News
News
వీడియోలు ఆటలు
X

Dasara Review: దసరా రివ్యూ: నాని పాన్ ఇండియా సినిమా ఎలా ఉంది?

నాని మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఎలా ఉంది?

FOLLOW US: 
Share:

సినిమా రివ్యూ : దసరా
రేటింగ్ : 3/5
నటీనటులు : నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు
రచన : జేళ్ల శ్రీనాథ్, శ్రీకాంత్ ఓదెల, అర్జున పట్లూరి, వంశీ కృష్ణ.పి
ఛాయాగ్రహణం : సత్యన్ సూరన్
సంగీతం : సంతోష్ నారాయణన్
నిర్మాత‌ : సుధాకర్ చెరుకూరి
ద‌ర్శ‌క‌త్వం : శ్రీకాంత్ ఓదెల
విడుదల తేదీ : మార్చి 30, 2023

నేచురల్ స్టార్ నాని మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ‘దసరా’. సింగరేణి గనుల నేపథ్యంలో సాగే ఈ కథ కోసం మునుపెన్నడూ లేని విధంగా నాని కష్టపడ్డారు. గత నెల రోజులుగా మరే పనీ పెట్టుకోకుండా ఈ సినిమాని విపరీతంగా ప్రమోట్ చేశారు. కాలికి బలపం కట్టుకుని దేశం అంతా తిరిగాడు. దీంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. నాని మొదటి సారి పూర్తిగా రగ్గ్‌డ్ లుక్‌లో కనిపించారు. టీజర్, ట్రైలర్‌లు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ‘చమ్కీల అంగీలేసి’ సాంగ్ బాగా వైరల్ అయింది. ఇవన్నీ కలిసి సినిమాపై అంచనాలు పెంచాయి. మరి ఇంతకీ సినిమా ఎలా ఉంది? ఆ అంచనాలను అందుకుందా?

కథ: తెలంగాణలో సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో ఉన్న వీర్లపల్లి అనే గ్రామంలో జరిగే కథ ఇది. ధరణి (నాని), సూరి (దీక్షిత్ శెట్టి) వాళ్ల స్నేహితులతో కలిసి బొగ్గు రైళ్లు కొల్లగొడుతూ ఉంటారు. ధరణి, సూరిల చిన్నప్పటి స్నేహితురాలు వెన్నెల (కీర్తి సురేష్) వీర్లపల్లి లోనే అంగన్ వాడి టీచర్ గా పని చేస్తూ ఉంటుంది. వెన్నెలని ధరణి ప్రేమిస్తాడు. కానీ సూరి కూడా ప్రేమించడంతో ధరణి త్యాగం చేస్తాడు. ఊర్లో ఉన్న సిల్క్ బార్ కారణంగా వీరి జీవితాలు అనుకోని మలుపులు తిరుగుతాయి. చివరికి వీర్లపల్లిలో ఏం జరిగింది? ఈ కథలో రాజన్న (సాయి కుమార్), చిన్న నంబి (షైన్ టామ్ చాకో), శివన్న (సముద్ర ఖని) పాత్రలు ఏంటి? అనేవి తెలియాలంటే దసరా చూడాల్సిందే.

విశ్లేషణ: ‘దసరా ద్వారా ఇండియన్ సినిమాకి నా కంట్రిబ్యూషన్ శ్రీకాంత్ ఓదెల.’ సినిమాకు సంబంధించిన ఒక ఈవెంట్లో నాని అన్న మాట ఇది. ‘అసలు నన్ను చూసి ఇంత పెద్ద సినిమా ఎలా ఒప్పుకున్నాడు. ఈయనకేమన్నా మెంటలా అనుకున్నా నేను.’ ఒక ఇంటర్వ్యూలో నాని గురించి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అన్న మాట ఇది. శ్రీకాంత్‌ను నాని ఎందుకు అంత నమ్మాడో సినిమా చూస్తే అర్థం అవుతుంది. సినిమాలో కీలకమైన కొన్ని పోర్షన్లు చూస్తే ఎన్నో సినిమాల అనుభవం ఉన్న దర్శకుడు తీసినట్లు అనిపిస్తుంది.

