Kajal Aggarwal: కొడుక్కి దిష్టి తగలకుండా కాజల్ ఏం చేసిందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో చూశారా?

కాజల్ అగర్వాల్ కుమారుడి ఫొటోలు బయటకు వచ్చాయి. అయితే, ఒక్క విషయం గమనించారా? కొడుక్కి దిష్టి తగలకుండా కాజల్ జాగ్రత్తలు తీసుకున్నారు.

FOLLOW US: 

Mothers Day 2022: ఈ రోజు మాతృ దినోత్సవం సందర్భంగా తన కుమారుడు నీల్ కిచ్లూ (Neil Kitchlu First Photo) ఫొటోను కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) షేర్ చేశారు. సూర్యచంద్రులు, నక్షత్రాలు, తన సర్వస్వం చిన్నారి నీల్ అని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. అంతే కాదు, తన కుమారుడు నీల్‌ను ఎత్తుకుని మురిసిపోయిన కుటుంబ సభ్యులు ఫొటోలనూ షేర్ చేశారు.

కాజల్ అగర్వాల్ అత్తమామలు, తల్లిదండ్రులు, చెల్లెలు నిషా అగర్వాల్, కొంత మంది బంధువులు... నీల్ కిచ్లూను చూసి అగర్వాల్, కిచ్లూ కుటుంబ సభ్యులు, బంధువులు మురిసిపోయారు. నీల్‌తో వాళ్ళందరూ దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కాజల్ అగర్వాల్ షేర్ చేశారు. అయితే... కుమారుడికి దిష్టి తగలకుండా జాగ్రత్త పడ్డారని చెప్పాలి. 

నీల్ ఫొటోలను కాజల్ అగర్వాల్ షేర్ చేశారు. అయితే, ఒక్కసారి ఆ ఫొటోలు చూడండి. ఎక్కడా నీల్ ముఖం కనిపించదు. చిన్నారి ఫేస్ కనిపించకుండా స్మైలీ, లవ్ ఎమోజీలతో కవర్ చేశారు కాజల్. చిన్ని పిల్లలను కొన్ని రోజుల పాటు ఎవరికీ చూపించవద్దని పెద్దలు చెబుతుంటారు. దిష్టి తగులుతుందని! బహుశా... కాజల్ కూడా అందువల్లే నీల్ ఫేస్ కవర్ చేశారేమో!? 

ఏది ఏమైనా కాజల్ కుమారుడి ముఖాన్ని చూడటానికి ప్రేక్షకులు కొన్ని రోజులు ఎదురు చూడాలి. శ్రియ శరణ్ సైతం చాలా రోజుల వరకూ తన చిన్నారి ముఖాన్ని ప్రేక్షకులకు చూపించలేదు. ఇటీవల గోవా నుంచి పోస్ట్ చేసిన ఫొటోల్లో శ్రియ అమ్మాయి రాధ ఫేస్ కనిపించింది.

Also Read: కాబోయే భార్యకు లిప్ కిస్ ఇస్తూ గుడ్ న్యూస్ చెప్పిన రాహుల్ రామకృష్ణ

కాజల్ విషయానికి వస్తే... కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లూ (Gautam Kitchlu) దంపతులకు ఈ ఏడాది ఏప్రిల్ 19న అబ్బాయి పుట్టాడు. గత ఏడాది వీళ్ళ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. 

Also Read: 'ది వారియర్' టీజర్‌తో రానున్న రామ్, ఊర మాస్ విజువల్స్ చూడటానికి రెడీనా?

View this post on Instagram
 
A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial)

Published at : 08 May 2022 03:49 PM (IST) Tags: kajal aggarwal Kajal Kajal Aggarwal Son Neil Kitchlu Mothers Day 2022 Kajal Son Neil First Photo Kajal Hides Her Son Neil Face Neil Kitchlu Photos

సంబంధిత కథనాలు

Sriya Lenka: 'K-పాప్' ఆర్టిస్ట్ గా ఎన్నికైన ఇండియన్ అమ్మాయి - ఎవరంటే?

Sriya Lenka: 'K-పాప్' ఆర్టిస్ట్ గా ఎన్నికైన ఇండియన్ అమ్మాయి - ఎవరంటే?

NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

టాప్ స్టోరీస్

Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !

Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !

AP TS 10th Exam Results: ఆ తేదీల్లో ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్ - తెలంగాణలో స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం

AP TS 10th Exam Results: ఆ తేదీల్లో ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదలయ్యే ఛాన్స్ - తెలంగాణలో స్పాట్ వ్యాల్యుయేషన్ ప్రారంభం

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?

Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?