Rishab Shetty: 'కాంతార చాప్టర్ 1'లో రిషభ్ శెట్టి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? - స్టార్ హీరోల బాటలోనే...
Kantara Chapter 1: 'కాంతార చాప్టర్ 1' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ పార్ట్‌ను మించి బడ్జెట్ నాలుగింతలు కాగా హీరో రిషభ్ రెమ్యునరేషన్‌పైనే అందరి దృష్టి ఉంది.

Rishab Shetty Remuneration For Kantara Chapter 1: కన్నడ స్టార్ రిషభ్ శెట్టి 'కాంతార చాప్టర్ 1' మీదే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. 2022లో చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకున్న 'కాంతార'కు ప్రీక్వెల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది. కొన్ని ప్రమాదాలతో ప్రీక్వెల్ షూటింగ్ టైంలోనూ పలుమార్లు వార్తల్లో నిలిచింది. ఇక తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ ప్రాజెక్టులో రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూనే స్వీయ దర్శకత్వం వహించారు. ఇందుకోసం ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే ఆలోచన అందరిలోనూ ఉంది.
రిషభ్ రెమ్యునరేషన్ ఎంతంటే?
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'హోంబలే ఫిల్మ్స్' ఈ మూవీ కోసం భారీ బడ్జెట్ కేటాయించింది. తన రెమ్యునరేషన్ విషయంలో హీరో రిషభ్ శెట్టి కీలక నిర్ణయం తీసుకున్నారు. డైరెక్ట్‌గా రెమ్యునరేషన్ కాకుండా మూవీ రిలీజ్ తర్వాత లాభాల్లో వాటాలు తీసుకుంటారని తెలుస్తోంది. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే ఈ సారి బడ్జెట్ 4 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో తన రెమ్యునరేషన్ గురించి ఆలోచించని రిషభ్... స్వయంగా నిర్మాణ ఖర్చులకే కొంత మొత్తాన్ని వినియోగించారు.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్‌గా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులను రికార్డు స్థాయికి అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. నిర్మాతలకు భారీ లాభాలు ఖాయంగా కనిపిస్తోంది. దీంతో లాభాల్లో వాటాలు తీసుకోవాలని రిషభ్ భావిస్తున్నారట. బాలీవుడ్ స్టార్స్ ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్‌లు కూడా ఇలానే చేస్తుండగా... రిషభ్ సైతం వారినే ఫాలో అవుతున్నారు. అయితే, కన్నడ ఇండస్ట్రీలో చాలా మంది ఆర్టిస్టులు ముందే తమ రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకుంటారు. మూవీ రిజల్డ్ ఎలా ఉన్నా ఆ భారం నిర్మాతలపైనే పడుతుంది.
Also Read: 'OG' సీక్వెల్‌లో అకీరా నందన్ - సుజీత్ రియాక్షన్ ఇదే... నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇచ్చేశారుగా...
ట్రైలర్ గూస్ బంప్స్
ఇక రీసెంట్‌గా రిలీజ్ చేసిన కాంతార ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఆగిపోయిందో అంతకు ముందు జరిగిన ఘటనలతో పాటు పుంజుర్లి దేవునికి సంబంధించి పూర్తి విశేషాలు సెకండ్ పార్టులో చూపించనున్నారు. దేవుని అవతారంలో తన తండ్రి మాయమైన చోటుకి వచ్చిన కొడుకు 'నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు?' అనే ప్రశ్నతో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. ఏళ్ల క్రితం అక్కడ ఉన్న రాజ్యం, రాజుకు 'కాంతార'లో తెగకు మధ్య యుద్ధం, శివుని అవతారం ఇలా అన్నింటినీ అద్భుతంగా చూపించనున్నట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. పుంజుర్లి దేవుడు, రాజు, కాంతార తెగకు ఉన్న సంబంధం ఏంటి? అనేదే సస్పెన్స్.
మూవీలో రిషభ్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తుండగా... హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో 7 వేలకు పైగా స్క్రీన్లలో మూవీ అక్టోబర్ 2న రిలీజ్ కానుంది.





