మొదటి సన్నివేశం నుంచే శ్రీకాంత్ నేరుగా కథలోకి వెళ్లిపోయాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్ ఉన్న కథలు మనకు కొత్తేమీ కాదు. ‘రంగస్థలం’, ‘పుష్ప’, ‘పలాస’, ‘ఉప్పెన’ వంటి సినిమాలు విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోనే వచ్చాయి. కానీ తెలంగాణ నేపథ్యం, సింగరేణి గనుల మధ్యలో ఉన్న గ్రామం కావడంతో కొంచెం ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. అచ్చమైన తెలంగాణ యాసను ‘దసరా’లో వినవచ్చు.

సినిమా ప్రథమార్థం చాలా గ్రిప్పింగ్‌గా సాగుతుంది. ధరణి, సూరి పాత్రల మధ్య ఉండే కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. నాని, దీక్షిత్‌ల ఎంట్రీ సీన్ అద్భుతంగా తెరకెక్కించారు. ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ పాట పిక్చరైజేషన్ హైలెట్. సూరి, వెన్నెలల లవ్ స్టోరీని శ్రీకాంత్ క్యూట్‌గా హ్యాండిల్ చేశాడు. సర్పంచ్ ఎలక్షన్స్, సిల్క్ బార్ వైపు కథ తిరిగిన దగ్గరి నుంచి ఇంటెన్సిటీ ఎక్కువ అవుతుంది. ప్రథమార్థంలో క్రికెట్ మ్యాచ్ సీన్‌, ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ ప్రధాన హైలెట్స్. సెకండాఫ్‌కు టోన్‌ను పర్‌ఫెక్ట్‌గా సెట్ చేసింది. అయితే కథా నేపథ్యం ‘రంగస్థలం’ను గుర్తు చేస్తుంది.

ద్వితీయార్థంలో స్టోరీ గ్రాఫ్ కొంచెం డౌన్ అవుతుంది. అక్కడక్కడా రంగస్థలం ఛాయలు కనిపిస్తాయి. ధరణి పాత్ర తన బలహీనతను అధిగమించే సన్నివేశాల్లో అంత ఇంపాక్ట్ కనిపించదు. సెకండాఫ్‌లో వచ్చే ఒక కీలకమైన సన్నివేశంలో వెన్నెల పాత్ర ప్రవర్తించిన తీరును తీసుకోవడం కష్టం అవుతుంది. తర్వాత దానికి ఎక్స్‌ప్లెనేషన్ ఇచ్చినా ఆ వెలితి అలానే ఉంటుంది. ‘చమ్కీల అంగీలేసి’ సాంగ్ పిక్చరైజేషన్ కూడా అనుకున్న స్థాయిలో లేదు. చివరి అరగంట మాత్రం మొత్తం సినిమాను నిలబెడుతుంది. ‘దసరా’ పండుగ నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీన్లు అద్భుతంగా తీర్చిదిద్దారు. సినిమాలో గూస్‌బంప్స్ తెప్పించే అడ్రినలిన్ రష్ మూమెంట్స్ ఇందులో ఉన్నాయి. 

టెక్నికల్‌గా కూడా ఈ సినిమాకు అన్నీ కలిసొచ్చాయి. సత్యన్ సూరన్ తన సినిమాటోగ్రఫీతో టోన్‌ను కరెక్ట్‌గా మ్యాచ్ చేసి అద్భుతమైన విజువల్స్‌ను తెరపై చూపించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు మరో స్థాయికి తీసుకువెళ్లింది. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమ్యాక్స్ యాక్షన్ ఎపిసోడ్లకు సంతోష్ నారాయణన్ ప్రాణం పెట్టినట్లు అనిపిస్తుంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఖర్చుకు వెనకాడకుండా సినిమాను తెరకెక్కించారు.

