(Source: ECI/ABP News/ABP Majha)
Prabhas Remuneration: ‘కల్కి 2898 AD’ కోసం ప్రభాస్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా?
Kalki 2898 AD: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రమే ‘కల్కి 2898 AD’. ఈ మూవీ కోసం ప్రభాస్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
Prabhas Remuneration For Kalki 2898 AD: ఒక్క సినిమా హిట్ అవ్వగానే యాక్టర్లు.. తమ రెమ్యునరేషన్ పెంచేస్తారు అన్నది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అదే ఆ మూవీతో వారికి ప్యాన్ ఇండియా రేంజ్ పాపులారిటీ దక్కిందంటే.. ఇక ప్రతీ మూవీకి రెమ్యునరేషన్ పెరుగుతూనే ఉంటుంది. అందులో హీరోల రెమ్యునరేషన్ అనేది ఎప్పుడూ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రేక్షకులంతా ‘కల్కి 2898 AD’ గురించే మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఇందులో యాక్టర్ రెమ్యునరేషన్ ఎంత అయ్యింటుంది అని గెస్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా ఈ మూవీ కోసం ప్రభాస్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో బయటికొచ్చింది.
ఒక్క సినిమాకే..
‘కల్కి 2898 AD’ మూవీపై ప్రేక్షకుల్లో హైప్ మామూలుగా లేదు. ముందు నుండే కొత్తగా ట్రై చేస్తున్నాం, అందుకే సినిమా రావడానికి ఇంత సమయం పడుతుంది అంటూ నాగ్ అశ్విన్ హింట్ ఇస్తూనే ఉన్నాడు. ఇక ఈ మూవీకి సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ బయటికొస్తుంటే నిజంగానే ‘కల్కి 2898 AD’ని హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించారని ప్రేక్షకులు అనుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ సినిమా కోసం దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుండి కష్టపడుతున్నాడు ప్రభాస్. అందుకే దీనికోసం భారీ రెమ్యునరేషన్‌నే ఛార్జ్ చేసినట్టు తెలుస్తోంది. తన చివరి మూవీ ‘సలార్’ కోసం రూ.120 కోట్ల రెమ్యునరేషన్‌ను అందుకున్న ఈ ప్యాన్ ఇండియా హీరో.. ఇప్పుడు ‘కల్కి 2898 AD’ కోసం దానిని మరికాస్త పెంచేసినట్టు సమాచారం.
తొలి తెలుగు హీరో..
‘కల్కి 2898 AD’ కోసం ఏకంగా రూ.150 కోట్లను రెమ్యునరేషన్‌గా అందుకున్నాడట ప్రభాస్. ‘సలార్’కు, ‘కల్కి 2898 AD’కు ఏకంగా రూ.30 కోట్లు పెంచేశాడా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఇక జూన్ 27న విడుదల కానున్న ఈ మూవీ హిట్ అయితే తన రెమ్యునరేషన్ కచ్చితంగా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ రేంజ్‌లో రెమ్యునరేషన్‌ను ఏ తెలుగు హీరో కూడా తీసుకోకపోవడం విశేషం. సౌత్‌లో ఇప్పటివరకు విజయ్, రజినీకాంత్ లాంటి హీరోలు మాత్రం రూ.100 కోట్లకు పైగా పారితోషికం అందుకునేవారు. ఇప్పుడు ఆ రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకుంటున్న మొదటి తెలుగు హీరోగా ప్రభాస్ నిలిచాడు.
గెస్ట్ రోల్స్..
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’లో ప్రభాస్‌కు జోడీగా దిశా పటానీ నటించింది. ఇందులో మరో కీలక పాత్రలో మరో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె కనిపించనుంది. వీరు మాత్రమే కాకుండా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి నటులు కూడా ‘కల్కి 2898 AD’ స్టార్ క్యాస్టింగ్‌లో భాగమయ్యారు. మూవీ టీమ్ బయటపెట్టిన నటీనటులు కాకుండా ఇంకా ఇందులో చాలామంది స్టార్లు గెస్ట్ రోల్స్‌లో కనిపించనున్నారని తెలుస్తోంది. తాజాగా విడుదలయిన మూవీ ట్రైలర్ ఆకట్టుకోవడంతో ‘కల్కి 2898 AD’ ప్రీ బుకింగ్స్ విషయంలో పోటీ మొదలయ్యింది. ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోనే ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది.
Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు చేతులు జోడించి క్షమాపణలు చెప్తున్నాను, నన్ను తిట్టుకోవద్దు - అమితాబ్ బచ్చన్