అన్వేషించండి

Upcoming Movies: ఈ వారం థియేటర్‌లో ఒకే ఒక్క సినిమా - ఓటీటీలోకి బోల్డ్ సినిమాలు, ఆసక్తికరమైన వెబ్ సిరీసులు!

Upcoming Theater/OTT Movies: ఎప్పటిలాగే సినీ అభిమానులను అలరించడానికి ఈ వారం కూడా థియేటర్, ఓటీటీలలో కొత్త సినిమాలు, ఆసక్తికరమైన వెబ్ సిరీసులు రాబోతున్నాయి.

Upcoming Theatre/OTT Movies: గత వారం సినీ ప్రియులను అలరించడానికి రీరిలీజులతో కలుపుకొని దాదాపు డజను చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. వాటిల్లో 'నింద' సినిమా ఒక్కటే ఉన్నంతలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగా.. మిగతావన్నీ అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. అయితే ఈ వారం మాత్రం ఒకే ఒక్క సినిమా బిగ్ స్క్రీన్ లను తాకడానికి రెడీ అయింది. 'కల్కి 2898 AD' చిత్రం ఒక్కటే పాన్ ఇండియా వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అందుకే ఎవరూ దీనికి పోటీగా మరో చిత్రాన్ని విడుదల చేసే సాహసం చెయ్యలేదు.

'కల్కి 2898 AD': 
రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ ఫాంటసీ యాక్షన్‌ మూవీ 'కల్కి 2898 ఏడీ'. ఇందులో బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌, విశ్వనటుడు కమల్‌ హాసన్‌, బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, దిశాపటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌, స్టార్ కాస్టింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా జూన్‌ 27వ తేదీ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకంటే ఒక్క రోజు ముందుగా బుధవారమే యూఎస్ లో ప్రీమియర్స్ పడబోతున్నాయి.

'కల్కి 2898 AD' చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 3డీ & ఇమ్యాక్స్ ఫార్మాట్ లలో రిలీజ్ చేయబోతున్నారు. తెలంగాణలో అదనపు షోలతో పాటుగా రేట్లు పెంచుకోడానికి ప్రభుత్వం అనుమతి లభించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మల్టీఫ్లెక్స్ లలో రోజుకి 30 నుంచి 42 షోలు ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో, ఆన్ లైన్ టికెట్స్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ పోటెత్తుతున్నారు. చాలా నెలల తర్వాత వస్తోన్న పెద్ద హీరో సినిమా కావడంతో ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

హిందూ పురాణాలు స్ఫూర్తితో భవిష్యత్ ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించి తీసిన ఫాంటసీ మూవీ 'కల్కి 2898 ఏడీ'. కాశీ, కాంప్లెక్స్‌, శంబల అనే మూడు ప్రపంచాల మధ్య జరిగే కథ ఇది. దీంట్లో భైరవగా ప్రభాస్, అశ్వద్ధామగా అమితాబ్, సుప్రీం యాస్కిన్ గా కమల్ హసన్, రాక్సీగా దిశా పటాని, కైరాగా అన్నా బెన్, ఉత్తరగా మాళవిక అయ్యర్ కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ ను సరికొత్త వరల్డ్ లోకి తీసుకెళ్తుందనే అభిప్రాయాన్ని కలిగించింది. వైజయంతీ మూవీస్‌ బ్యానర్ లో రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

'లవ్ మౌళి':
ఈ వారం థియేటర్లలో ఒక్క సినిమా రిలీజ్ అవుతుండగా.. ఓటీటీలో సైతం ఒకే ఒక్క తెలుగు చిత్రం స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. నవదీప్‌ హీరోగా నటించిన 'లవ్ మౌళి' మూవీ తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా జూన్‌ 27వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బోల్డ్ అండ్ లవ్‌ రొమాంటిక్‌ చిత్రంలో ఫంకూరీ గిద్వానీ హీరోయిన్ గా నటించింది. రానా దగ్గుపాటి క్యామియో అప్పీరియన్స్ ఇచ్చారు. ఈ మధ్యనే థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బిగ్ స్క్రీన్ మీద పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తుందో చూడాలి.

ఈ వారం ఓటీటీలో అలరించే మరికొన్ని సినిమాలు, వెబ్ సిరీసులు ఇవే!
అమెజాన్‌ ప్రైమ్‌  వీడియో:
సివిల్‌ వార్‌ (తెలుగు డబ్బింగ్‌) - జూన్‌ 28
శర్మాజీ కీ బేటీ (హిందీ) - జూన్‌ 28

నెట్‌ ఫ్లిక్స్‌:
వరస్ట్‌ రూమ్మేట్‌ ఎవర్‌ 2 (వెబ్‌ సిరీస్‌) - జూన్‌ 26
దట్‌ నైన్టీస్‌ 2 (వెబ్‌ సిరీస్‌) - జూన్‌ 27
సుపాసెల్‌ (వెబ్ సిరీస్‌) - జూన్‌ 27
మై లేడీ జానీ (వెబ్‌ సిరీస్) - జూన్‌ 27
ఎ ఫ్యామిలీ ఎఫైర్‌ (ఇంగ్లీష్) - జూన్‌ 28
ఓనింగ్‌ మాన్‌ హట్టన్‌ (వెబ్‌ సిరీస్‌) - జూన్‌ 28
ది వర్ల్‌ విండ్‌ (కొరియన్‌ సిరీస్‌) - జూన్‌ 28

డిస్నీ+హాట్‌ స్టార్‌:  
ది బేర్‌ (వెబ్‌ సిరీస్‌) - జూన్‌ 27
జీ5:
రౌతూ కా రాజ్‌ (హిందీ) - జూన్‌ 28

Also Read: KALKI VS KALKI 2898 AD: 'కల్కి' మూవీ టికెట్ బుకింగ్స్‌పై రాజశేఖర్‌ ఫన్నీ పోస్ట్ వైరల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget