Ashwini Dutt: ఆర్జీవీ, రాజమౌళి నటిస్తారని నాకూ తెలియదు, ‘కల్కి’ రెండో భాగం ఎలా ఉంటుందో హింట్ ఇచ్చిన అశ్వినీ దత్
‘కల్కి’ సినిమాలో రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ నటించడంపై నిర్మాత అశ్వినీ దత్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో వాళ్లు నటిస్తారనే విషయం షూటింగ్ రోజు వరకు తనకూ తెలియదన్నారు.
Producer Ashwini Dutt about Guest Roles In Kalki 2898 AD: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కల్కి 2898 AD’. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఇప్పటి వరకు ఏకంగా రూ. 700 కోట్లకు పైగా వసూళ్లతో సత్తా చాటుతోంది. ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన మెస్మరైజ్ చేసింది ఈ మూవీ. ఈ సినిమాలో పలువురు అగ్రతారలకు కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, విశ్వ నటుడు కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ గా నటించారు. సుమతిగా దీపికా పదుకొణె కీలకపాత్ర పోషించింది. రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, దిశా పటానీ, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, ఫరియా అబ్దుల్లా అతిథి పాత్రల్లో మెరిశారు.
‘కల్కి’ వాళ్లు నటిస్తారని నాకు తెలియదు- అశ్వినీ దత్
‘కల్కి‘ సినిమాలో రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, విజయ్ దేవరకొండ లాంటి వాళ్లు నటించడం ప్రేక్షకులకు కనువిందు చేసింది. అయితే, రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి ‘కల్కి‘ సినిమాలో నటిస్తారనే విషయం తనకు తెలియదని నిర్మాత అశ్వినీదత్ తెలిపారు. సినిమా షూటింగ్ జరిగే రోజే తనకు తెలుసని చెప్పారు. షూటింగ్ రోజు పొద్దున్నే దర్శకుడు తనకు చెప్పారన్నారు. “ ‘కల్కి’ సినిమాలో రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ యాక్ట్ చేస్తారని నాకు తెలియదు. షూటింగ్ రోజు పొద్దున్నే నాగి నాకు చెప్పారు. రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి షూటింగ్‌కు వస్తారన్నాడు. నేను వండర్ అయ్యాను. సెకెండ్ పార్ట్‌లో కృష్ణుడు ఎలా ఉంటాడు అనేది దర్శకుడి ఆలోచనను బట్టి ఉంటుంది. మొదటి భాగాన్ని మించి రెండో భాగం ఉండాలి. అలా ఉండాలంటే అద్భుతం చేయాలి” అన్నారు.
‘కల్కి’పై ప్రశంసలు కురిపించిన సెలబ్రిటీలు
అటు ఈ సినిమాపై సామాన్యుల నుంచి సినీ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు. హాలీవుడ్ సినిమాకు తీసిపోని విధంగా ఉందన్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ సహా పలువురు సినీ సెలబ్రిటీలు ఈ సినిమా అద్భుతం అంటూ అభినందించారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి చిత్రాన్ని ఎప్పుడూ చూడలేదంటూ ప్రశంసించారు. టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ మూవీ 'కల్కి 2898 AD'నివైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఏకంగా రూ.600 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నిర్మాత అంచనాలను ఏమాత్రం వమ్ము చేయకుండా నాగ్ అశ్విన్ వెండితెర మీద మూడు లోకాలను సృష్టించి అందరినీ అబ్బుర పరిచారు. ఇండియన్ సినిమా ఇలా కూడా ఉంటుందా? అనేలా ఆశ్చర్యపరిచారు. అ అద్భుత చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు.
Read Also: థీమ్ ఆఫ్ కల్కి పాటలోని పరమార్థమిదే, అవతారాల తత్వం అంతా ఇందులోనే
Read Also: ‘జనక అయితే గనక’ టీజర్ - పిల్లల స్కూల్ ఫీజులపై సుహాస్ సెటైర్ - స్మశానానికి, ఎల్‌కేజీకి లింకేంటీ?