ఇక నటీనటుల విషయానికి వస్తే... నానికి ధరణి పూర్తిగా కొత్త పాత్ర. ఎంత బాధనైనా మోయగల ఓర్పు భూమాత సొంతం అంటారు. ప్రేమ దూరం అయిన, స్నేహితుడు మరణించిన బాధలో ఉన్న పాత్రను ధరణి పాత్ర సినిమా అంతా మోస్తూనే కనిపిస్తుంది. ఎమోషనల్‌గా ఎంతో వెయిట్ ఉన్న పాత్రలో నాని కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కీర్తి సురేష్ పోషించిన వెన్నెల పాత్ర కూడా తను ఇంతకు ముందు చేయనిది. ఫస్టాఫ్ అంతా ఎనర్జిటిగ్‌గా, సెకండాఫ్ అంతా ఎమోషనల్‌గా కీర్తి మంచి నటన కనబరిచింది. సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సీన్‌లో నానిని డామినేట్ చేసే స్థాయిలో నటించింది. సూరి పాత్ర చేసిన దీక్షిత్ శెట్టికి ఇది టెర్రిఫిక్ డెబ్యూ అవుతుంది. ఇంతకుముందు మీట్ క్యూట్‌లో చేసినప్పటికీ అది ఓటీటీ ప్రాజెక్టు. స్క్రీన్‌పై కనిపించినంత సేపు దాదాపు హీరోకు సమానమైన పాత్ర ఇది. మలయాళ నటుడు షైన్ టామ్ చాకోకు కూడా ఇది తెలుగులో మొదటి సినిమా. తన నటనలో అంత కొత్తదనం కనిపించదు. మిగతా వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే... థియేటర్లలో మంచి మాస్ సినిమా ఎంజాయ్ చేయాలంటే ‘దసరా’ సూపర్బ్ ఆప్షన్. నాని ఎప్పటి నుంచో కోరుకుంటున్న మాస్ ఇమేజ్ కూడా ఈ సినిమాతో దక్కే అవకాశం ఉంది. సెకండాఫ్‌లో అక్కడక్కడా స్లో అయినా ‘దసరా’ చూడదగ్గ సినిమానే.

Published at : 30 Mar 2023 10:58 AM (IST) Tags: Keerthy Suresh Dasara Srikanth odela ABPDesamReview Nani Dasara Movie Review Dasara Review Dasara Review in Telugu

సంబంధిత కథనాలు

Naga Chaitanya's Next Movie : గీతా ఆర్ట్స్ లో అక్కినేని హీరో నెక్స్ట్ మూవీ - డైరెక్టర్ ఎవరంటే?

Naga Chaitanya's Next Movie : గీతా ఆర్ట్స్ లో అక్కినేని హీరో నెక్స్ట్ మూవీ - డైరెక్టర్ ఎవరంటే?

Full Bottle Teaser : బాలయ్య బాబు ఫ్యాన్ ఇక్కడ, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తా - 'ఫుల్ బాటిల్'లో సత్యదేవ్ చింపేశాడుగా 

Full Bottle Teaser : బాలయ్య బాబు ఫ్యాన్ ఇక్కడ, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తా - 'ఫుల్ బాటిల్'లో సత్యదేవ్ చింపేశాడుగా 

ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు

ఆఖరి రోజు ఏడిపించేసిన ఎన్టీఆర్ - ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రయూనిట్ భావోద్వేగపు వీడ్కోలు

ఎన్టీఆర్‌తో ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్లు - వీరి కాంబినేషన్‌ అస్సలు బోరుకొట్టదు!

ఎన్టీఆర్‌తో ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్లు - వీరి కాంబినేషన్‌ అస్సలు బోరుకొట్టదు!

Miss Shetty Mr Polishetty - Dhanush : హతవిధీ - నవీన్ పోలిశెట్టికి ఛాన్స్ ఇవ్వని ధనుష్! 

Miss Shetty Mr Polishetty - Dhanush : హతవిధీ - నవీన్ పోలిశెట్టికి ఛాన్స్ ఇవ్వని ధనుష్! 

టాప్ స్టోరీస్

Telangana Politics : అయితే కొత్త పార్టీ లేకపోతే కాంగ్రెస్ - పొంగులేటి, జూపల్లి డిసైడయ్యారా ?

Telangana Politics :  అయితే కొత్త పార్టీ లేకపోతే కాంగ్రెస్ - పొంగులేటి, జూపల్లి డిసైడయ్యారా ?

New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

New Parliament Inauguration: కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఏమిటి, దానిని ఏ సమయంలో ప్రారంభిస్తారు, ఎవరికి ఆహ్వానం పంపారు? అన్నీ తెలుసుకోండి

New Parliament Inauguration: కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఏమిటి, దానిని ఏ సమయంలో ప్రారంభిస్తారు, ఎవరికి ఆహ్వానం పంపారు? అన్నీ తెలుసుకోండి

New Parliament Building Inauguration: కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి ఎవరు హాజరవుతున్నారు, ఎన్ని పార్టీలు నిరసన తెలుపుతున్నాయి

New Parliament Building Inauguration: కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి ఎవరు హాజరవుతున్నారు, ఎన్ని పార్టీలు నిరసన తెలుపుతున్నాయి