By: ABP Desam | Updated at : 04 Jul 2023 09:12 PM (IST)
కమల్ హాసన్, హెచ్. వినోద్
కోలీవుడ్ సీనియర్ హీరో, విశ్వ నటుడు కమల్ హాసన్ గత ఏడాది 'విక్రమ్' సినిమాతో భారీ సక్సెస్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకున్నారు. కోలీవుడ్ లో ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్ తో ఇప్పుడు వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు కమల్ హాసన్. ప్రస్తుతం 'ఇండియన్ 2' మూవీని కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ ఏడాదిలో ఆ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. దాని తర్వాత మణిరత్నంతో కమల్ ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. 'KH 234' గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్టుతో పాటు 'విక్రమ్ 2' కూడా చేయాల్సి ఉంది. కాకపోతే ఆ సినిమాకు కాస్త సమయం పడుతుంది.
ఈ గ్యాప్ లో ఇప్పుడు మరో సినిమాకి కమిట్ అయ్యారు కమల్ హాసన్. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్. వినోద్ దర్శకత్వంలో కమల్ హాసన్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ వీడియోను అఫీషియల్ గా రిలీజ్ చేశారు మేకర్స్. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై స్వయంగా కమల్ హాసన్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. 'KH 233' అనే వర్కింగ్ టైటిల్ తో తాజాగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ వీడియో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ఇక ఈ వీడియోలో బీజీయం అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అలాగే ఈ వీడియోలో సినిమా కాన్సెప్ట్ పై హింట్ ఇస్తూ కమల్ హాసన్ స్కెచ్ డిజైన్ చేశారు. ఇందులో కమలహాసన్ చేతిలో మండుతున్న కాగడ పట్టుకుని గర్జిస్తున్నట్లు కనిపించారు. అలాగే టైటిలో లో 'రైజ్ టూ రూల్'(Rise To Rule) అని ఉంది. అంటే ఈ సినిమాలో కమల్ హాసన్ ప్రజల తరుపున పోరాడే పాత్రలో కనిపించనున్నట్లు స్పష్టం అవుతోంది.
మొత్తం మీద అనౌన్స్మెంట్ వీడియో తోనే సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా 'ఇండియన్ 2' తర్వాత ఈ ప్రాజెక్టు లెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.. ఆ తర్వాతే మణిరత్నం ప్రాజెక్ట్ ఉంటుందట. ఇక డైరెక్టర్ హెచ్ వినోద్ విషయానికొస్తే.. కోలీవుడ్లో 'సతురంగ వేట్టెయ్' చిత్రంతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చి, మొదటి చిత్రంతోనే టాలెంటెడ్ డైరెక్టర్ గా నిరూపించుకున్నాడు. ఆ తర్వాత కార్తీతో 'ఖాకి' సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. దాని నిరంతరం వరుసగా అజిత్ తోనే సినిమాలు చేస్తున్నారు. ఈ దర్శకుడు ఇప్పటివరకు అజిత్ తో మూడు సినిమాలు చేయడం విశేషం. వినోద్ - అజిత్ కాంబోలో ఇప్పటివరకు 'నేర్కొండ పార్ వై', 'వలిమై', 'తెగింపు' వంటి సినిమాలు వచ్చాయి. ఇక గత ఏడాది సంక్రాంతికి విడుదలైన 'తెగింపు' సినిమా మంచి సక్సెస్ ని అందుకుంది. సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినా, కలెక్షన్స్ పరంగా ఆదరగొట్టేసింది. ఇక తెగింపు తర్వాత ఇప్పుడు కమల్ హాసన్ తోనే తన నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు వినోద్. మరి ఈ సినిమాతో కమల్ కి ఈ దర్శకుడు ఎలాంటి సక్సెస్ అందిస్తారో చూడాలి.
And it begins…#RKFI52 #KH233
— Kamal Haasan (@ikamalhaasan) July 4, 2023
#RISEtoRULE #HVinoth #Mahendran @RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/7cej87cghE
Also Read : స్టూడెంట్ వచ్చేస్తున్నాడు, బెల్లంకొండ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Salaar Release Date: ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే
Raveena Tandon: ఆయన పెదాలు తాకగానే- షాకింగ్ విషయాన్ని వెల్లడించిన రవీనా టాండన్!
Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?
Ritika Singh: ఆ ఘటన చూసి గుండె మండింది, ఇబ్బంది అనిపించినా అమ్మాయిలకు వాటిని నేర్పించాల్సిందే
Skanda Day 1 Collection: బాక్సాఫీస్ దగ్గర ‘స్కంద‘ ధూంధాం, రామ్ పోతినేని కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్!
బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు
Big Billion Days Sale 2023: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - టాప్-10 డీల్స్ ఇవే!
World Cup 2023: హైదరాబాద్‌లో పాక్xకివీస్ వార్మప్ మ్యాచ్! వర్షం కురిసే ఛాన్స్!
ముదురుతున్న కావేరి జల వివాదం, కర్ణాటక బంద్ - సరిహద్దుల్లో భారీ భద్రత
/body>