Kalki 2898 AD: నాని to రానా - ‘కల్కి 2898 AD’లో ఇంతమంది గెస్ట్ రోల్స్ చేస్తున్నారా? ఎవరెవరు ఏ పాత్రలో కనిపిస్తారంటే..
Kalki 2898 AD: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లోని ‘కల్కి 2898 AD’లో మేకర్స్ రివీల్ చేసిన స్టార్ క్యాస్టింగ్ కాకుండా మరెందరో స్టార్లు గెస్ట్ రోల్స్ చేయనున్నారని తెలుస్తోంది. వారెవరో మీరూ చూసేయండి.
Guest Roles In Kalki 2898 AD: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ప్యాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898 AD’.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా ఎలా ఉండబోతుందో ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ చూడనున్నారు. ఇదే సమయంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ వార్త.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మూవీ లవర్స్ అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ‘కల్కి 2898 AD’లో ఉండే స్టార్ క్యాస్టింగ్ గురించి మేకర్స్ రివీల్ చేశారు. కానీ రివీల్ చేయని యాక్టర్లు ఎంతోమంది ఉన్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.
రౌడీ హీరో క్యామియో..
‘కల్కి 2898 AD’ అనేది మోడర్న్ టెక్నాలజీతో, హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్‌తో తెరకెక్కినా కూడా ఇందులో మహాభారతం రిఫరెన్స్ ఉందనే విషయం ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచేస్తోంది. మహాభారతంలో ఎన్నో పాత్రలు ఉంటాయి. అయితే అందులోని ఒక్కొక్క ముఖ్యమైన పాత్ర కోసం ఒక్కొక్క స్టార్ హీరోను ఎంచుకున్నాడట దర్శకుడు నాగ్ అశ్విన్. ముందుగా తన క్లోజ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ.. మహాభారతంలోని అర్జునుడు పాత్ర పోషిస్తున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ మూవీలో విజయ్ దేవరకొండ ఒక కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకుల్లో రిజిస్టర్ అయ్యాడు. అప్పటినుండి వీరిద్దరికీ మంచి ఫ్రెండ్‌షిప్ ఉన్న విషయం తెలిసిందే.
ముగ్గురు హీరోలు..
‘కల్కి 2898 AD’ కథ మహాభారతంతో మొదలయ్యి.. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే అంశంపై ఎండ్ అవుతుంది అని నాగ్ అశ్విన్ ఇప్పటికే రివీల్ చేశాడు. ఇప్పటికే ఆ మహాభారతం ఎపిసోడ్‌లో అమితాబ్ బచ్చన్.. అశ్వద్ధామగా నటిస్తున్నారని రివీల్ అయ్యింది. కురుక్షేత్రంలో కీలకంగా మారిన అర్జునుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించనున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. తనతో పాటు నాని అభిమన్యుడిగా, రానా దుర్యోధనుడిగా సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారనే వార్త.. మూవీ లవర్స్‌ను మరింత ఎగ్జైట్ చేస్తోంది. ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా ఇంతమంది హీరోలు కలిసి కనిపించలేదని వారు ఫీలవుతున్నారు.
దర్శకులు కూడా..
నాని, విజయ్ దేవరకొండ, రానాతో పాటు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కూడా ‘కల్కి 2898 AD’ సినిమాలోని ముఖ్యమైన సీన్స్‌లో మెరవనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వీరిద్దరూ వైజయంతీ బ్యానర్‌లో సినిమాలు చేశారు. కాబట్టి వీరిద్దరూ నిర్మాతలకు చాలా క్లోజ్. అందుకే గెస్ట్ రోల్‌లో కనిపించడానికి ఒప్పుకున్నారని తెలుస్తోంది. యాక్టర్లు మాత్రమే కాదు.. స్టార్ డైరెక్టర్లు కూడా ‘కల్కి 2898 AD’లో గెస్ట్ రోల్స్‌లో మెరవనున్నారని మరో వార్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీలో రాజమౌళి గెస్ట్ రోల్‌లో సర్‌ప్రైజ్ చేస్తారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతుండగా.. ఆర్జీవీ కూడా ఇందులో క్యామియో చేశారని మరో వార్త వైరల్ అయ్యింది. ‘కల్కి 2898 AD’లో స్టార్ క్యాస్టింగ్, గెస్ట్ రోల్స్ చూస్తుంటే ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.
Also Read: ‘కల్కి 2898 AD’ కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?