Rahul Ramakrishna Marriage: కాబోయే భార్యకు లిప్ కిస్ ఇస్తూ గుడ్ న్యూస్ చెప్పిన రాహుల్ రామకృష్ణ
నటుడు రాహుల్ రామకృష్ణ త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. ఆదివారం ఉదయం ట్విట్టర్ వేదికగా ఈ న్యూస్ చెప్పారు.
![Rahul Ramakrishna Marriage: కాబోయే భార్యకు లిప్ కిస్ ఇస్తూ గుడ్ న్యూస్ చెప్పిన రాహుల్ రామకృష్ణ Rahul Ramakrishna to marry soon, he introduces his fiancé by sharing lip lock photo Rahul Ramakrishna Marriage: కాబోయే భార్యకు లిప్ కిస్ ఇస్తూ గుడ్ న్యూస్ చెప్పిన రాహుల్ రామకృష్ణ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/08/d1368903f96c1ac31695200603f0020a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నటుడు రాహుల్ రామకృష్ణ త్వరలో ఏడడుగులు వేయనున్నారు. కొన్ని రోజులుగా ఆయన ప్రేమలో ఉన్నారు. అయితే, ఆ అమ్మాయి ఎవరు? ఆమె పేరు ఏంటి? ఏ ఊరు? వంటి వివరాలు వెల్లడించలేదు. కానీ, ప్రేమలో ఉన్న విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. త్వరలో పెళ్లి చేసుకోనున్నట్టు ట్వీట్ చేశారు. తనకు కాబోయే భార్యకు లిప్ కిస్ ఇస్తున్న ఫొటో షేర్ చేసి, అసలు విషయం చెప్పారు. ''ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నాం, త్వరలో'' అని రాహుల్ రామకృష్ణ తెలిపారు.
నిజానికి, మూడు రోజుల క్రితమే ఇన్‌స్టాగ్రామ్‌లో కాబోయే భార్యకు లిప్ కిస్ ఇస్తున్న ఫొటో షేర్ చేశారు రాహుల్ రామకృష్ణ. 'మీట్ హర్' అంటూ ఆమెను పరిచయం చేశారు. రియల్ లైఫ్ ఫొటోనా? రీల్ లైఫ్ (సినిమా / వెబ్ సిరీస్) ఫొటోనా? అని కొంత మంది కన్‌ఫ్యూజ్ అయ్యారు. అయితే... ఈ రోజు క్లారిటీ వచ్చింది.
Also Read: కాజల్ అగర్వాల్ కుమారుడిని చూశారా? ఫస్ట్ ఫొటో బయటకు వచ్చేసింది!
రాహుల్ రామకృష్ణ పెళ్లి విషయం ప్రకటించిన విధానంపై కొంత మంది నెటిజన్లు సరదాగా స్పందించారు. 'అర్జున్ రెడ్డి ఫ్రెండ్ అంటే అట్లుంటది మరి' అని ఒకరు, 'అర్జున్ రెడ్డి టెర్రస్ సీన్ రీ క్రియేట్ చేస్తున్న రాహుల్ రామకృష్ణ' అని ఇంకొకరు, 'అర్జున్ రెడ్డిని చూసి ప్రభావితం అయిన శివ' అని మరొకరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. 'అర్జున్ రెడ్డి' సినిమాతో రాహుల్ రామకృష్ణకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు హిట్ సినిమాలు చేశారు. 'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్ స్నేహితుడిగా కనిపించారు.Also Read: 'ది వారియర్' టీజర్‌తో రానున్న రామ్, ఊర మాస్ విజువల్స్ చూడటానికి రెడీనా?
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)