Nenu Student Sir OTT Release : స్టూడెంట్ వచ్చేస్తున్నాడు, బెల్లంకొండ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా నటించిన 'నేను స్టూడెంట్ సర్!' సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
యంగ్ హీరో బెల్లంకొండ సాయి గణేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా “నేను స్టూడెంట్ సర్!”. సీనియర్ దర్శకుడు తేజ శిష్యుడు రాకేశ్ ఉప్పలపాటి ఈ చిత్రంతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. గత నెలలో విడుదలైన ఈ మూవీ, ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. థియేట్రికల్ రిలీజ్ అయిన ఆరు వారాలకు, ఈ చిత్రం డిజిటల్ వేదిక మీదకు రాబోతోంది.
‘నేను స్టూడెంట్ సర్’ సినిమా జూన్ 2న థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. జూలై 14వ తేదీ నుంచి నుంచి ఈ చిత్రం ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో అందుబాటులో ఉంటుందని సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘స్టూడెంట్ వచ్చేస్తున్నాడు..! థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ కి సిద్ధమవ్వండి’ అని పేర్కొంటూ, సోషల్ మీడియా వేదికగా ఓ కొత్త పోస్టర్ ని పంచుకున్నారు.
‘నేను స్టూడెంట్ సర్’ సినిమాలో సుబ్బు అలియాస్ సుబ్బారావు అనే మిడిల్ క్లాస్ స్టూడెంట్ గా సాయి గణేశ్ నటించాడు. అవంతిక దస్సాని హీరోయిన్ గా నటించింది. సముద్ర ఖని విలన్ గా నటించగా.. సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, ప్రమోదిని తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
SV2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై 'నాంది' సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. దీనికి కృష్ణ చైతన్య కథ అందించగా, కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ రాశారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చగా, అనిత్ మదాడి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు.
నిజానికి ‘నేను స్టూడెంట్ సర్’ టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. దీనికి తగ్గట్టుగానే మంచి బిజినెస్ కూడా జరిగింది. కానీ రిలీజయ్యాక తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కాన్సెప్ట్ బాగానే ఉన్నప్పటికీ, కథనం ఎంగేజింగ్ గా లేకపోవడంతో ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. దీంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇప్పుడు ఆహా ఓటీటీలో విడుదలకి ముస్తాబయింది.
ఓటీటీలో ఆకట్టుకున్న 'స్వాతిముత్యం'
కాగా, నిర్మాత బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు, యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడైన సాయి గణేష్.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో 'స్వాతిముత్యం' అనే సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. గతేడాది దసరా సందర్భంగా రిలీజైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోలేకపోయినా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పోటీలో పెద్ద సినిమాలుండటంతో కమర్షియల్ గా సేఫ్ కాలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. బెల్లంకొండ బ్రదర్ తన ఇన్నోసెంట్ యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. మరి ఇప్పుడు 'నేను స్టూడెంట్ సర్!' చిత్రానికి డిజిటల్ లో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
Also Read: Tollywood: 2023 ఫస్టాప్‌లో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన భారీ బడ్జెట్ సినిమాలివే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial