అన్వేషించండి

Theme of Kalki: థీమ్‌ ఆఫ్ కల్కి పాటలోని పరమార్థమిదే, అవతారాల తత్వం అంతా ఇందులోనే

Kalki 2898 AD: ప్రభాస్ నటించిన కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాలోని థీమ్‌ సాంగ్‌లో లిరిక్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Kalki Songs: పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ 
                     ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే 

భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఈ విశ్వానికి ఇచ్చిన భరోసా ఇది. సత్పురుషులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి ఒక్కో యుగంలో ఒక్కోలా అవతరిస్తానని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అలా కలియుగంలో విష్ణు మూర్తి కల్కిగా అవతరిస్తాడని కల్కి పురాణం చెబుతోంది. కల్కి సినిమా విడుదలైనప్పటి నుంచి రకరకాల చర్చలు, వాదనలు వినిపిస్తున్నాయి. వీటిపై ఎవరి అభిప్రాయాలు వాళ్లకున్నా..సినిమాలోని థీమ్ సాంగ్ (Kalki Theme Song) మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించిన ఈ పాటకి ఆస్కార్ విన్నింగ్ లిరిక్ రైటర్ చంద్రబోస్ సాహిత్యం అందించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కడ చూసినా ఈ పాటే వినబడుతోంది. వాళ్లకు తోచినట్టుగా ఎడిట్‌లు చేసుకుని మరీ పోస్ట్‌లు పెడుతున్నారు. థీమ్ సాంగ్‌లో ఉండే గ్రాండ్‌నెస్‌ అందులో ఉండడం, దానికి తగ్గట్టుగా AI ఇమేజ్‌లు తోడవడం వల్ల లిరిక్ వీడియోకి (Theme of Kalki Song Lyrical Video) కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

దశావతారాల గురించి పాట రాయడం అంటే అంత సులభం కాదు. గతంలో కృష్ణం వందే జగద్గురుమ్ సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి "జరుగుతున్నది జగన్నాటకం" అనే పాట రాశారు. ఆ తరవాత ఎవరు ఈ కాన్సెప్ట్ తీసుకున్నా సహజంగానే పోలిక పెట్టేస్తారు. అయితే సినిమా సినిమాకి సందర్బం మారుతుంది. సినిమాలో ఆ పాటకు ఎంత నిడివి ఉంటుందనేదీ పాట లెంథ్‌ని డిసైడ్ చేసేస్తుంది. ఇక్కడ కల్కి సినిమా విషయానికొస్తే కల్కి అవతారం గురించి ఓ మూడు నిముషాల్లో చెప్పాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ పరిధి పెట్టుకున్నారు. ఆ పరిధిలోనే రచయిత చంద్రబోస్ మంచి సాహిత్యం (Kalki Theme Song Lyrics) అందించారు. 

అధర్మాన్ని అణిచెయ్యగా 
యుగ యుగాన జగములోన పరిపరి విధాల్లోన 
విభవించే విక్రమ విరాట్ రూపమితడే 

సంభవామి యుగే యుగే అనే ఒక్క మాటని కాస్త విడమరిచి చెప్పిన వాక్యాలివి. పల్లవిలోని మొదటి లైన్స్ కూడా ఇవే. ఎప్పుడైతే అధర్మం పెరుగుతుందో దాన్ని అణిచివేసేందుకు ప్రతి యుగంలో దేవుడు ఓ అవతారంలో వచ్చాడు. అదే విషయాన్ని మొదట పరిచయం చేశారు చంద్రబోస్. విభవించే విక్రమ విరాట్ రూపమితడే అని రాశారు (Theme Of Kalki) చంద్రబోస్. విభవం అంటే ఉన్నతం అనే అర్థం ఉంది. అంటే దేవుడు ఉన్నతమైన రూపాన్ని ధరించి అవతారమెత్తుతాడని చెప్పారు. ఆ తరవాత వచ్చే వాక్యాల్లో కల్కి అవతరాన్ని పరిచయం చేశారు. 

స్వధర్మాన్ని పరిరక్షించగ
సమస్తాన్ని ప్రక్షాళించగ
సముద్భవించే అవతారమిదే

ఈ వాక్యాల్లోని స్వధర్మం అనే పదాన్ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా అర్థం చేసుకుంటున్నారు. సాధారణంగా స్వధర్మం అంటే స్వభావం అనే అర్థం కూడా ఉంది. కలి యుగంలో మనిషి స్వభావం పూర్తిగా మారిపోతుంది. ధర్మమన్న మాటే వినబడదు. స్వార్థం పెరిగిపోతుంది. అంటే మనిషి తన సహజ స్వభావానికి దూరమవుతాడు. అందుకే మనిషి స్వధర్మాన్ని అంటే స్వభావాన్ని పరిరక్షించడానికి దేవుడు వస్తాడు అనే అర్థంలో రాసుంటారు. సమస్తాన్ని ప్రక్షాళించగ..పాపంతో నిండిపోయిన కలియుగాన్ని ప్రక్షాళించడానికి కల్గిగా ఉద్భవిస్తాడని రాశారు. ఆ తరవాతి లైన్స్‌లో దశావతారాల ప్రస్తావన తీసుకొచ్చారు చంద్రబోస్.  

