Kajal Aggarwal : కట్టప్పలా మారిన కాజల్ - బాహుబలి ఎవరో చూశారా రాజమౌళి గారూ?
'బాహుబలి'లో కట్టప్పలా మారిపోయారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. కొడుకు నీల్‌తో కలిసి ఐకానిక్ సీన్ రీక్రియేట్ చేశారు.
![Kajal Aggarwal : కట్టప్పలా మారిన కాజల్ - బాహుబలి ఎవరో చూశారా రాజమౌళి గారూ? Kajal Aggarwal Becomes Kattappa For Son Neil Kitchlu Kajal recreates iconic Kattappa Scene From Baahubali with Son Neil, Tamannaah bhatia reacts with cute message Kajal Aggarwal : కట్టప్పలా మారిన కాజల్ - బాహుబలి ఎవరో చూశారా రాజమౌళి గారూ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/11/bc0fadbbaa6c215f660b5021aa6c699d1660216878166313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'బాహుబలి' (Baahubali) అంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గుర్తు వస్తారు. అలాగే, భల్లాలదేవ పాత్రలో నటించిన రానా దగ్గుబాటి! వీళ్ళిద్దరితో పాటు సత్యరాజ్ పోషించిన కట్టప్ప రోల్ కూడా గుర్తు వస్తుంది. 'బాహుబలి 2' మీద అంత హైప్ రావడానికి కారణం కూడా కట్టప్పే! 'బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?' అనేది వైరల్ అయ్యింది. బాహుబలి కాలును తీసి కట్టప్ప నెత్తిన పెట్టుకునే సీన్ గూస్ బంప్స్ ఇచ్చింది. ఇప్పుడు ఆ ఐకానిక్ సీన్‌ను కాజల్ అగర్వాల్ రీ క్రియేట్ చేశారు.
అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కొన్ని రోజులుగా సినిమాలు, షూటింగుల నుంచి విశ్రాంతి తీసుకున్నారు. కుమారుడు నీల్ కిచ్లూ (Neil Kitchlu) కడుపులో పడినప్పటి నుంచి మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. వీలైనంత సమయాన్ని కుమారుడితో గడుపుతున్నారు. లేటెస్టుగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఆమె ఒక ఫోటో పోస్ట్ చేశారు.
కాజల్ పోస్ట్ చేసిన ఫోటో చూస్తే... అందులో ఆమె నుదిటిపై ఒక చిన్నారి పాదం ఉంటుంది. అది ఎవరిదో తెలుసా? కాజల్ కుమారుడు నీల్ కిచ్లూది. ''రాజమౌళి గారూ... నేను, మా అబ్బాయి నీల్ కలిసి ఈ మూమెంట్‌ను మీకు అంకితం ఇస్తున్నాం. ఇవ్వకుండా ఎలా ఉండగలం?'' అని ఆ ఫోటోకి కాప్షన్ ఇచ్చారు. 'బాహుబలి'లో సీన్‌ను ఆమె రీ క్రియేట్ చేశారు.
ఇప్పుడు కాజల్, ఆమె కుమారుడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె అభిమానులతో పాటు 'బాహుబలి' ఫ్యాన్స్‌కు ఈ ఫోటో విపరీతంగా నచ్చింది. ''క్యూటెస్ట్ నీల్ అండ్ మమ్మీ'' అని తమన్నా భాటియా పేర్కొన్నారు.
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన దృశ్య కావ్యం 'బాహుబలి' బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టించింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రికార్డు ఆ సినిమా పేరు మీదే ఉంది. ఆ సినిమాలో సీన్ కాజల్ రీ క్రియేట్ చేయడం విశేషం.
Also Read : లాల్ సింగ్ చడ్డా రివ్యూ : ఆమిర్ సినిమా ఎలా ఉంది? హిందీలో నాగ చైతన్యకు గ్రాండ్ ఎంట్రీ లభిస్తుందా? లేదా?
కాజల్ అగర్వాల్ తన కెరీర్ స్టార్టింగులో రాజమౌళి దర్శకత్వంలో నటించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'మగధీర' సినిమాలో మిత్రవింద పాత్రలో ఆమె కనిపించారు. తర్వాత మళ్ళీ రాజమౌళి సినిమాలో కాజల్ నటించలేదు. కానీ, దర్శక ధీరుడిపై ఆమెకు గౌరవం ఉంది. ఆ ఓగౌరవాన్ని ఇలా చూపించారు.
కాజల్ సినిమాలకు వస్తే... సెప్టెంబర్ నెలలో కమల్ హాసన్ 'ఇండియన్ 2' (తెలుగులో 'భారతీయుడు 2') షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా నుంచి ఆమెను తప్పించారని ప్రచారం జరిగింది. కానీ, తాను సినిమా చేస్తున్నట్టు ఇటీవల కాజల్ వెల్లడించారు. కమల్ సరసన ఆమె నటిస్తున్నారు. సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ మరో జంటగా నటిస్తున్నారు.
Also Read : రూ.10 కోట్ల ఆఫర్ వదులుకున్న అల్లు అర్జున్ - అభిమానుల కోసమే అలా చేశాడట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)