ఆయ్', 'మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం'లో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న అంకిత్ కొయ్య హీరోగా నటిస్తున్న సినిమా 'బ్యూటీ'. ఇందులో 'కన్నమ్మ' పాటను శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేశారు.

అంకిత్ కొయ్య (Ankith Koyya) గుర్తు ఉన్నారా? 'ఆయ్'లో హీరో స్నేహితుడిగా, 'మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం'లో రావు రమేష్ కుమారుడిగా నటించారు. ఆయన ఇంకొన్ని సినిమాలు చేశారు. అయితే... అంకిత్ కొయ్య సోలో హీరోగా నటిస్తున్న సినిమా 'బ్యూటీ'. శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమాలో కొత్త పాటను విడుదల చేశారు.
కన్నమ్మ... మెలోడీ బావుందమ్మా!
వానరా సెల్యూలాయిడ్, మారుతి టీం ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'బ్యూటీ'. 'గీతా సుబ్రమణ్యం', 'హలో వరల్డ్' వెబ్ సిరీస్‌లతో పాటు రాజ్ తరుణ్ 'భలే ఉన్నాడే' సినిమా ఫేమ్ జె.ఎస్.ఎస్. వర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అడిదాల విజయ పాల్ రెడ్డి, ఉమేష్ కెఆర్ బన్సాల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆర్.వి. సుబ్రహ్మణ్యం కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాలో అంకిత్ కొయ్య, నీలఖి పాత్ర హీరో హీరోయిన్లు.
'బ్యూటీ' నుంచి విడుదలైన బ్యూటీఫుల్ సాంగ్ 'కన్నమ్మ...'లో మెలోడీ బావుందని నెటిజన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఈ పాటను సనారే రాయగా... ఆదిత్య ఆర్కే, లక్ష్మీ మేఘన ఆలపించారు. విజయ్ బుల్గానిన్ అందించిన హృద్యమైన మెలోడీ బాణీ శ్రోతలను ఆకట్టుకుంటోంది. పాటలో సాహిత్యం, పిక్చరైజేషన్, హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది.
Beauty movie cast and crew: అంకిత్ కొయ్య, నీలాఖి పాత్ర జంటగా నటిస్తున్న 'బ్యూటీ' సినిమాలో సీనియర్ నరేష్, వాసుకి, నంద గోపాల్, సోనియా చౌదరి, నితిన్ ప్రసన్న, మురళీ గౌడ్, ప్రసాద్ బెహరా ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్రీ సాయి కుమార్ దారా, కళా దర్శకత్వం: బేబీ సురేష్ భీమగాని, కూర్పు: ఎస్‌బి ఉద్ధవ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి.ఎస్. రావు, నిర్మాణ సంస్థలు: వానరా సెల్యులాయిడ్ - జీ స్టూడియోస్ - మారుతీ టీమ్ ప్రొడక్ట్, కథ - స్క్రీన్ ప్లే: ఆర్.వి. సుబ్రహ్మణ్యం, నిర్మాతలు: అడిదాల విజయ పాల్ రెడ్డి - ఉమేష్ కేఆర్ బన్సాల్, స్క్రీన్ ప్లే - డైలాగ్స్ - దర్శకత్వం: జె.ఎస్.ఎస్. వర్ధన్.





