మీనమై పిదప కూర్మమై
తను వరాహమై మనకు సాయమై
బాణమై కరకు ఖడ్గమై
చురుకు ఘూతమై మనకు ఊతమై
నిశి తొలిచాడు దీపమై

ఈ వాక్యాల్లో దశావతారాల వరుసను చెప్పారు. మొట్టమొదటి అవతారం మీనం..ఆ తరవాత కూర్మం. బాణమై అంటే రామావతారం, కరుకు ఖడ్గం అంటే పరశురాముడి గొడ్డలి. చురుకు ఘాతం అంటే రాముడి విల్లు దెబ్బ అని అర్థం. చివర్లో మనకు ఊతమై అని కృష్టుడి అవతారం గురించి వివరించారు చంద్రబోస్. కురుక్షేత్రంలో అర్జునుడు యుద్ధం చేయకుండా సంశయిస్తే ఆయనే ఊతంగా నిలబడతాడు. ఇప్పుడు మనం ఇంగ్లీష్‌లో చెప్పుకుంటున్న పర్సనాలిటీ డెవలప్‌మెంట్ స్కిల్స్ అన్నీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అందుకే మనకు ఊతమై అని చంద్రబోస్ రాశారు. లిరిక్ వీడియోని గమనిస్తే సరిగ్గా ఇదే లైన్‌ దగ్గర నెమలి పింఛం కనిపిస్తుంది. అది కృష్ణుడి అవతారానికి సంకేతంగా చూపించారు. మనలో అలుముకున్న అజ్ఞానమనే చీకటిని దేవుడు తొలగించాడని అనే అర్థంలో నిశి తొలిచాడు దీపమై అని రాశారు. 

నిధనం తన ధ్యేయమై
వాయువే వేగమై
కలియుగ స్థితిలయలే కలబోసే కల్కి ఇతడే

నిధనం అంటే అంతం, సంహారం అనే అర్థాలున్నాయి. ఈ లైన్స్‌లో చంద్రబోస్ కల్కి అవతారం గురించి చెప్పారు. నిధనం తన ధ్యేయమై...కలి యుగంలో పెరుగుతున్న చెడుని అంతం చేయడమే ధ్యేయంగా వాయు వేగంతో కల్కి అవతరిస్తాడనే సెన్స్‌లో రాశారు. కలియుగ స్థితిలయలే కలబోసే కల్కి అనే వాక్యంతో స్థితిలయల్ని సరిచేసే దేవుడు అని చెప్పకనే చెప్పారు. 

ప్రార్థనో మధుర కీర్తనో
హృదయ వేదనో మన నివేదనం
అందితే.. మనవి తక్షణం
మనకు సంభవం అతడి వైభవం

దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే మనస్పూర్తిగా ప్రార్థించాలి. లేదంటే కీర్తించాలి. లేదా మన బాధంతా ఆయనకు చెప్పుకోవాలి. ఇదే విషయాన్ని ఈ పాటలో వివరించారు. ప్రార్థన ద్వారానో, కీర్తన ద్వారానో, హృదయ వేదన రూపంలోనో మన బాధనంతా దేవుడికి నివేదిస్తే కచ్చితంగా స్పందిస్తాడు. మన నివేదన ఆయనకు అందితే..తక్షణమే ఆయన మరో అవతారంగా వచ్చి కాపాడతాడు. ఆ తత్త్వం అంతా ఈ వాక్యాల్లో కనిపిస్తుంది. మనకు సంభవం అతడి వైభవం అనే వాక్యం చెప్పేది ఇదే. ఉన్నది చాలా తక్కువ నిడివి. పైగా సినిమాలో అక్కడక్కడా వినిపించే పాట. ఉన్నంతలో అవతారాల గురించి, ఆ అవతారాల పరమార్థం గురించీ చెప్పాలి. ఈ విషయంలో చంద్రబోస్ సక్సెస్ అయ్యారు కాబట్టే పాట అంత పెద్ద హిట్ అయింది. 

Also Read: Kalki 2898 AD 7 Days Collections: బాక్సాఫీసు వద్ద 'కల్కి 2898 AD' ప్రభంజనం - ఏడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..

 

 


 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Embed widget