Kalki 2898 AD: హిందీలోనే కాదు, ఆ రాష్ట్రంలో కూడా ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్ల సునామీ - ఇది ఊహించి ఉండరు
నాగ్ అశ్విన్ అద్భుత సృష్టి ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల జోరు కొనసాగిస్తోంది. వారం రోజుల్లో ఈ సినిమా రూ. 700 కోట్లకు పైగా వసూళు చేసింది. తమిళనాడులోనూ ఈ మూవీ జోరుగా వసూళ్లు సాధిస్తోంది.
‘Kalki 2898 AD’s Collections In Tamil Nadu: ప్రభాస్, దీపికా పదుకొణె హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 ఏడీ 2898 AD’. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తోంది. భారత్ తో పాటు ఓవర్సీస్ లోనూ అద్భుతంగా వసూళ్లను సాధిస్తోంది. సినిమా విడుదలైన వారం రోజుల్లోనే రూ. 700 కోట్లు క్రాస్ చేసింది. 8వ రోజు కూడా మంచి వసూళ్లను అందుకుంది. భారత్ లో రూ. 22.5 కోట్లు సాధించింది. తెలుగులో రూ. 10 కోట్లు, హిందీలో రూ. 10 కోట్లు, మిగతా రాష్ట్రాల్లో 2.5 కోట్లు వసూలు అయ్యాయి.
తమిళనాడులో కలెక్షన్ల సునామీ
తెలుగు సినిమాలు పెద్దగా రాణించని తమిళనాడులోనూ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా వసూళ్ల దూకుడు కొనసాగిస్తోంది. ఈ సినిమా విడుదలైన తొలి వారంలో అన్ని థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసిపోయాయి. వారం రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర మంచి జోష్ కనిపించింది. ఫస్ట్ వీక్ లో తమిళ నాట ‘కల్కి 2898 ఏడీ’ సినిమా రూ.28 కోట్ల గ్రాస్ క్రాస్ చేసింది. గతంలో వారం రోజుల్లో ఈ స్థాయి వసూళ్లు సాధించిన తెలుగు బేస్డ్ సినిమాలు లేవని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అటు ఓవర్సీస్ లోనూ కల్కి 2898 ఏడీ సినిమా కలెక్షన్లలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. నార్త్ అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో వసూళ్లు సాధిస్తోంది.
కీలక పాత్రలు పోషించిన దిగ్గజ నటీనటులు
‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో పలు సినీ పరిశ్రమలకు చెందిన అగ్రతారలు కీలక పాత్రలు పోషించారు. ప్రభాస్ బౌంటీ హంటర్ భైరవగా ఆకట్టుకున్నారు. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా కనిపించారు. కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్రలో నటించారు. దీపికా పదుకొణె సుమతిగా, దిశా పటానీ రాక్సీగా కనిపించారు. బ్రహ్మానందం రాజన్ గా, భైరవ భూస్వామిగా కనిపించారు. అన్నా బెన్ కైరా పాత్రను పోషించగా, శోభన మరియమ్ గా కనిపించింది. కీర్తి సురేష్ భైరవ కారు బుజ్జికి వాయిస్ ఇచ్చి ప్రేక్షకులను అలరించింది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ
‘కల్కి 2898 ఏడీ 2898 AD’ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీ దత్ నిర్మించారు. సుమారు రూ. 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. అద్భుత సినిమాటోగ్రఫీతో స్టోజిల్ జొకోవిచ్ మెస్మరైజ్ చేశారు. సంతోష్ నారాయణన్ అద్భుత సంగీతం అందించారు. మహా భారతాన్ని బేస్ చేసుకుని నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సినిమా సామాన్య ప్రేక్షకుల నుంచి సినీ సెలబ్రిటీల వరకు అందరినీ ఓ రేంజిలో అలరించింది. సినిమాలోని నటీనటుల యాక్టింగ్‌కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాపై పలువురు హాలీవుడ్ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు.
Read Also : ఆర్జీవీ, రాజమౌళి నటిస్తారని నాకూ తెలియదు, ‘కల్కి 2898 ఏడీ’ రెండో భాగం ఎలా ఉంటుందో హింట్ ఇచ్చిన అశ్వినీ దత్
Read Also : థీమ్ ఆఫ్ కల్కి 2898 ఏడీ పాటలోని పరమార్థమిదే, అవతారాల తత్వం అంతా ఇందులోనే