అన్వేషించండి

Baahubali 3: ప్రభాస్ అభిమానులకు బంపర్ న్యూస్... 'బాహుబలి 3' పాన్ చేస్తున్న రాజమౌళి!

KE Gnanavel Raja: బాహుబలి త్రీ గురించి ప్రభాస్ అభిమానులకు బంపర్ అప్డేట్ ఇచ్చారు తమిళనాడు నిర్మాత జ్ఞానవేల్ రాజా. రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా గురించి ఆయన ఏం చెప్పారో తెలుసా?

తమిళ నిర్మాత కెఈ జ్ఞానవేల్ రాజా (KE Gnanavel Raja) చెప్పే మాటలు నిజం అయితే...‌‌‌ పాన్ ఇండియా ప్రేక్షకులు అందరికీ పండగ అని చెప్పాలి.‌ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) కలయికలో వచ్చిన బాహుబలికి మరో పార్ట్ తెరకెక్కనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... 

'బాహుబలి 3' ప్లానింగులో ఉంది - జ్ఞానవేల్ రాజా
కోలీవుడ్ స్టార్ హీరో, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడైన సూర్య శివ కుమార్ కథానాయకుడిగా కెఈ జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేసిన లేటెస్ట్ సినిమా 'కంగువ' (Kanguva Movie). నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. అందుకని, ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన 'బాహుబలి 3' గురించి మాట్లాడారు.

భారీ సినిమాలు, ఫ్రాంచైజీలుగా చేయాలంటే... ప్రతి రెండు సినిమాల మధ్య తగిన విరామం అవసరం అని జ్ఞానవేల్ రాజా చెబుతున్నారు. ''ఇప్పుడు 'బాహుబలి 3' ప్లానింగ్ స్టేజిలో ఉంది. లాస్ట్ వీక్ నేను ఆ ఫిలిం మేకర్స్ తో మాట్లాడినప్పుడు ఆ విషయం చెప్పారు. 'బాహుబలి 1', 'బాహుబలి 2' బ్యాక్ టు బ్యాక్ చేశారు. కానీ, మూడో పార్ట్ కోసం బ్రేక్ తీసుకున్నారు'' అని జ్ఞానవేల్ రాజా చెప్పారు. ఆయన మాటలు రెబల్ స్టార్ ఫాన్స్, 'బాహుబలి' ఫ్రాంచైజీ అభిమానులు అందరికీ చాలా బూస్ట్ ఇచ్చాయి.

ఇప్పుడు సీక్వెల్స్ కోసం టైమ్ తీసుకుంటున్నారు!
'బాహుబలి' తర్వాత తెలుగులో కొన్ని సీక్వెల్స్ వచ్చాయి. అయితే... ఇప్పుడు మన తెలుగు స్టార్ హీరోలు చేస్తున్న సినిమాలు అన్నీ ఫ్రాంచైజీ సినిమాలే. 'కల్కి 2898 ఏడీ', 'సలార్' సినిమాలకు సీక్వెల్స్ చేయడానికి ప్రభాస్ రెడీ. అయితే... 'సలార్' తర్వాత 'కల్కి 2898 ఏడీ' రిలీజ్ చేశారు. ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' తర్వాత కూడా 'ది రాజా సాబ్' చేస్తున్నారు. అది ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

Also Read: పుష్ప 2 @ 190 కోట్లు... ఏపీ, తెలంగాణలో ఏ ఏరియా రైట్స్ ఎన్ని కోట్లు అనేది తెలుసా?


ఇప్పుడు హీరోలు, దర్శక నిర్మాతలు అందరూ సీక్వెల్స్ చేయడానికి మధ్యలో మరో సినిమా చేస్తున్నారని జ్ఞానవేల్ రాజా చెబుతున్నారు. 'సింగం' ఫ్రాంచైజీలో ప్రతి రెండు సినిమాల మధ్య సూర్య రెండు మూడు సినిమాలు చేశారని ఆయన గుర్తు చేశారు. గ్యాప్ తీసుకున్నప్పుడు ఆడియన్స్ ఆ క్యారెక్టర్లు మళ్ళీ స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తారని జ్ఞానవేల్ రాజా అంటున్నారు. సూర్యతో ఆయన నిర్మించిన తాజా సినిమా 'కంగువ' సినిమాకు సీక్వెల్ ఉంటుందని టాక్. అలాగే, సూర్య తమ్ముడు కార్తీ 'ఖైదీ' సినిమాకూ సీక్వెల్ ప్లానింగులో ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: ఎవరీ బాబా సిద్ధిఖీ - మర్డర్ తర్వాత 'బిగ్ బాస్' క్యాన్సిల్ చేసి మరీ సల్మాన్ ఎందుకు వెళ్లారు? బాలీవుడ్ స్టార్స్ క్యూ కట్టారెందుకు?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Viral News: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం- బీటెక్ స్టూడెంట్, వివాహిత అఫైర్-  భార్య ఎదుటే ప్రియుడ్ని చితక్కొట్టారు!
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం- బీటెక్ స్టూడెంట్, వివాహిత అఫైర్- భార్య ఎదుటే ప్రియుడ్ని చితక్కొట్టారు!
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Embed widget