By: ABP Desam | Updated at : 30 Mar 2023 03:44 PM (IST)
'డెవిల్'లో కళ్యాణ్ రామ్
కథానాయకుడిగా నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ప్రయాణం భిన్నమైనది. ఎప్పుడూ ప్రేక్షకులకు కొత్తదనం అందించడానికి, కొత్త తరహా కథలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'డెవిల్' (Devil Indian Movie). ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్... అనేది ఉపశీర్షిక. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. హీరో మీద భారీ ఫైట్ తీస్తున్నారు.
500 మందితో భారీ క్లైమాక్స్!
'డెవిల్' సినిమాను దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. ఇది పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. పతాక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
'డెవిల్' క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ భారీగా ఉంటాయని నిర్మాత అభిషేక్ నామా తెలిపారు. సుమారు 500 మంది ఫైటర్లు, ఇతర తారాగణం పాల్గొనగా... భారీ ఎత్తున షూటింగ్ చేస్తున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో వచ్చిన యాక్షన్ సీక్వెన్సుల్లో ఈ యాక్షన్ ఎపిసోడ్ ఒకటిగా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. స్టంట్ మాస్టర్ వెంకట్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీన్ తెరకెక్కిస్తున్నారు.
చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ ''మా సంస్థలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా 'డెవిల్' సినిమాను భారీ నిర్మాణ వ్యయంతో రూపొందిస్తున్నాం. కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందించాలనే తపన ఉన్న మా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ మరో వైవిధ్యమైన గెటప్, నటనతో ఆకట్టుకోబోతున్నారు. సినిమా చిత్రీకరణ ప్లానింగ్ ప్రకారం జరుగుతోంది. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న క్లైమాక్స్ ఎపిసోడ్ వావ్ అనేలా ఉంటుంది. త్వరలో ఇతర వివరాలు, విడుదల తేదీ గురించి వెల్లడిస్తాం'' అని చెప్పారు.
Also Read : దసరా రివ్యూ - నాని పాన్ ఇండియా సినిమా ఎలా ఉంది?
కళ్యాణ్ రామ్ అండ్ పీరియాడిక్ డ్రామా అంటే ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది 'బింబిసార' సినిమా. దానిని పీరియాడిక్ డ్రామా అనలేం. అదొక సోషియో ఫాంటసీ సినిమా. ఫర్ ద ఫస్ట్ టైమ్... మహారాజు రోల్ చేశారు కళ్యాణ్ రామ్ . ఆ క్యారెక్టర్ కోసం కాలంలో కొంచెం వెనక్కి వెళ్ళారు. ఇప్పుడు 'డెవిల్'లో రోల్ కోసం కూడా కాలంలో వెనక్కి వెళ్ళారు. ఆల్రెడీ విడుదల అయిన ఆయన లుక్ చూస్తే డిఫరెంట్ గా ఉందని చెప్పాలి. రెగ్యులర్ గా చూసే కళ్యాణ్ రామ్ కి, 'డెవిల్'లో కళ్యాణ్ రామ్ కి డిఫరెన్స్ ఉంది. సినిమా కూడా అంతే వైవిధ్యంగా ఉంటుందని టాక్.
శ్రీకాంత్ విస్సా అందించిన కథతో...
'డెవిల్' సినిమాకు శ్రీకాంత్ విస్సా కథ అందించారు. ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మాస్ మహారాజ రవితేజ 'రావణాసుర' సినిమాకు సైతం ఆయనే కథ అందించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన 'పుష్ప' సినిమాకు కూడా ఆయన పని చేశారు. 'డెవిల్' సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్, కూర్పు : తమ్మిరాజు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు : శ్రీకాంత్ విస్సా, ఛాయాగ్రహణం : సౌందర్ రాజన్ .ఎస్, సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్.
Also Read : బోయపాటి సినిమాలో భారీ బుల్ ఫైట్ - ఇరగదీసిన రామ్
Silk Smitha: సిల్క్ స్మిత కొరికిన యాపిల్ - వేలంపాటలో ఎంత ధర పలికిందో తెలుసా?
Gandharvudu Jr: జూనియర్ ‘గంధర్వుడు’గా వస్తోన్న జనతా గ్యారేజ్ నటుడు!
Anil Kapoor: ఏఐ టెక్నాలజీపై కోర్టుకెక్కిన అనిల్ కపూర్ - పర్సనాలిటీ రైట్స్ కోసం పోరాటం, అసలు వాటి అర్థమేంటి?
Chiranjeevi: మెగాస్టార్ నట ప్రస్థానానికి 45 ఏళ్ళు - రామ్ చరణ్ భావోద్వేగం
2024 ఆస్కార్ బరిలో 'దసరా', 'బలగం' - ఏకంగా 22 సినిమాలతో పోటీ?
Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!
IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!
Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత
/body>